Ajit seth
-
కేంద్ర కేబినెట్ కార్యదర్శి సేథ్ పదవీకాలం పొడగింపు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని పొడగించారు. ఈ నెల 13తో సేథ్ పదవీకాలం ముగియనుండగా, మరో ఆరు నెలల పాటు పొడగించారు. దీంతో సేథ్ వచ్చే ఏడాది జూన్ వరకు కేబినెట్ కార్యదర్శిగా కొనసాగుతారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. -
ఎబోలా నిరోధానికి కసరత్తు
19, 20 తేదీల్లో రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో శిక్షణ న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి, పశ్చివూఫ్రికా దేశాల్లో దాదాపు 4వేలమందికిపైగా వుృతికి కారణమైన భయనక ఎబోలా వ్యాధి నిర్ధారణ, నిరోధంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి నిర్వహించిన ఉన్నతస్థారుు సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు. ఈ నిర్ణయుంమేరకు ఎబోలా నిరోధంపై వివిధ రాష్ట్రప్రభుత్వాల అధికారులు ఈ నెల 19,20 తేదీల్లో ఢిల్లీలో శిక్షణపొందుతారని, వారు తవుతవు రాష్ట్రాలకు తిరిగివచ్చి, అధికారులకు శిక్షణ ఇస్తారని అధికారవర్గాలు తెలిపారుు. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయూణికుడి కీ ఎబోలా పరీక్షలు నిర్వహించేందుకు తవు తవు రాష్ట్రాల్లోని వివూనాశ్రయూల్లో, ఓడరేవుల్లో తగిన ఏర్పాట్లు చేయూలని, ఎబోలా వైరస్ సోకిన వారెవరూ దేశంలోకి రాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు. ఎబోలా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, నిరోధంపై పూర్తిశ్రద్ధతో వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిం చింది. జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి ఎబోలా వ్యాధిలక్షణాలున్నవారితో అతి దగ్గరి శారీరక సంబంధాలవల్లనే ఎబోలా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8వేల మందికి పైగా ఎబోలా వ్యాధి సోకగా, వారిలో 4వేల మంది మరణించారు. కాగా, ఆఫ్రికా దేశాలనుంచి దేశంలో ప్రవేశించే ప్రయణికులందరిపైనా, ఎబోలా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అంతర్జాతీయు విమానాశ్రయూలన్నింటిలోనూ, అంతర్జాతీయు విమానాలు దిగే పుణె, నాగపూర్ విమానాశ్రయూల్లోను థర్మల్ ఇమేజి స్కానర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరఫు న్యాయవాది రూయ్ రోడ్రిజెస్ ఈ విషయన్ని బొంబాయి హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఇదిలా ఉండగా, ఎబోలా సంక్షోభం ఇలాగే కొనసాగిన పక్షంలో అది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
నిత్యావసరాల ధరలపై అజిత్ సేథ్ సమీక్ష
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ధరల పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ శనివారం వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించనున్నందున ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఆయన సమీక్షించారు. కాయగూరలు, పళ్లు, పాలు తదితర నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్ మాసాంతానికి రిటైల్ ద్రవ్యోల్బణం 8.59 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి ఈ భేటీ నిర్వహించారు. ఈ సమీక్షకు వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధరల నియంత్రణకు కొత్త ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా సేథ్ అధికారులకు వివరించినట్టు తెలిసింది. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ధరల పెరుగుదలను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఇక ఆర్థిక వెలుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలో వచ్చే సోమవారం అధికారం చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వంపై వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పూర్తి ఆశావహంగా ఉన్నాయి. మోడీ పాలనలో పారిశ్రామిక ప్రగతి వెల్లివిరుస్తుందనీ, ఆర్థిక రథ చక్రాలు పరుగందుకుంటాయనే నమ్మకం ఆయా వర్గాల్లో ద్యోతకమవుతోంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది. హామీలు అమలు చేస్తే చాలు: జేపీ మోర్గాన్ ఏఎంసీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేస్తే సమీప భవిష్యత్తులోనే ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని జేపీ మోర్గాన్ ఏఎంసీ తెలిపింది. కొత్త ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఆర్థిక పరిస్థితి మెరుగవడం మొదలవుతుంది. తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయి. సెన్సెక్స్ మరింత ఊపందుకుంటుందని సంస్థ పేర్కొంది. 2.3 శాతానికి క్యాడ్...: సిటీ గ్రూప్ అంచనా ఎగుమతుల పెంపు, దిగుమతుల తగ్గింపుపై మోడీ సర్కార్ దృష్టిసారించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం ఉండవచ్చని సిటీగ్రూప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో క్యాడ్ 3,600 కోట్ల డాలర్లు లేదా జీడీపీలో రెండు శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇది కొంచెం హెచ్చుస్థాయిలో 2.3 శాతం వరకు ఉండవచ్చని అంచనావేసింది. బుధవారం విడుదల చేసిన నివేదికలో సిటీగ్రూప్ తెలిపిన అంశాలు: చమురు, బొగ్గు, ఇనుప ఖనిజం రంగాలు 2014-15లో క్యాడ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ముడిచమురు ధరలు పెరిగి, డిమాండు క్షీణించడంతో ఈ ఏడాది చమురు దిగుమతుల బిల్లు 10 శాతం మేరకు తగ్గవచ్చు. ఆర్థిక అంశాలపై బీజేపీ ధోరణినిబట్టి అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలను కొత్త ప్రభుత్వం చేపట్టవచ్చు. రికవరీ గణాంకాలు క్రమక్రమంగా వెల్లడవుతాయి. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 6.5 శాతానికి పెరగవచ్చు. కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంస్థాగత సవరణల ఫలితాలు 2015-16, 2016-17లలో ప్రతిబింబిస్తాయి. మెరుగైన పాలన కావాలి: వొడాఫోన్ ఇండియా మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెరుగైన పాలనను, వాణిజ్య వ్యవహారాల్లో మరింత పారదర్శకతను అందిస్తుందని టెలికం దిగ్గజం వొడాఫోన్ పేర్కొంది. నిన్నటి వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో సుపరిపాలనను చూశామని కంపెనీ ఎండీ, సీఈఓ మార్టెన్ పీటర్స్ చెప్పారు. గుజరాత్లో వొడాఫోన్ మార్కెట్ లీడర్‌గా ఉంది. సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: వేదాంత చైర్మన్ అగర్వాల్ దేశంలో వెలికితీయకుండా ఉన్న సహజ వనరులను సద్వినియోగపర్చుకునే చర్యలను మోడీ సర్కార్ చేపడుతుందని ఆశిస్తున్నట్లు వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇందుకుగాను తగిన సంస్కరణలకు, విధాన నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ధరలపై ఉన్నతాధికారుల సమీక్ష నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో దేశంలో ధరల పరిస్థితిని ఉన్నతాధికారులు మదింపుచేశారు. రుతుపవనాలు విఫలమైతే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సన్నద్ధతను పరిశీలించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను సమీక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపితే ఆహార ధాన్యాల లభ్యత ఏస్థాయిలో ఉంటుందనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
పై-లీన్‌పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షణ
న్యూఢిల్లీ: ప్రచండ తుపాను పై-లీన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్సేత్ శనివారం పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వారి సన్నద్ధతను పర్యవేక్షించారు. ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన సహాయక చర్యలు, తుపాను తీరం దాటిన తర్వాత సాధారణ పరిస్థితులు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో శాఖల వారీగా బాధ్యతలను నిర్దేశించారు. హోం, రక్షణ, పెట్రోలియం, టెలికం, ఆరోగ్య, ఆహార, రైల్వే, తాగునీరు సహా పలు శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. శాఖల మ ధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈ భేటీలో తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తుపాను తీరం దాటిన తర్వాత ఇంధన కొరత లేకుండా చూసేందుకు, సమాచార వ్యవస్థను పునరుద్ధరించేందుకు టెలికం, పెట్రోలియం శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేశాయని వెల్లడించాయి. మూడు రోజులకు సరిపడా ఇంధనం, వంటగ్యాస్‌ను అందుబాటులో ఉంచారు. విద్యుత్ వ్యవస్థకు విఘాతం కలిగితే, రైళ్లను నడిపేందుకు డీజిల్ ఇంజిన్లను రైల్వే శాఖ సిద్ధంగా ఉంచింది. కనీస నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు కూడా తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించేందుకు వైద్య బృందాలను రంగంలోకి దింపినట్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కూడా సహాయక కార్యక్రమాల కోసం పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. 1990 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థాయిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇదే మొదటిసారని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.