Akash Kumar
-
‘శరభ’ మూవీ రివ్యూ
టైటిల్ : శరభ జానర్ : సోషియో ఫాంటసీ తారాగణం : ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్, పొన్వన్నన్ సంగీతం : కోటి దర్శకత్వం : ఎన్. నరసింహారావు నిర్మాత : అశ్వనీ కుమార్ సహదేవ్ ఒకప్పుడు టాలీవుడ్లో సోషియో ఫాంటసీల ట్రెండ్ బాగా కనిపించేది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు పెద్దగా రాలేదు. దీంతో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన శరభ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జయప్రధ లాంటి సీనియర్ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం కూడా శరభకు కలిసొచ్చింది. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ కుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..? కథ ; శరభ (ఆకాష్ కుమార్) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్వన్నన్) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. గురువుగారు దివ్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను శరభ, పార్వతమ్మలకు అప్పగిస్తాడు. చిన్న గొడవతో ప్రారంభమైన దివ్య, శరభల పరిచయం తరువాత ప్రేమగా మారుతుంది. అదే సమయంలో దివ్య ప్రమాదంలో ఉందని తెలుస్తోంది. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన ఓ రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అసలు శరభ గతం ఏంటి..? ఆ రాక్షసుడు దివ్యను ఎందుకు బలి ఇవ్వాలనుకున్నాడు..? రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హీరో ఆకాష్ కుమార్ మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీన్స్‌లో పరవాలేదనిపంచినా నటన పరంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి తన పరిధి మేరకు పరవాలేదనిపించింది. ఇక పార్వతమ్మ పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జయప్రధ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా హుందాగా కనిపించారు. చాల కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన పునీత్ ఇస్సార్, నెపోలియన్లను తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో నాజర్, పొన్వన్నన్, చరణ్ దీప్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్, గ్రాఫిక్స్ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; జయప్రధ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ ; కథనం ఫస్ట్ హాఫ్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మొదటి సినిమా గుర్తొస్తోంది
‘‘నా మొదటి చిత్రం (‘భూమి కోసం’) రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో మళ్లీ ఇప్పుడు ‘శరభ’ సినిమాకీ అంతే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి పాత్రకి దర్శకుడు జీవం పోశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘శరభ’ లాంటి మంచి ఫీల్ ఉన్న చిత్రంతో రావడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్. నరసింహా రావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘శరభ’. జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన్. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘20ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందించా. తొలి చిత్రంలోనే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆకాష్ కుమార్, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
దైవశక్తితో పోటీ
ఆకాష్ కుమార్ హీరోగా, జయప్రద ముఖ్య పాత్రలో ఎన్. నరహింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శరభ’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. నరసింహారావు మాట్లాడుతూ–‘‘దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. క్షుద్ర శక్తుల నుంచి తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడిన తాపత్రయం ఈ చిత్రం ముఖ్య కథాంశం. తల్లి పాత్రలో జయప్రద అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం హీరో ఆకాష్ చాలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘కథకు అనుగుణంగా సినిమాలో వచ్చే 55 నిమిషాల గ్రాఫిక్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇందులో దాదాపు 1269 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అశ్వనీ కుమార్. నాజర్, నెపోలియన్, ప్రవీణ్ నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. -
దేవుడు మనతోనే ఉంటాడు
‘ఫైర్ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు..బాడీ మార్చురీలో ఉంటుంది. దేవుడికే దెయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనం అవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు’ వంటి డైలాగ్స్ ‘శరభ’ చిత్రంపై ఆసక్తి పెంచుతున్నాయి. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘శరభ’. జయప్రద, నెపోలియన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఏ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయనున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చేసిన ప్రోస్థటిక్ మేకప్, సీజీ వర్క్ ప్రత్యేక ఆకర్షణలు. చిరంజీవిగారు ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి, ‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన టీజర్‌కి భారీ స్పందన లభించింది. కోటిగారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో కాంబినేషన్లో రూపొందిన మా చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడం విశేషం’’ అన్నారు. పునీత్ ఇస్సార్, తనికెళ్ల, ఎల్.బి.శ్రీరామ్, సాయాజీ షిండే, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమణ సాల్వ. -
సినిమాలో ఆ మ్యాజిక్ ఉంటే హిట్టే
– ‘దిల్’ రాజు ‘‘నరసింహ మా బ్యానర్లో కో–డైరెక్టర్‌గా పని చేశాడు. ఓ రోజు ‘శరభ’ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నానన్నాడు. రీసెంట్గా టీజర్ చూíసి, థ్రిల్ అయ్యా. టీజర్లో మేజిక్ ఉంది. సినిమా అంతా అదే మేజిక్ ఉంటే సూపర్‌హిట్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆకాశ్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. కొంత మంది నిర్మాతలు కథ బావుందని అన్నా, బడ్జెట్ విషయంలో వెనకడుగువేశారు. ఆ సమయంలో ఆకాశ్ తండ్రిగారిని కలిస్తే తన కొడుకుతో ఈ సినిమా చేయమన్నారు. సినిమా కోసం 30 కోట్లు ఖర్చుపెట్టడం కాదు. ఆయన కొడుకు భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టిన నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆకాశ్ కుమార్ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రోషన్ సాలూరి సంగీతం అందించాడు. నేను సహాయంగా ఉన్నానంతే. కథకు తగ్గట్టే మంచి సంగీతం, నేపథ్య సంగీతం కుదిరింది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నటుడు ఎల్.బి. శ్రీరాం, ప్రజాకవి గొరేటి వెంకన్న పాల్గొన్నారు. -
కోలీవుడ్ అంటేనే ఇష్టం
తమిళసినిమా: తనకు తమిళ చిత్రపరిశ్రమ అంటేనే చాలా ఇష్టం అని ప్రముఖ నటి జయప్రద పేర్కొన్నారు. నినైత్తాలే ఇనిక్కుమ్ చిత్రంలో ఇటు కమలహాసన్, అటు రజనీకాంత్‌తో కలిసి నటించి మెప్పించిన నటి జయప్రదను కోలీవుడ్ ఎప్పటికీ మరచిపోదు. అయితే ఒక్క తమిళంలోనే కాకుండా, దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి అగ్రనటిగా రాణించిన జయప్రద ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి నటనకు దూరం అయ్యారు. ఆ తరువాత అడపాదడపా తెలుగు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించినా, కోలీవుడ్‌కు మాత్రం చాలా కాలం తరువాత యాగం అనే చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఐదేళ్ల తరువాత మళ్లీ కోలీవుడ్‌కు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద మాట్లాడుతూ ఐదేళ్ల తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ అవడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి కథా చిత్రం అయితే బాగుంటుందనిపించిదన్నారు. అలాంటి సమయంలో యాగం చిత్ర దర్శకుడు నరసింహ తనను కలిసి ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరారన్నారు. తను రెండేళ్లకు పైగా ఎంతో హోమ్ వర్క్ చేసి ఈ కథను తయారు చేశారని తెలిపారు. తాను పలు భాషల్లో నటించినా తమిళ చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. తమిళంలో యాగం పేరుతోనూ, తెలుగులో శరభ పేరుతోనూ రూపొందుతోందని చెప్పారు. ఇది మానవ శక్తి, దైవశక్తి, దుష్టశక్తి మధ్య జరిగే కథా చిత్రం అని వెల్లడించారు. ఇందులో కొడుకును కాపాడుకోవడానికి తపన పడే తల్లిగా తాను నటించానని, ఇది అభియనయానికి చాలా అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. ఇక మంచి చిత్రంలో తానూ ఇక భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి జయప్రద పేర్కొన్నారు. ఏఎస్కే ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్.నరసిమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శంకర్ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జయప్రద, నెపోలియన్, నాజర్, పోన్వన్నన్, ఎంఎస్.భాస్కర్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రలను పోషించారు. కోటి సంగీతాన్ని అందించారు. చిత్రాన్ని అక్టోబర్ ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. -
వావ్ అనకుండా ఉండలేకపోయా!
చిరంజీవి దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగిన యుద్ధంలో మానవశక్తి ఎలా సహాయపడిందనే కథతో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రమిది. నా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అలాంటి చిత్రమే’’ అన్నారు చిరంజీవి. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘శరభ’. ద గాడ్.. ఉపశీర్షిక. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను చిరంజీవి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ సిన్మాలోని కొన్ని సన్నివేశాలను చూశా. తనలో దుష్టశక్తి ఆవహించి, అప్పుడే పుట్టిన తన బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్న టైమ్‌లో జయప్రదగారు నటించిన తీరు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుంది. ఆమె నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయా. క్లైమాక్స్‌లో నరసింహస్వామి పూనిన తర్వాత ఆకాశ్ నటన కూడా అద్భుతం. దర్శకుడు విజువల్ వండర్‌గా సిన్మాను తీర్చిదిద్దారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది’’ అన్నారు. జయప్రద మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేయాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో దర్శకుడు ‘శరభ’ కథ చెప్పారు. చిరంజీవిగారి గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రేమ, ఆశీస్సులే మా బలం’’ అన్నారు. ‘‘పక్కా కమర్షియల్ చిత్రమిది. తండ్రి సెంటిమెంట్‌తో పాటు నరసింహస్వామి దైవబలం కూడా సినిమాలో ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. సురేశ్ కపాడియా, కథానాయిక మిస్తీ చక్రవర్తి, సినిమాటోగ్రాఫర్ రమణ సాల్వ తదితరులు పాల్గొన్నారు.