నరసింహారావు, ఆకాష్, జయప్రద, అశ్వనీకుమార్
‘‘నా మొదటి చిత్రం (‘భూమి కోసం’) రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో మళ్లీ ఇప్పుడు ‘శరభ’ సినిమాకీ అంతే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి పాత్రకి దర్శకుడు జీవం పోశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘శరభ’ లాంటి మంచి ఫీల్ ఉన్న చిత్రంతో రావడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని నటి జయప్రద అన్నారు.
ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్. నరసింహా రావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘శరభ’. జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన్. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘20ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందించా. తొలి చిత్రంలోనే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆకాష్ కుమార్, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment