దైవశక్తితో పోటీ | jayapradha lead role in Sharabha | Sakshi
Sakshi News home page

దైవశక్తితో పోటీ

Published Sun, Nov 4 2018 6:20 AM | Last Updated on Sun, Nov 4 2018 6:20 AM

 jayapradha lead role in Sharabha - Sakshi

జయప్రద

ఆకాష్‌ కుమార్‌ హీరోగా, జయప్రద ముఖ్య పాత్రలో ఎన్‌. నరహింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శరభ’. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అశ్వనీ కుమార్‌ సహదేవ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. నరసింహారావు మాట్లాడుతూ–‘‘దైవ శక్తికి, క్షుద్ర శక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. క్షుద్ర శక్తుల నుంచి తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి పడిన తాపత్రయం ఈ చిత్రం ముఖ్య కథాంశం.

తల్లి పాత్రలో జయప్రద అద్భుతంగా నటించారు. గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం హీరో ఆకాష్‌ చాలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘కథకు అనుగుణంగా సినిమాలో వచ్చే 55 నిమిషాల గ్రాఫిక్స్‌ సీన్స్‌  అద్భుతంగా ఉంటాయి. ఇందులో దాదాపు 1269 గ్రాఫిక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు అశ్వనీ కుమార్‌. నాజర్, నెపోలియన్, ప్రవీణ్‌ నటించిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement