సినిమాలో ఆ మ్యాజిక్‌ ఉంటే హిట్టే | Aakash and Mishti Chakraborthy's Sharabha Teaser launch on 18th september | Sakshi
Sakshi News home page

సినిమాలో ఆ మ్యాజిక్‌ ఉంటే హిట్టే

Published Tue, Sep 19 2017 12:48 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

సినిమాలో ఆ మ్యాజిక్‌ ఉంటే హిట్టే

సినిమాలో ఆ మ్యాజిక్‌ ఉంటే హిట్టే

– ‘దిల్‌’ రాజు

‘‘నరసింహ మా బ్యానర్‌లో కో–డైరెక్టర్‌గా పని చేశాడు. ఓ రోజు ‘శరభ’ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నానన్నాడు. రీసెంట్‌గా టీజర్‌ చూíసి, థ్రిల్‌ అయ్యా. టీజర్‌లో మేజిక్‌ ఉంది. సినిమా అంతా అదే మేజిక్‌ ఉంటే సూపర్‌హిట్‌ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ఆకాశ్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. ఎన్‌. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఇది.

కొంత మంది నిర్మాతలు కథ బావుందని అన్నా, బడ్జెట్‌ విషయంలో వెనకడుగువేశారు. ఆ సమయంలో ఆకాశ్‌ తండ్రిగారిని కలిస్తే తన కొడుకుతో ఈ సినిమా చేయమన్నారు. సినిమా కోసం 30 కోట్లు ఖర్చుపెట్టడం కాదు. ఆయన కొడుకు భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టిన నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆకాశ్‌ కుమార్‌ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రోషన్‌ సాలూరి సంగీతం అందించాడు. నేను సహాయంగా ఉన్నానంతే. కథకు తగ్గట్టే మంచి సంగీతం, నేపథ్య సంగీతం కుదిరింది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, నటుడు ఎల్‌.బి. శ్రీరాం, ప్రజాకవి గొరేటి వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement