Misti Chakravarthy
-
O Saathiya: నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. ఆకట్టుకుంటున్న మెలోడి
జీ జాంబి ఫేం ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఓ సాథియా’. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తాజాగా ఈ మూవీ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిపై ఘాడంగా ప్రేమిస్తున్న ప్రేమికుడి ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తున్నాయి. సాంగ్ టేకింగ్, పాటకు తగిన విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ పై వినోద్ కుమార్ (విన్ను) కట్టిన బాణీలు ఈ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్‌గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ సాంగ్ లెవెల్ పెంచేశాయని చెప్పుకోవచ్చు. -
వర్మ తిరుపతికెళ్లినప్పుడే ఊహించాను
‘నాన్నగారూ.. నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను..’ అనే హీరో ఆది చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ‘బుర్రకథ’ సినిమా టీజర్ వినోదాత్మకంగా ఉంది. ‘బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నా నాన్నగారూ..’’ అని ఆది చెప్పే డైలాగ్‌కి తండ్రి రాజేంద్రప్రసాద్ అవాక్కవుతాడు. ‘నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు’ అంటూ డాక్టర్ పోసాని కృష్ణమురళి చెప్పగానే.. ‘రామ్‌గోపాల్ వర ్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను’ అంటూ రాజేంద్రప్రసాద్ నిట్టూరుస్తాడు. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడో రకం’ సినిమాలతో రచయితగా పెద్ద విజయాల్ని అందుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. బీరమ్ సుధాకర్‌రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలుత పరిచయం అయిన వ్యక్తి రత్నబాబు. ఓ డైరెక్టర్‌కి దర్శకత్వశాఖతో పాటు సంభాషణలు రాయడంలో పరిజ్ఞానం ఉండాలని ఆయన వద్దే నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఏ దర్శకుడికైనా తొలి సినిమా ముఖ్యం. నేను, శివ నిర్వాణ తొలి సినిమా అడ్డంకిని విజయవంతంగా దాటివచ్చాం. ఇప్పుడు డైమండ్ రత్నబాబు వంతు. ‘బుర్రకథ’తో తను హిట్టు దర్శకుల జాబితాలతో నిలవాలి’’ అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ‘‘మరుధూరి రాజా తర్వాత నాకు బాగా ఇష్టమైన సంభాషణల రచయిత రత్నబాబు. దర్శకుడిగా అతడికి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆదితో చేయాల్సింది. కానీ, కుదరలేదు’’ అన్నారు డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. ‘‘రెండు బ్రెయిన్లు ఉన్న ఓ యువకుడి కథ ఇది. ఆ పాయింట్లో నుంచే వినోదం పుడుతుంది. రామ్, అభి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తెనాలి రామలింగడి తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. ‘‘డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఉంటుంది’’ అని ఆది తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, గాయత్రి గుప్తా, మణిచందన్, తదితరులు పాల్గొన్నారు. -
మే 24న ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర కథ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనరే బుర్ర కథ. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
అన్నింటికీ ధనమ్ మూలమ్
అధర్వ, మిస్తీ చక్రవర్తి జంటగా దర్శకుడు బద్రి వెంకటేశ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సెమ్మ బోథ ఆగాదే’. ఈ చిత్రాన్ని ‘ధనమ్ మూలమ్’ టైటిల్‌తో నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు ఈ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘కిక్కు ఎక్కిపోయెరా’ అనేది క్యాప్షన్. ‘‘ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రాజశేఖర్. ‘‘ఇదో క్రైమ్ థ్రిల్లర్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. తమిళంలో లాగానే తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు సహ నిర్మాత జె.వి. రామారావు. ఈ చిత్రానికి సమర్పణ: వీరబ్రహ్మాచారి అన్నభీమోజు, నిర్మాణం: గ్రేహాక్ మీడియా. -
మొదటి సినిమా గుర్తొస్తోంది
‘‘నా మొదటి చిత్రం (‘భూమి కోసం’) రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో మళ్లీ ఇప్పుడు ‘శరభ’ సినిమాకీ అంతే అసౌకర్యంగా అనిపిస్తోంది. ప్రతి పాత్రకి దర్శకుడు జీవం పోశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘శరభ’ లాంటి మంచి ఫీల్ ఉన్న చిత్రంతో రావడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా చేసారు. తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని నటి జయప్రద అన్నారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్. నరసింహా రావు దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం ‘శరభ’. జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యన్. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘20ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందించా. తొలి చిత్రంలోనే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ఆకాష్ కుమార్, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు. -
పోస్టర్ బాగుంది – పూరి జగన్నాథ్
కార్తీక్‌రాజ్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’. పూర్ణానంద్ .ఎం దర్శకత్వంలో ప్రతిమ .జి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘కార్తీక్‌రాజ్ నాకు చాలా రోజులుగా తెలుసు. వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ సినిమాతో కార్తీక్‌కి మంచి గుర్తింపు లభించాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’. సినిమా ఆద్యంతం ఫ్రెష్ లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణగారు చాలాకాలం తర్వాత యముడిగా కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మార్చిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘గమ్మత్తెన ప్రేమకథగా పూర్ణానంద్గారు ఈ సినిమా రూపొందించారు. వైవిధ్యంగా ఉండే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు కార్తీక్‌రాజ్. -
సినిమాలో ఆ మ్యాజిక్ ఉంటే హిట్టే
– ‘దిల్’ రాజు ‘‘నరసింహ మా బ్యానర్లో కో–డైరెక్టర్‌గా పని చేశాడు. ఓ రోజు ‘శరభ’ అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నానన్నాడు. రీసెంట్గా టీజర్ చూíసి, థ్రిల్ అయ్యా. టీజర్లో మేజిక్ ఉంది. సినిమా అంతా అదే మేజిక్ ఉంటే సూపర్‌హిట్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆకాశ్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా జయప్రద ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘శరభ’. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. కొంత మంది నిర్మాతలు కథ బావుందని అన్నా, బడ్జెట్ విషయంలో వెనకడుగువేశారు. ఆ సమయంలో ఆకాశ్ తండ్రిగారిని కలిస్తే తన కొడుకుతో ఈ సినిమా చేయమన్నారు. సినిమా కోసం 30 కోట్లు ఖర్చుపెట్టడం కాదు. ఆయన కొడుకు భవిష్యత్‌ను నా చేతుల్లో పెట్టిన నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆకాశ్ కుమార్ అద్భుతంగా నటించాడు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి రోషన్ సాలూరి సంగీతం అందించాడు. నేను సహాయంగా ఉన్నానంతే. కథకు తగ్గట్టే మంచి సంగీతం, నేపథ్య సంగీతం కుదిరింది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నటుడు ఎల్.బి. శ్రీరాం, ప్రజాకవి గొరేటి వెంకన్న పాల్గొన్నారు. -
వావ్ అనకుండా ఉండలేకపోయా!
చిరంజీవి దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగిన యుద్ధంలో మానవశక్తి ఎలా సహాయపడిందనే కథతో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రమిది. నా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ అలాంటి చిత్రమే’’ అన్నారు చిరంజీవి. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా, జయప్రద ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘శరభ’. ద గాడ్.. ఉపశీర్షిక. ఎన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనికుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను చిరంజీవి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ సిన్మాలోని కొన్ని సన్నివేశాలను చూశా. తనలో దుష్టశక్తి ఆవహించి, అప్పుడే పుట్టిన తన బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్న టైమ్‌లో జయప్రదగారు నటించిన తీరు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తుంది. ఆమె నటన చూసి వావ్ అనకుండా ఉండలేకపోయా. క్లైమాక్స్‌లో నరసింహస్వామి పూనిన తర్వాత ఆకాశ్ నటన కూడా అద్భుతం. దర్శకుడు విజువల్ వండర్‌గా సిన్మాను తీర్చిదిద్దారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది’’ అన్నారు. జయప్రద మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేయాలని ఎదురుచూస్తున్న టైమ్‌లో దర్శకుడు ‘శరభ’ కథ చెప్పారు. చిరంజీవిగారి గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఆయన ప్రేమ, ఆశీస్సులే మా బలం’’ అన్నారు. ‘‘పక్కా కమర్షియల్ చిత్రమిది. తండ్రి సెంటిమెంట్‌తో పాటు నరసింహస్వామి దైవబలం కూడా సినిమాలో ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. సురేశ్ కపాడియా, కథానాయిక మిస్తీ చక్రవర్తి, సినిమాటోగ్రాఫర్ రమణ సాల్వ తదితరులు పాల్గొన్నారు.