'Nelamedha Lene' lyrical song out from O Saathiya movie - Sakshi
Sakshi News home page

O Saathiya: నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్‌

Published Tue, Mar 14 2023 5:16 PM | Last Updated on Tue, Mar 14 2023 5:32 PM

Nelamedha Lene Song Out From O Saathiya Movie - Sakshi

జీ జాంబి ఫేం ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఓ సాథియా’. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తాజాగా ఈ మూవీ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. 

నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిపై ఘాడంగా ప్రేమిస్తున్న ప్రేమికుడి ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తున్నాయి. సాంగ్ టేకింగ్, పాటకు తగిన విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ పై  వినోద్ కుమార్ (విన్ను) కట్టిన బాణీలు ఈ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్‌గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ సాంగ్ లెవెల్ పెంచేశాయని చెప్పుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement