ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఓ సాథియా’ | O Saathiya Movie Clocks 50 Million Streaming Minutes On Amazon Prime Video - Sakshi
Sakshi News home page

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఓ సాథియా’

Published Tue, Sep 12 2023 6:08 PM | Last Updated on Tue, Sep 12 2023 6:26 PM

O Saathiya Movie Clocks 50 Million Streaming minutes on Amazon Prime Video - Sakshi

అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. జులై 7న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ని బాగా ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుంటున్న మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ స్పందన వచ్చింది. ఇప్పటికి 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ తో అన్ స్టాపబుల్ గా నిలించింది.  కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ సంపాదించుకుంది.

ఓ సాథియా కథేంటంటే..
బీటెక్‌ చదువుతున్న అర్జున్‌( ఆర్యన్‌ గౌర), అదే కాలేజీకి చెందిన కీర్తి (మిస్తీ చక్రవర్తి)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అర్జున్‌ అంటే నచ్చని మరో స్టూడెంట్‌ కూడా కీర్తిని ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడుతుంటాడు. అతని టార్చర్‌ నుంచి బయటపడేందుకు అర్జున్‌తో లవ్‌ ఉన్నట్లు అబద్దం చెబుతుంది. అలా అర్జున్‌, కీర్తి బాగా క్లోజ్‌ అవుతారు.

ఓ రోజు కిర్తికి ప్రపోజ్‌ చేద్దామని ఆమెకు ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ వస్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది. అసలు కీర్తి ఎక్కడికి వెళ్లింది? ఆమె కోపం పిచ్చొడిలా మారిన అర్జున్‌ తిరిగి ఎలా సాధారణ స్థితిలోకి వచ్చాడు? కీర్తి హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి.. ఆమె చదువుకునే కాలేజీలోనే జాయిన్‌ అయిన అర్జున్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కీర్తి ప్రేమను పొందడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు అర్జున్‌ ఏ స్థితిలో కీర్తిని కలుస్తాడు? మళ్లీ కలిసిన తర్వాత వీరు మళ్లీ ప్రేమించుకుంటారా? అసలు వీరిద్దరిలో ఎవరు, ఎవరిని ప్రేమిస్తున్నారు? అనేదే మిగతా కథ. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement