Aryan Gowra's 'O Saathiya' Movie Latest Updates - Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమ కావ్యంగా 'ఓ సాథియా'

Published Tue, Mar 7 2023 4:41 PM | Last Updated on Tue, Mar 7 2023 5:12 PM

Aryan Gowra O Saathiya Movie Latest Updates - Sakshi

ప్రేమకథా చిత్రాలకు యూత్‌ ఆడియన్స్‌ నుంచి ఎప్పుడూ మంచి రెస్పాన్సే ఉంటుంది. అందుకే మేకర్లు లవ్ స్టోరీలను తెరకెక్కించేందుకు మక్కువ చూపుతుంటారు. ఈ కోవలోకే ఇప్పుడు ఓ సాథియా అనే సినిమా కూడా రాబోతోంది. అయితే ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా 'ఓ సాథియా' అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.

‘జీ జాంబీ’ఫేమ్‌ ఆర్యాన్‌ గౌర,  మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలోకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్లు ప్రకటించారు. ఇప్పటికే ఓ సాథియా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ సోషల్ మీడియాలో ఎంతగానో ఆదరణను దక్కించుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement