Akshath Reddy
-
అదరగొట్టిన అక్షత్ రెడ్డి
తిరునల్వేలి: హైదరాబాద్ ఓపెనర్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి రంజీ మ్యాచ్‌లో రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షత్ (477 బంతుల్లో 248 బ్యాటింగ్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఫలితంగా రెండో రోజు మంగళవారం ఆట ముగిసేసరికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 523 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అక్షత్‌కు అండగా నిలిచిన బావనక సందీప్ (221 బంతుల్లో 130; 15 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అక్షత్‌తో పాటు సీవీ మిలింద్ (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 249/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తమిళనాడు బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా 174 బంతుల్లో సందీప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 316 బంతుల్లో అక్షత్ 150 పరుగుల మైలురాయిని దాటాడు. చివరకు లంచ్‌కు ముందు సందీప్‌ను మొహమ్మద్ ఔట్ చేయడంతో 246 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెర పడింది. కొల్లా సుమంత్ (5), ఆకాశ్ భండారి (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే సాకేత్ సాయిరామ్ (42) కెప్టెన్‌కు సహకరించాడు. టీ విరామ సమయానికి 199 పరుగుల వద్ద ఉన్న అక్షత్... చివరి సెషన్ ఆరంభం కాగానే ఫోర్ కొట్టి 413 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అక్షత్, సాయిరామ్ ఏడో వికెట్‌కు 109 పరుగులు జత చేశారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువ. -
అక్షత్ రెడ్డి అజేయ సెంచరీ
తిరునల్వేలి: కెప్టెన్ అక్షత్ రెడ్డి అజేయ సెంచరీ సాధించడంతో... తమిళనాడు జట్టుతో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరుపై కన్నేసింది. అక్షత్ (243 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, సిక్స్)తో జతగా బావనాక సందీప్ (133 బంతుల్లో 74 బ్యాటింగ్; 10 ఫోర్లు, సిక్స్) కూడా రాణించడంతో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అక్షత్, సందీప్ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 136 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు. అక్షత్‌తో కలిసి తొలి వికెట్‌కు 13 పరుగులు జతచేశాక ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (10) ఔటయ్యాడు. అనంతరం రోహిత్ రాయుడు (54 బంతుల్లో 13; ఫోర్)తో కలిసి అక్షత్ రెండో వికెట్‌కు 41 పరుగులు... హిమాలయ్ అగర్వాల్ (93 బంతుల్లో 29; 2 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. రోహిత్, హిమాలయ్ ఔటయ్యాక సందీప్ పట్టుదలగా ఆడటంతో తమిళనాడు బౌలర్లకు మరో వికెట్ లభించలేదు. రాహిల్ షా వేసిన ఇన్నింగ్స్ 83వ ఓవర్లో స్వీప్ షాట్‌తో అక్షత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్, మొహమ్మద్, రాహిల్ షాలకు ఒక్కో వికెట్ లభించింది. -
హైదరాబాద్ రంజీ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా పి. అక్షత్ రెడ్డి ఎంపికవగా... ఎన్. అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు ఆలిండియా కల్నల్ సీకే నాయుడు చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అండర్–23 హైదరాబాద్ జట్టును కూడా సోమవారమే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా చందన్ సహాని, కోచ్‌గా జాకీర్ హుస్సేన్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 2 నుంచి 5 వరకు జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. జట్ల వివరాలు హైదరాబాద్ రంజీ జట్టు: పి. అక్షత్ రెడ్డి (కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, కె. రోహిత్ రాయుడు, మొహమ్మద్ సిరాజ్, కె. సుమంత్, మెహదీ హసన్, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, సాకేత్ సాయిరాం, ఆకాశ్ భండారి, టి.రవితేజ, తనయ్ త్యాగరాజన్, హిమాలయ్ అగర్వాల్, కేఎస్కే చైతన్య, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), ఎన్పీ సింగ్ (బౌలింగ్ కోచ్), దిలీప్ (ఫీల్డింగ్ కోచ్). ∙హైదరాబాద్ అండర్–23 జట్టు: చందన్ సహాని (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), గడ్డం సంకేత్, శశిధర్ రెడ్డి, శ్రేయస్ వాలా, యుధ్వీర్ సింగ్, ఆశిష్ శ్రీవాస్తవ్, భగత్ వర్మ, సాత్విక్ రెడ్డి, జైరాం రెడ్డి, అభిరత్ రెడ్డి, ఒమేర్, నిఖిల్, రాజమణి ప్రసాద్, నిఖిల్, జాకీర్ హుస్సేన్ (కోచ్), ఎం. శ్రీనివాస్ (అసిస్టెంట్‌కోచ్). -
అక్షత్ రెడ్డి సెంచరీ
►ఆంధ్రపై హెచ్‌సీఏ ఎలెవన్ విజయం ►రవితేజ శతకం వృథా ►మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. మంగళవారం ఈసీఐఎల్ మైదానంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో హెచ్‌సీఏ ఎలెవన్ 80 పరుగుల తేడాతో ఆంధ్ర కోల్ట్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌సీఏ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (109 బంతుల్లో 113; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్ అగర్వాల్ (115 బంతుల్లో 88; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అంబటి రాయుడు (37 బంతుల్లో 63; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి, వేణు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. డీబీ రవితేజ (165 బంతుల్లో 113 నాటౌట్; 11 ఫోర్లు) శతకం సాధించినా తమ జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సీవీ మిలింద్, ఆకాశ్ భండారి, రవికిరణ్ తలా 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విదర్భ: 242/4 (కె. సచిన్ 75, అపూర్వ్ వాంఖెడే 63 నాటౌట్, జితేశ్ శర్మ 50); గోవా: 190/7 (స్వప్నిల్ అస్నోడ్కర్ 59, ఆదిత్య 3/42). ఫలితం: వర్షం కారణంగా గోవా విజయ లక్ష్యాన్ని సవరించి 48 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. 44 పరుగులతో విదర్భ విజయం బరోడా: 289/9 (కార్తీక్ కాక్డే 51, ఖయ్యూమ్ 3/54, జి.మధు 3/59); కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్: 207/7 (సుకాంత్ 91, కరణ్ పవార్ 3/32). ఫలితం: 82 పరుగులతో బరోడా విజయం హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్: 231 (జావీద్ అలీ 53, రోహిత్ రెడ్డి 42, చందన్ సహాని 42, రాబిన్ కృష్ణ 3/34); కేరళ: 232/6 (ఫాబిద్ ఫరూఖ్ అహ్మద్ 89 నాటౌట్, రోహన్ కున్నుమ్మెల్ 74, ప్రణీత్ రెడ్డి 2/26, తనయ్ త్యాగరాజన్ 2/35). ఫలితం: 4 వికెట్లతో కేరళ విజయం రైనా బరిలోకి... భారత ఆటగాడు సురేశ్ రైనా నేడు జరిగే మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈసీఐఎల్ మైదానంలో ఎయిరిండియా, కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. -
ఇండియా ‘బ్లూ’లో అక్షత్
సాక్షి, విశాఖపట్నం: గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డికి మరో చక్కటి అవకాశం లభించింది. ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’ జట్టులో అక్షత్‌కు చోటు లభించింది. మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సెలక్టర్లు చాలెంజర్ వన్డే టోర్నీ కోసం ఇండియా ‘బ్లూ’, ఇండియా రెడ్ జట్లను ఎంపిక చేశారు. బ్లూ జట్టుకు యువరాజ్, రెడ్ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. జాతీయ వన్డే చాంపియన్ ఢిల్లీ టోర్నీలో మూడో జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ నెల 26నుంచి 29 వరకు ఇండోర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.