akshra thuneeram
-
23 : 3 : 23
అక్షర తూణీరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే తాను మొన్న అభిజన్ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రోహిణీ కార్తెలో ఒక్కసారిగా బ్లేజ్‌వాడ చల్లబడింది. ఉత్సవానికి కొన్ని గంటల ముందు, తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ప్రజలు ఆనందించారు. వేసవిలో వెన్నెల కాసిందని అనుకున్నారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిది రుష్యశృంగ పాదమని భావించేవారు. మొన్న జనం చినుకుల్లో తడుస్తూ, మట్టివాసనని ఆఘ్రాణిస్తూ వైఎస్ అధికార పీఠంపై పాదంపెడితే వానలకి కొరత ఉండదని ఆనందంగా ఊపిరి పీల్చు కున్నారు. సకాలంలో వర్షాలుంటే దానికి మించిన సౌభాగ్యం ఉండదు. చంద్రబాబు హయాంలో లాగా రెయిన్గన్లతో లక్షల హెక్టార్ల పంటని కాపాడలేరు. మీడియాలో నీళ్ల చిమ్మెనలు చూపిస్తే, ఎండిన నేలలు పచ్చబారవు. పొలిటికల్ ఇండస్ట్రీలో నలభై ఏళ్ల అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబు అతి ఘోర పరాజయం పొందినవేళ హైవోల్టేజీ షాక్‌కి గురయ్యారు. మన పాలన ఇంత ఘోరంగా ఉందా? ప్రజల్లో ఇలాంటి స్పందన ఇంత ఘాటుగా రావడమేంటని చంద్రబాబు ఆత్మ విచారణకి దిగారు. చివరి ఆరునెలలూ పూర్తిగా ఆత్మస్తుతికి, పరనిందకి అంకితమైపోయిన మాజీ ముఖ్యమంత్రి అసలే పాజిటివ్ థింకర్ అవడంతో తానే స్టేటు తానే సెంట్రల్ అనుకున్నారు. ఊహ మంచిదే కానీ ఒక్కోసారి ఫలించదు. అంతఃపురంలోంచి బయటికొచ్చి జనవాణిని స్పష్టంగా వింటే ఎన్నికల ఫలితాలు అర్థం అయ్యేవి. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఆశువుగా చెప్పుకున్నారు. అదీ చక్కగా వినసొంపుగా, అలంకారాలతో జనం మాట్లాడుకున్నారు. మహిళలైతే మరింత సొగసుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఓ పెళ్లికి చిలకలూరిపేట వెళ్లాల్సి వచ్చింది. తలంబ్రాల ఘట్టం అయ్యాక అక్కడి బాజాభజంత్రీలతో ఇష్టాగోష్టికి దిగాను. ‘ఇక్కడ ఎవరు మీకు’ అని అడిగితే ప్రత్తిపాటి పుల్లారావు గారండీ అని చెప్పారు. ‘గెలుస్తారా, మంత్రి కూడా కదా’ అన్నాను. వాళ్లంతా ఒక్కసారి మొహమొహాలు చూసుకున్నారు. ఒక్క క్షణం ఆగి, ‘మాచెడ్డ కష్టమండీ’ అన్నాడొక పెద్దాయన. ధైర్యం పుంజుకున్న రెండో ఆయన, ‘మా పుల్లన మంచి మెజార్టీతో ఓడిపోతే ప్రభలు కట్టుకు కొండకి వస్తామని కోటయ్య సామికి మా వోళ్లంతా మొక్కారండీ’ అంటూ చేతులు భక్తిగా జోడించాడు. శృతి పెట్టెని శబ్దం చేస్తూ కట్టిపెట్టిన కుర్రాడు, ‘ఇట్టాంటి మేళాలు పదన్నా ఎళ్తాయండీ ప్రభల్తో’ అన్నాడు ఉత్సాహంగా. అబ్బా! మన మంత్రి పుల్లారావు గారికి జనంలో ఇంతటి పలుకుబడి ఉందా అని నివ్వెరపోయా. అయిదేళ్లు పగలూ రాత్రీ కష్టించి పోగు చేసుకున్న పేరు ప్రతిష్ట. జన సామాన్యపు ధోరణిని సరిగ్గా అంచనా వేసుకుంటే పార్టీ అడుగంటుతుందని నాలాంటి అమాయకుడికి కూడా అర్థం అవుతుంది. భజనల్లో కూచుంటే కాదు, జనంలో భుజకీర్తులు, కిరీటం లేకుండా తిరి గితే మన పాలన సౌడిభ్యం బాగా తెలుస్తుంది. ‘మా బెజవాడ రేవుల్లో దోసెడు ఇసుక లేదు. మొత్తం తోడేశారు. టీడీపీ రంగు, కృష్ణలో ఇసుక రంగు ఒకటే అయింది. దాంతో వాళ్లకి దానిమీద అభిమానం ఎక్కువైంది. కనక దుర్గమ్మ కొండమీంచి అంతంత కళ్లు పెట్టుకు చూస్తుంది గానీ ఆ తల్లి పలకదు ఉలకదు..’ అని ఒక పెద్దాయన బాధగా నిట్టూ ర్చాడు. ఉదాసీనంగా వూకొట్టి, బయలుదేరుతుంటే, ‘దుర్గమ్మ ఆడకూతురు కదా, ఓర్పు సహనాలు ఎక్కువ.. జై భవాని!’ అన్నాడు రోషంగా. నిజంగానే నేను ఉలిక్కిపడ్డాను. ఒక నిస్సహాయతలోంచే ఇలాంటి మాటలు సామాన్య ప్రజల్లోంచి వస్తాయి. వారి నాడి పట్టడానికి ఇదొక చిన్న శాంపిల్. కిందటిసారి ఎన్నికల తర్వాత చంద్రబాబు 23 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలని కొనేసి సొంత దొడ్లో కట్టేసుకుంటే అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. రేట్లు కూడా చెప్పుకున్నారు. వైఎస్ పార్టీని కుంగెయ్యాలని గట్టి ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో స్పీకర్‌కి ముఖ్యమంత్రి కంటే, ప్రధాని కంటే ఎక్కువ అధికారం, గౌరవం ఇవ్వబడినాయి. ఈ కొనుగోలు సరుకులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇదంతా గమనిస్తున్న సామాన్య ఓటర్లకి గౌరవనీయ స్పీకర్ కోడెల ఘోరంగా ఓడిపోనున్నారని మూడు నెలల ముందే తెలుసు. ఓటేసి రాగానే కాలవల్లో, చెరువుల్లో స్నానాలు చేసి తడి వస్త్రాలతో ఇళ్లకు వచ్చామని ఓ పెద్ద రైతు సంతోషంగా చెప్పాడు. చంద్రబాబు సొంత మీడియాతోనే దెబ్బ తిన్నాడని అనుభవజ్ఞులు తేల్చారు. 23: 3: 23 దేవుడు ప్రసాదించిన నిష్పత్తిగా తేల్చారు. అయినా ఆయన మబ్బులు వీడి రాలేకుండా ఉన్నారు. నలభై ఏళ్ల అనుభవం చంద్రబాబుని వదలడం లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బడిగంట మోగింది!
ఉన్నట్టుండి వీధుల్లో కొత్త సందడి మళ్లీ మొదలైంది. ఇంద్రధ నువులు నేలకి దిగివచ్చి నట్టు, గుంపులు కట్టి సీతాకోక చిలకలు వీధుల్లో విహరిస్తు న్నట్టు, ఆధునిక సంగీతం యూనిఫాం ధరించి స్కూల్ బస్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ స్కూళ్లు తెరిచారు. బడిగంట మోగింది. పిల్లలు... పిల్లలు... ఎక్కడ చూసినా బడిపిల్లలు. వాళ్లు అక్షర దీపాలు. మన ఆశా కిరణాలు. రెండు నెలలకు పైగా హాయిగా సెలవులనుభవించి, ఇప్పుడే ఒళ్లు విరుచుకుంటూ బడికి అలవాటు పడుతున్నారు. నిన్నమొన్నటి దాకా గడియారం వంక చూడకుండా నిద్ర పోయారు. హోం వర్కులు వాటి తాలూకు అమ్మ నసలు అస్సలు లేవ్. ఎప్పుడైనా నిద్రలేచి ఎప్పు డైనా స్నానం పోసుకోవచ్చు. అసలు ఓ పూట నీళ్లు డుమ్మాకొట్టినా ఎవరూ పట్టించుకోరు. కొత్త డ్రెస్సుల్లో, కొత్త తరగతుల కొత్త పుస్తకాలతో పిల్లలు నవనవలాడుతున్నారు. సై తరగతికి వచ్చినందుకు అంగుష్ఠమాత్రం పెద్ద రికం ప్రదర్శిస్తున్నారు. ఇన్ని రోజుల బ్యాక్లాగ్ విశేషాలు చెప్పుకోవాలి. అందుకని కబుర్లే కబుర్లు. తాతగారింటికో, నానమ్మ దగ్గరికో వెళితే ఆ సంగతులన్నీ దోస్తులకి పంచాలి. ఇన్నాళ్లలో ఇంటాబయటా చూసిన సినిమా కబుర్లు కల బోసుకోవాలి. ఎగరేసిన గాలిపటాలు, తీర్థంలో తిరిగిన రంగుల రాట్నం, ఆచోటెక్కిన జెయంట్ వీలు, మెట్రో రైలు, షూటింగ్లో అభిమాన హీరో– అన్నీ ప్రస్తావనకి వస్తాయ్. పిల్లల మాటల్ని మాటేసి వినండి. ఏ గొప్ప సంగీతమూ వాటికి సాటి రాదు. రెండేళ్ల వయసు దాటితే వాళ్ల మాటలు కలవవ్. అందుకని ఎవరి గ్రూప్ వారి దిగా విడిపోతుంది. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్లలన్నాడు మహాకవి. కులం, మతం, గోత్రం, వర్గం, ప్రాంతం తేడా తెలియని వాళ్లు. ఆ దశలో ఉండే అమాయకత్వాలని చిది మేసి పెద్దలు స్వార్థానికి వాడుకుంటారని భయ మేస్తూ ఉంటుంది. అమ్మ వెనకో, నాన్న వెనకో స్కూటర్ మీదో, బైక్ మీదో చిన్న చిన్న పిల్లలు కూచుని వెళ్తుం టారు. వాళ్ల భుజాలకో బరువైన సంచీ. మధ్యా హ్నం స్కూల్నించి వచ్చేటప్పుడు ఆ పిల్లలు నిద్రలో జోగుతూ ఉంటారు. నాకెంత భయమే స్తుందో చెప్పలేను. అమ్మనాన్నలని హెచ్చరించే అవకాశం ఉండదు. అయ్యలారా! అమ్మలారా! పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోండి. లేదంటే కలిపి ఓ బెల్ట్ పెట్టుకోండి. పదేళ్ల తర్వాత వీళ్లంతా ఒక ఆకృతి ధరి స్తారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ ఏమైనా అవచ్చు. క్రీడాకారులుగా, కళాకారులుగా రాణిం చవచ్చు. దీని తర్వాత బంగారు కలలు కనే దశ వస్తుంది. కెరియర్ పట్ల, జీవితంపట్ల బోలెడు ఆశలు, ఆశయాలు పొటమరిస్తాయ్. ఈనాటి ఈ ఇంద్రధనువులు ఒక్కోసారి నిరాశా నిస్పృహలను కలిగిస్తున్నాయి. ఎంట్రన్స్, ఇతర పోటీ పరీక్షా ఫలితాల సీజన్ వస్తోందంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయ్. అనుకున్న ర్యాంక్ రాకపోతే చని పోవాలా? చదువుల్లోనే కాదు, మానసికంగా కూడా గట్టి పడాలి. ఇలాంటి సంఘటనలప్పుడు వారి తల్లిదండ్రులే కాదు, అందరూ విలవిల్లాడు తారు. పదిలం! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రా! లేచిరా! గోదారి పిలుస్తోంది రా!
( అక్షర తూణీరం) పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట. మీకు తెలుసా? మన దేశంలో జీవనదులకు ప న్నెండేళ్లకోసారి పుష్కరం వస్తుంది. ఇ ట్లా క్రమం తప్ప కుండా పుష్కరుడు నదులలో ప్రవేశిం చడం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగు తూనే ఉంది. కావాలంటే మన పాత పంచాం గాలు తిరగేసుకోండి. గంగానదికి పుష్కరం వస్తే అది కుంభమేళా. మనకి ఎప్పుడో పుష్కర సందడి మొదలైపోయింది. ఇది కూడా రాజకీయ సిలబస్‌లో ఒక అధ్యాయంగా తయారైంది. ఇన్ని కోట్లు, అన్ని కోట్ల నిధులు పుష్కరాలకి విడు దల చేస్తున్నామని ప్రకటనలు మొదలై చాలా నిలువెత్తు బొమ్మలతో హోర్డింగ్స్ రూపుదిద్దు కుంటున్నాయి. ’’ముణగండి! ముణగండి!’’ అంటూ తాటికాయంత అక్షరాలతో నినాదం వుంటుంది. పుష్కర స్నానానికి వచ్చేవారు యివి చూసి, ‘‘ఎప్పుడో మునిగాం మళ్లీనా’’ అనుకుంటారు మనసులో. ప్రతి సందర్భాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం నేటి టెక్నాలజీ అయితే కావచ్చుగాని అది అన్యాయం. పుష్క రం కేవలం హిందూ మతానికి సంబంధిం చిన అంశం. కర్మకాండల మీద, క్రతువుల మీద నమ్మకం, విశ్వాసం వున్న వారు తమ పెద్దలను స్మరించుకునే సదవకాశం. దేవత లకు అర్ఘ్యం యివ్వడం, పెద్దలకు పేరు పేరు నా పిండప్రదానం చేయడం పుష్కర విధిలో ముఖ్యాంశం. పుష్కరాంశలో నది మహా పవి త్రంగా ఉంటుంది కాబట్టి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దాన ధర్మాలు అప్పుడే కాదు ఎప్పుడు చేసినా పుణ్యమే. అయినా అదొక మంచి సందర్భం. పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట. అప్పుడు కూడా ఏటి ఒడ్డున, గోదారి గట్టున బోలెడు వ్యాపారం నడిచేది. క్రమేపీ ఆ పని స్వయంగా ప్రభుత్వాలే చేపట్టాయి. సీసాల్లో గోదావరి నీళ్లని పోస్టాఫీసుల్లో అమ్ముతారట! గంగ తీర్థంతో కాశీ నుంచి చిన్నచిన్న రాగి చెంబులో సీలు వేసిన మూతలలో తెచ్చుకుంటారు. ఆ చిన్న కాశీచెంబు యాత్రకి జ్ఞాపకంగా మిగిలేది. ఇంతకు ముందు రంజాన్ దీక్షల వేళ హలీం అమ్మించారు. దాన్ని మధ్యలో ఆపేశారు. భద్రాచలం సీతారామకళ్యాణం అక్షింతలు, ప్రసాదాలు పోస్టాఫీసుల్లో అమ్మించారు. ఈ క్రమంలో తిరపతి లడ్డు లాభదాయకం. అసలు ఆ ఆదాయం మీదే బతుకుతున్న సర్కార్లకి పోస్టాఫీసుల్లో లిక్కరు అమ్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదో?! కోట్లాది రూపాయలు పుష్కర పనులకి ప్రభుత్వాలు కేటాయించడం మంచిదే. చెరువుల నిర్మాణం, సత్రవులు పెట్టడం లాగే నదులకు స్నానఘట్టాలు నిర్మించడం పుణ్యకార్యం గా భావించేవారు. స్తోమతు గల ధార్మికులు ఆ పని చేశారు. ప్రభుత్వం యిప్పుడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్టు వూరిస్తోంది. పుష్కర పర్వం ఆరంభం కావడానికి వారం ముందు డబ్బులు బయటకు వస్తాయి. పుష్క రాలు ఎప్పుడు వస్తాయో సర్కార్ల వారికి పన్నెండేళ్ల ముందే తెలుసు. కాని హడావిడిగా గోదావరికి వరద వచ్చిన సందర్భంలో లాగా దీనికి చేస్తారు. అక్కడక్కడి పంచాయతీలకు, మునిసిపాలిటీలకు అప్పగిస్తే వారే చేయించు కుంటారు. పుష్కరాలు కూడా క్యాంపెయిన్‌కి వేదికలు, భోక్తలకు విందు భోజనం. పుష్క రాల సొమ్ముని కైంకర్యం చేస్తే, దప్పికతో మరణిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. తర్వాత వారిష్టం. (రచయిత: శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు)