పాఠశాలను బాంబులతో పేల్చినా..
సిరియా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇంతకు ముందు సిరియాలోని అలెప్పో పాఠశాలలో చదివేవారు. ఇప్పుడు ఆ పాఠశాల లేదు. దానిని ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు.
ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు లండన్లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆవరణను వేదికగా చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో... శిథిలమైన పాఠశాల నమూనా మధ్య కూర్చొని ప్రపంచానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.