Alibaba okkade donga
-
హీరోగా అలీకి మళ్లీ హిట్ రావాలి!
‘‘అలీ అంటే నాకు బాగా ఇష్టం. ఓసారి మా ఊరికి సమీపంలో ఏదో ప్రోగ్రామ్ కోసం అలీ వస్తున్నారని విని, మా ఇంట్లో చెప్పకుండా వెళ్లాను. అప్పట్నుంచీ అలీ నా జీవితంలో ఓ భాగమయ్యారు. హీరోగా అలీ ఈ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలి’’ అన్నారు పూరి జగన్నాధ్. అలీ, సుజావారుణి జంటగా ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’. సాయిశ్రీకాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. ఇంకా ‘అల్లరి’ నరేష్, తనికెళ్ల భరణి, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అలీ మాట్లాడుతూ -‘‘గతంలో ‘అలీబాబా అరడజను దొంగలు’ చిత్రంలో ఓ పాత్ర చేశాను. ఇప్పుడు ‘అలీబాబా ఒక్కడే దొంగ’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. హీరోగా నాకిది 50వ సినిమా’’ అన్నారు. ‘‘అలీగారి సహకారం వల్ల పవన్‌కల్యాణ్‌గారి చేతుల మీదుగా పాటలను విడుదల చేయగలిగాం. ఈ చిత్రంలో వినాయకుడి పాత్రకు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం’’ అని నిర్మాత చెప్పారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదలచేస్తామని దర్శకుడు చెప్పారు. -
‘అలీబాబా...’కు వాయిస్ ఓవర్
తెలుగు తెరపై వాయిస్ ఓవర్ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఈ వాయిస్ ఓవర్ కల్చర్ కనిపిస్తోంది. అలీ హీరోగా నటించిన 50వ సినిమా ‘అలీబాబా ఒక్కడే దొంగ’కు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. ఓ ప్రముఖ హీరో చేతుల మీదుగా త్వరలో పాటలను విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. -
అలీబాబా ఒక్కడే దొంగ
అతగాడు పోలీస్ అవ్వాలనుకున్నాడు. బోల్డన్ని కలలు కన్నాడు. ఎప్పుడు ఖాకీ బట్టలు సొంతం చేసుకోవాలా? అని తపన పడ్డాడు. కానీ అనుకున్నామని అన్నీ జరగవు కదా. సీన్ రివర్స్ అయ్యింది. పోలీసు అవ్వాల్సిన ఆ వ్యక్తి దొంగ అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపు చోటుచేసుకుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’. అలీ హీరోగా ఫణిప్రకాష్ దర్శకత్వంలో కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై బొడ్డేడ శివాజీ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘కామెడీ, థ్రిల్‌కి గురి చేసే అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. సాయిశ్రీకాంత్ స్వరపరచిన పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం. వచ్చే నెలలో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జాన్, ఎడిటింగ్: నందమూరి హరి. -
‘అలీబాబా ఒక్కడే దొంగ’
కథానాయకునిగా అలీ 50వ చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’. సూజవారుని కథానాయిక. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.