అలీబాబా ఒక్కడే దొంగ
అతగాడు పోలీస్ అవ్వాలనుకున్నాడు. బోల్డన్ని కలలు కన్నాడు. ఎప్పుడు ఖాకీ బట్టలు సొంతం చేసుకోవాలా? అని తపన పడ్డాడు. కానీ అనుకున్నామని అన్నీ జరగవు కదా. సీన్ రివర్స్ అయ్యింది. పోలీసు అవ్వాల్సిన ఆ వ్యక్తి దొంగ అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపు చోటుచేసుకుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’.
అలీ హీరోగా ఫణిప్రకాష్ దర్శకత్వంలో కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై బొడ్డేడ శివాజీ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘కామెడీ, థ్రిల్‌కి గురి చేసే అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా ఇది.
సాయిశ్రీకాంత్ స్వరపరచిన పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం. వచ్చే నెలలో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జాన్, ఎడిటింగ్: నందమూరి హరి.