హీరోగా అలీకి మళ్లీ హిట్ రావాలి! | Alibaba Okkade Donga Platinum Disc Function | Sakshi
Sakshi News home page

హీరోగా అలీకి మళ్లీ హిట్ రావాలి!

Published Thu, Feb 6 2014 11:09 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

హీరోగా అలీకి మళ్లీ హిట్ రావాలి! - Sakshi

హీరోగా అలీకి మళ్లీ హిట్ రావాలి!

 ‘‘అలీ అంటే నాకు బాగా ఇష్టం. ఓసారి మా ఊరికి సమీపంలో ఏదో ప్రోగ్రామ్ కోసం అలీ వస్తున్నారని విని, మా ఇంట్లో చెప్పకుండా వెళ్లాను. అప్పట్నుంచీ అలీ నా జీవితంలో ఓ భాగమయ్యారు. హీరోగా అలీ ఈ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలి’’ అన్నారు పూరి జగన్నాధ్. అలీ, సుజావారుణి జంటగా ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజి నిర్మించిన చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’. సాయిశ్రీకాంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. ఇంకా ‘అల్లరి’ నరేష్, 
 
 తనికెళ్ల భరణి, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అలీ  మాట్లాడుతూ -‘‘గతంలో ‘అలీబాబా అరడజను దొంగలు’ చిత్రంలో ఓ పాత్ర చేశాను. ఇప్పుడు ‘అలీబాబా ఒక్కడే దొంగ’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. హీరోగా నాకిది 50వ సినిమా’’ అన్నారు. ‘‘అలీగారి సహకారం వల్ల పవన్‌కల్యాణ్‌గారి చేతుల మీదుగా పాటలను విడుదల చేయగలిగాం. ఈ చిత్రంలో వినాయకుడి పాత్రకు ‘అల్లరి’ నరేష్ వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం’’ అని నిర్మాత చెప్పారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదలచేస్తామని దర్శకుడు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement