డాగ్స్ డే అవుట్
ఎప్పుడూ ఇంటికే పరిమితమయ్యే పెంపుడు కుక్కలు బయటికి రాగానే జూలు విదిల్చాయి. ‘గెట్ రెడీ’ అనగానే... రన్నింగ్ రేస్ అందుకున్నాయి. ఆపై హుందాగా నడిచి అబ్బురపరచాయి. బంజారాహిల్స్ ముఫకంజా కళాశాలలో ఏపీ కెన్నెల్ క్లబ్ ఆదివారం నిర్వహించిన ‘హైదరాబాద్ డాగ్ షో 2014’ పెట్ లవర్స్ మనసు దోచుకుంది. ఇందులోని ‘ఆల్ బ్రీడ్స్ చాంపియన్షిప్ డాగ్ షో’... వివిధ జాతుల శునకాల కేరింతలతో అదరహో అనిపించింది.