All india first rank
-
‘గేట్’ మనోళ్లదే! ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సొంతం
సాక్షి, హైదరాబాద్/కాజీపేట అర్బన్/మధిర: ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లోని మాస్టర్ డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్(గేట్)–2022 ఫలితాలను గురువారం ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాచర్ల ప్రణీత్ కుమార్, మణి సందీప్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. గేట్ కోసం దేశవ్యాప్తంగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 7,11,542 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా గేట్ రాశారు. దేశవ్యాప్తంగా 1,26,813 (17.82 శాతం) మంది అర్హత పొందారు. మొత్తం 100 మార్కులుండే ఈ పరీక్షకు ఈసారి 25 మా ర్కులు అర్హత(కటాఫ్)గా నిర్ణయించారు. ర్యాంకుల వివరాలు, డౌన్లోడ్ కోసం gate.iitkgp.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది. గేట్లో మొదటి ర్యాంకు సాధించిన వరంగల్ నిట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఫైనలియర్ విద్యార్థి మణి సందీప్‌రెడ్డికి ఆ సంస్థ డైరెక్టర్ ఎన్వీ రమణారావు గురువారం మొక్కను బహూకరించి అభినందించారు. అదేవిధంగా నిట్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హర్దీప్ 42వ ర్యాంకు సాధించాడు. స్వీయశిక్షణతోనే టాప్‌ర్యాంక్:మణి సందీప్‌రెడ్డి గేట్లో మొదటిర్యాంకు పొందడం సంతోషంగా ఉంది. రాజమండ్రికి సమీపంలోని వెదురుపాక సొంతూరు అయినప్పటికీ, టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. మా నాన్న రామగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌తోపాటు షాపు నిర్వహిస్తాడు. అమ్మ ఐశ్వర్య భాగ్యలక్ష్మి గృహిణి. ఇంజనీరింగ్ చేస్తూనే సొంతంగా గేట్‌కు ఆరునెలలపాటు తర్ఫీదు అయ్యాను. మార్కెట్లో దొరికే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌తో నా ప్రిపరేషన్ అయ్యాను. పేద కుటుంబంలో విద్యాకుసుమం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మాచర్ల శ్రీనివాసరావు– రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్‌కుమార్ అలహాబాద్ నిట్‌లో బీటెక్(ఈఈఈ) పూర్తిచేశారు. శ్రీనివాసరావు స్థానిక సీపీఎస్ రోడ్డులో బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని దారాలు, గుండీలు వంటి టైలరింగ్ మెటీరియల్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబమే అయినా కష్టపడుతూ కుమారుడిని చదివించారు. మాచర్ల శ్రీనివాసరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి చదివిన ప్రణీత్ జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన పట్టుదలతో చదివినట్లు తెలిపారు. తెనాలి యువకుడికి 21వ ర్యాంకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల శేషసాయిరెడ్డి 21వ ర్యాంకు సాధించారు. ఈయన ప్రస్తుతం కోల్ ఇండియాలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. మరోవైపు యూపీఎస్సీ నిర్వహిం చిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఈయన తల్లి దీపలత సెకండరీ గ్రేడ్ టీచరు కాగా.. తండ్రి ఆళ్ల రవీంద్రారెడ్డి రైతు. శేషసాయిరెడ్డి నాగపూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివా రు. బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీటు.. ఎంటెక్ చేయటం, తర్వాత పీహెచ్డీ పూర్తిచేయాలని ఉందని ఆయన చెప్పారు. ఐఈఎస్‌లో జాబ్ వస్తే మరింత సంతోషమన్నారు. -
మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: ప్రదీప్ సింగ్ పేరు ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. నేడు ప్రకటించిన యూపీఎస్సీ-2019 ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వీరందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్ష, 2019ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ నా అభినందనలు! ప్రజా సేవకు సంబంధించి ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన వృత్తి మీ కోసం వేచి ఉంది. నా శుభాకాంక్షలు!’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో పాటు ఇతర నాయకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. నేడు ప్రకటించిన ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. తరువాతి స్థానాల్లో జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ ఉన్నారు. Congratulations to all the bright youngsters who have successfully cleared the Civil Services Examination, 2019! An exciting and satisfying career of public service awaits you. My best wishes! — Narendra Modi (@narendramodi) August 4, 2020 ఇక ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రదీప్ సింగ్ హరియాణా సోనిపట్ జిల్లాకు చెందినవారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘కల నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇది నాకు ఆనందకరమైన ఆశ్చర్యం. నేను ఐఏఎస్ కావాలని ప్రతిక్షణం పరితపించాను. సమాజంలోని అణగారిన వర్గాల కోసం పని చేస్తాను’ అని తెలిపారు. గత ఏడాది కూడా ప్రదీప్ సివిల్స్ క్లియర్ చేశారు. ప్రస్తుతం అతను హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇండియన్ రెవన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నారు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో నివసిస్తున్న ప్రదీప్ తండ్రి సుఖ్బీర్ సింగ్.. గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. -
అదరగొట్టిన బెజవాడ కుర్రోడు
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) గురువారం ప్రకటించిన సీఏ ఫైనల్స్ ఫలితాల్లో విజయవాడ విద్యార్థి జి కృష్ణప్రణీత్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించి తన సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో విద్యార్థి వి ఆంజనేయ వరప్రసాద్ కూడా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు సాధించాడు. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొదటిసారే ర్యాంకులు సాధించడం విశేషం. వీరు శిక్షణ పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ తుమ్మల రామ్మోహనరావు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. కృష్ణప్రణీత్ తండ్రి జి మధుసూదనరావు ఆటోమొబైల్ షాపులో గుమస్తాగా పనిచేస్తుండగా, తల్లి మల్లేశ్వరి గృహిణి. మరోవైపు.. పరీక్ష రాసిన రోజే క్వాలిఫై అవుతానని భావించానని, ఇప్పుడు ఆలిండియా 46వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని మరో విజేత వి ఆంజనేయవరప్రసాద్ తెలిపాడు. ర్యాంకులు సాధించిన విజేతలిద్దరికీ రామ్మోహనరావు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. మంచి మార్కులు వస్తాయనుకున్నా.. పరీక్ష రాసిన రోజునే మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. ఈ రోజు ఐసీఏఐ వాళ్లు ఫోన్‌చేసి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని చెబితే ఏం మాట్లాడాలో తెలీలేదు. ఇంత గొప్ప ర్యాంకు సాధించడానికి కారణం నా తల్లిదండ్రులే. వారు నన్ను మానసికంగా అన్ని రకాలుగా ప్రోత్సహించడంతోనే ఈ ర్యాంకు సాధించగలిగా. నేను ముందు రెండేళ్లు ఆర్టికల్స్ చేశా.. ఆ తర్వాత ఒక ఏడాది సిలబస్ చదవా. తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. మంచి శిక్షణనిచ్చి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన సీఏ టి రామ్మోహనరావుకు కృతజ్ఞతలు. -
సీఎంఏలో ఫస్ట్ ర్యాంకులు సూపర్విజ్వే
విజయవాడ, న్యూస్‌లైన్: ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ (సీఎంఏ) ఫైనల్, ఇంటర్ రెండింటిలోనూ సూపర్‌విజ్ విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారని ఆ సంస్థ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు దగ్గుపాటి గురుప్రసాద్, ఫైనల్లో వెంకటమనోజ్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. వారితోపాటు ఫైనల్లో తోట రజని 3వ ర్యాంకు, చుండూరు సుధీర్ 6, ఎస్వీఎన్ఎల్ సౌమ్య పెరూరి 13వ ర్యాంకు సాధించారు. 50 లోపు 13 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్లో మద్ది రాజేష్ 2వ ర్యాంకు సాధించగా, చిట్లూరి లక్ష్మీ అనూష 8, ఆర్ శిల్ప 11వ ర్యాంకు సాధించడంతోపాటు, 50 లోపు 15 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.