ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న టీచర్, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూలే, అంబేడ్కర్ల ఆశయాల స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరించే దృఢ చిత్తం కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను allindiabcobc@gmail.comకి పంపాల్సిందిగా కోరుతున్నారు.
అలాగే త్వరలో జరగబోయే కార్యవర్గం ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహికులు తమ వివరాలను పంపొచ్చని సుశీల్ కుమార్ తెలిపారు.