all terrain vehicle
-
తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!
మిషిగన్: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు. అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు. ఆల్ టెర్రయిన్ వెహికిల్(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. -
కళ్లముందే ఎన్నారై మృతి..!
-
స్నేహితుల కళ్లముందే.. ఎన్నారై మృతి..!
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని ధరూర్ మండలం గోధమగూడలోని హిల్స్ అండ్ వాలీ అడ్వెంచర్ రిసార్ట్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మౌంటెన్ బైక్ నడుపుతున్న సమయంలో ఎన్నారై అరవింద్‌కుమార్ పీచర (45) అనే వ్యక్తి ప్రమాదానికిగురై ప్రాణాలు విడిచాడు. అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి గైడ్ సూచనలు లేకుండా రైడింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అరవింద్ స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న గుట్టపై నుంచి వస్తున్న క్రమంలో మౌంటెన్ బైక్ తిరగబడిందని, ప్రమాదంలో అరవింద్ తలకు తీవ్రగాయాలయ్యాయని అతని స్నేహితులు చెప్పారు. వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు. డల్లాస్‌లో నివాసముండే అరవింద్ స్నేహితుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది. -
‘గీతం’ బైక్
పటాన్చెరు: నాలుగు చక్రాల మోటార్ సైకిల్ (ఆల్‌టెరైన్ వెహికిల్)ను గీతం విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ న్యూ ఇరా ఇంజినీరింగ్(ఐఎస్‌ఎన్‌ఈఈ) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనేందుకు ఈ వాహనాన్ని రూపొందించినట్టు విద్యార్థి బృందం నాయకుడు కె.సీతారామ్, మేనేజర్ నరేశ్, రైడర్ అయ్యప్పరెడ్డి, డిజైనర్ శరత్ తెలిపారు. బీటెక్ మూడు, నాలుగో ఏడాది చదువుతున్న మొత్తం 28 మంది ఓ బృందంగా ఏర్పడి దాదాపు రూ.5 లక్షలతో ఆల్‌టెరైన్ వెహికల్‌ను రూపొందించినట్టు వారు చెప్పారు. నవంబర్‌లో వాహన రూపకల్పన ప్రారంభించామన్నారు. తొలుత కంప్యూటర్ డిజైన్‌ను నిర్వహకుల ఆమోదం పొందాక జూన్‌లో అసెంబ్లింగ్ ప్రారంభించామన్నారు. బైక్ ఇంజిన్‌ను ఐఎస్ఎస్ఈఈ సమకూర్చిందని, విడిభాగాలను గుజరాత్, అమెరికాతో సహా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించామన్నారు. ఐదు గేర్లు, మూడు బ్రేకులు, డబుల్ షాఫ్ట్‌లు, థంబ్ యాక్సిలేటర్, కిల్లర్ స్విచ్‌లు వాహన ప్రత్యేకతలు. గంటకు 60 కిమీల వేగంతో ప్రయాణిస్తుందన్నారు. జాతీయ స్థాయి పోటీలో ఎనిమిది రౌండ్లు ఉంటాయని, ముందుగా ఆరడుగుల ఎత్తునుంచి బైక్‌ను వదలుతారని, ఆపై గంట సమయంలో ఆరుగురు విద్యార్థులు వాహనాన్ని విడదీసి జోడించాలన్నారు. బ్రేక్ టెస్ట్, యాక్సిలేటర్ టెస్ట్, స్టీరింగ్ అలైన్మెంట్, యాన్యూరెన్స్, టెక్నికల్ ఇన్స్పెక్షన్తో పాటు 25 లీటర్ల పెట్రోల్‌తో నాలుగు గంటలు నిర్విరామంగా నడిపి తక్కువ ఇంధనం వినియోగించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారని వారు వివరించారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ల్లో ఈ తరహా వాహనాలు ఎక్కువగా వినియోగిస్తారని, మనదేశంలో రోడ్లపై నడిపేందుకు నిషేధం ఉందన్నారు. బైక్ బరువంతా మధ్యలో కేంద్రీకృతం కావడం వల్ల తిరగబడే అవకాశాలు తక్కువన్నారు. 45 నుంచి 50 డిగ్రీల ఉపరితలంపై(అంటే మెట్లపైనా) బైక్‌ను నడపొచ్చని తెలిపారు. విద్యార్థులను యూనివర్సిటీ డైరెక్టర్లు వీసీ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, ప్రిన్సిపాల్ సీహెచ్.సంజయ్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పి.ఈశ్వరయ్య, గీతం డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, హెబీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్‌కుమార్ తదితరులు అభినందించారు.