కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయం
టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవాజ్‌రెడ్డి
మునిపల్లి: మెదక్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునాయసంగా గెలుస్తారని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం నవాజ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్నిక ప్రశాంతంగా జరగడంతో మండలంలోని తాటిపల్లి గ్రామంలో ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీయే తమ లక్ష్యమన్నారు.
సిద్దిపేటలో లక్ష ఓట్లకు పైగా, మిగతా నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా టీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రానున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరి తెలంగాణ ప్రజలకు తెలిసినందునే టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కొల్లూరి రవి, యూవత మండల ప్రధాన కార్యదర్శి గుంతలి నర్సింలు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చాకలి రవి, తెనుగు సంగ్రాంతో పాటు పలవురు పాల్గొన్నారు.