Allan Border Medal
-
‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ వార్నర్
క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డులు సిడ్నీ: ఆస్ట్రేలియా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ (అలెన్ బోర్డర్ మెడల్) అవార్డును ఓపెనర్ డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ టెస్టుల్లో, వన్డేల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించిన వార్నర్... ఓటింగ్‌లో కెప్టెన్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లను వెనక్కినెట్టాడు. వార్నర్‌కు 30 ఓట్లు రాగా, స్మిత్ (24), స్టార్క్ (18)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు ‘ఉత్తమ వన్డే ఆటగాడు’; ఆడమ్ వోజెస్కు ‘ఉత్తమ దేశవాళీ ఆటగాడు’ అవార్డులు లభించాయి. -
'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే'
పెర్త్: ఆస్ట్రేలియాలో ఆ జట్టు క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇప్పుడు పెద్ద హీరోగా మారిపోయాడు. టీమిండియా తో జరిగిన టెస్ట్ సిరీస్ ముందువరకూ నామమాత్రపు ఆటగాడిగా ఉన్న స్మిత్ అటు ఆటతో ఆకట్టుకుంటూ అవార్డులతో దూసుకుపోతున్నాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి న్యూ బ్రాడ్ మెన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాగా తెరపైకి వచ్చిన అతగాడు.. దానికి కారణం ఐపీఎల్ అంటున్నాడు. ఈ రోజు స్మిత్ ఇలా ఉన్నాడంటే అందుకు కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లే అని తాజాగా స్పష్టం చేశాడు. అక్కడ చాలా విషయాలు నేర్చుకోవడంతోనే తన ఆట శైలి బాగా మెరుగైందన్నాడు. 'నేను ఐపీఎల్ వంటి గొప్ప టోర్నమెంట్ లో భాగస్వామ్యం అయినందుకు సంతోషం. ఇంతటి ఘనత సాధించడానికి ఆ లీగే కారణం. ప్రత్యేకంగా వన్డేల్లో రాణించడానికి ఐపీఎల్ ఎంతో దోహద పడింది. ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే' అని స్మిత్ తెలిపాడు. ప్రతీ యంగ్ క్రికెటర్ కు ఐపీఎల్ ఒక గొప్ప లెర్నింగ్ ఎక్సపీరియన్స్ అన్నాడు. -
స్మిత్‌కు అవార్డుల పంట
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ వార్షిక అవార్డుల్లో స్టీవ్ స్మిత్‌కు మూడు పురస్కారాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అలెన్ బోర్డర్ మెడల్‌తో పాటు టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కూడా స్మిత్ సాధించాడు. పదేళ్లలో ఈ మూడు అవార్డులూ ఒకే ఆటగాడికి రావడం ఇది మూడోసారి. బోర్డర్-గవాస్కర్ మెడల్ కోసం నిర్వహించిన ఓటింగ్‌లో స్మిత్‌కు 243 ఓట్లు రాగా... వార్నర్ 175, జాన్సన్ 126 ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సీన్ అబాట్ ఎంపికయ్యాడు. అతని బౌలింగ్‌లో గాయపడి హ్యూస్ మరణించిన తర్వాత అబాట్ కోలుకుని నిలకడగా రాణించి అవార్డు గెలుచుకున్నాడు.