Allocation process
-
తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కీలక దశకు చేరుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల జిల్లా కేడర్ కేటాయింపులు మొత్తం పూర్తయ్యాయి. వారంతా దాదాపు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. ఈ రిపోర్టింగ్ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. ఇక జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కొన్ని శాఖల్లో కేటాయింపులు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల లెక్క పక్కాగా తెలిసే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటివరకూ జరిగిందంతా కేడర్ విభజన మాత్రమేనని, ఎవరు ఏ జిల్లా, జోన్, మల్టీజోన్ అనే దానిపైనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పనిచేసే చోటు నుంచి రిలీవ్ కాకుండా కొత్త జిల్లాల్లో రిపోర్టు చేయడాన్ని కేడర్ విభజనగా తీసుకోవాలే తప్ప కొత్త ప్రాంతంలో వెంటనే పనిచేయాలన్నట్లు కాదని ప్రభుత్వ వర్గాలూ స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలవారీ విభజనతోపాటే భార్యాభర్తలు, వికలాంగుల బదిలీలు, ఇతర అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రకమైన అప్పీళ్లను పరిశీలించాక కొన్ని మార్పుచేర్పులు జరిగే వీలుంది. మొత్తమ్మీద వచ్చే నెల 20 నాటికి క్షేత్రస్థాయి విభజన తుది దశకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ విభజన తక్షణ అవసరం కావడంతో ఈ కసరత్తు పూర్తవుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. చదవండి: పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా... శేషప్రశ్నలెన్నో... మిగతా ప్రభుత్వ శాఖల్లో విభజన పెద్దగా సమస్యలు తేవట్లేదు. విద్యాశాఖలోనే అనేక సందేహాలకు తావిస్తోంది. మెజారిటీ టీచర్ల విభజన జిల్లా స్థాయిలోనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుత జిల్లా నుంచి కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టింగ్ ఇచ్చే జిల్లాలో విద్యాశాఖ కౌన్సెలింగ్ జరిపి ఏ స్కూల్లో పనిచేయాలనేది నిర్ణయిస్తుంది. దీనికోసం విద్యాశాఖ విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా మారిన వారికే బదిలీలు చేపట్టాలా? సాధారణ బదిలీల మాదిరి మార్గదర్శకాలు ఇవ్వాలా? సీనియారిటీ కొలమానమైతే ఇవ్వాల్సిన ఆప్షన్లు ఏమిటి? ఇలా అనేక అంశాలపై గురువారం అధికారులు చర్చించారు. చదవండి: టీఆర్ఎస్కు త్వరలో కొత్త ‘టీమ్’.. కసరత్తు ప్రారంభించిన సీఎం కేసీఆర్ కేడర్ విభజన పూర్తయింది కాబట్టి బదిలీల ప్రక్రియను విద్యాసంవత్సరం ముగిసేవరకూ వాయిదా వేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లా కేడర్ ఇచ్చిన టీచర్ అప్పటివరకూ ఉన్న చోటే పనిచేస్తే నష్టమేమీలేదని అధికారులు అంటున్నారు. ఇది పాలనాపరమైన సమస్యకు దారితీస్తుందని విద్యాశాఖలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖలో మూడేళ్లుగా బదిలీల్లేవు. దీంతో అన్ని ప్రాంతాల్లో టీచర్లు ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని అధికారులు కేడర్ విభజనకు ముందు నిర్ణయించారు. దీంతో ఇప్పటికిప్పుడు బదిలీలు ఎందుకని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రావచ్చని ఓ అధికారి తెలిపారు. -
కొలిక్కిరాని కుస్తీ...
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : తెలుగుదేశం పార్టీలో సీట్ల ఎంపిక ఇంకా కొనసా..గుతూనే ఉంది. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం సీట్లకు సంబంధించి వివాదాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ముందుకు సాగడం లేదు. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబం ధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. సోమవారం కూడా నిడదవోలు, కొవ్వూరు నాయకులను అమరావతి పిలిపించి సమన్వయ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అయితే అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. సగంమంది కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఇవ్వడానికి ససేమిరా అనగా మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. అదే సందర్భంలో నిడదవోలుపై కూడా పీటముడి వీడలేదు. ఒక వర్గం కుందుల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరగా, మరికొంతమంది శేషారావుకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశాన్ని మరో రెండురోజులు వాయిదా వేశారు. ఘంటా మురళి చేరికను పురస్కరించుకుని చింతలపూడి నేతలు కూడా తమ నాయకుడి దృష్టిలో పడేందుకు అమరావతి వెళ్లారు. స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్థానాలు, సీట్లు కేటాయించిన స్థానాల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తులను బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. వాటిలో భాగంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి నేతలందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అసంతృప్తులు ఉన్న చోట్ల ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎక్కడెక్కడ అసమ్మతి రగులుకుంటుందో ఆయా అసమ్మతి నేతలతో మాట్లాడి నామినేషన్లకు ముందుగానే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం, మార్పులు చేర్పులు చేయడం లాంటి అంశాలపై చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. అయితే ఇరువర్గాలు తగ్గకపోవడంతో మళ్లీ నిడదవోలు, కొవ్వూరుపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికి టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సీటు ఆశించిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఈ అసమ్మతి సద్దుమణిగేలా చేసేందుకు బాపిరాజుకు ఉంగుటూరు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మంత్రి జవహర్‌కు మళ్లీ చుక్కెదురు కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఖరారు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్‌కి మరోసారి చుక్కెదురైంది. సోమవారం నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అభ్యర్థి ఎంపిక అంశాన్ని మరో రెండు రోజులు పాటు వాయిదా వేశారు. జవహర్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారుపై అధిష్టానం సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జవహర్‌కి టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో మరో రెండు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు మంత్రి జవహర్‌కి దాదాపుగా ఈసారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరుపక్షాల నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గానీ తన కుమార్తె దివ్యరాణికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. రిటైర్డు ఉద్యోగులు రాపాక సుబ్బారావు, అయినపర్తి రాజేంద్రప్రసాద్, పెనుమాక జయరాజుతో పాటు వేమగిరి వెంకటరావు, బచ్చు శ్రీనుబాబు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. -
పాతవారికే మద్యం కిక్కు!
శ్రీకాకుళం క్రైం : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన వరకు కొనసాగుతూ వచ్చింది. లాటరీ ఫలితాలు వెల్లడించిన పేర్లలో అధికమంది పాతవారే ఉండడం గమనార్హం. పక్కా ప్రణాళికతో ఒక్కో దుకాణానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసి మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలో 232 మద్యం దుకాణాల లెసైన్సులు పొందేందుకు ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియాల్సి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు కొనసాగింది. మొత్తం 232 దుకాణాల్లో 203 దుకాణాలకు 2,567 దరఖాస్తులు దాఖలయ్యాయి. 29 దుకాణాలకు దరఖాస్తులు దాఖలు కాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో 35 దుకాణాలకు సింగల్ దరఖాస్తులు పడ్డాయి. అయితే, దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.6,41,75,000 ఆదాయం వచ్చింది. గతంలో సుమారు 2000 దరఖాస్తుల వరకు దాఖలుకాగా, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 2567 వచ్చాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ రెవెన్యూ పెంచడంలో విజయం సాధించారు. వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. లాటరీ తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి సాయంత్రం అయ్యింది. లాటరీ విధానాన్ని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా సహాయ కలెక్టర్ అధ్వైత్‌కుమార్ సింగ్, ఏజేసీ మహ్మద్ షరీఫ్‌లు పర్యవేక్షించారు. జేసీ టెండర్ బాక్సులకు ఉన్న సీల్‌లను కట్ చేసి దరఖాస్తులను బయటకు తీశారు. ఏజేసి మహ్మద్ షరీఫ్, ఎక్సైజ్ డీసీ టి.నాగలక్ష్మి దుకాణాల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి లాటరీ విధానాన్ని చివరి వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. అర్ధరాత్రి దాటినా... శనివారం అర్ధరాత్రి దాటిన వరకు దుకాణాల కేటాయింపు కొనసాగుతూనే ఉంది. లాటరీ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లాటరీ ప్రక్రియలో జాప్యంతో దరఖాస్తుదారులు అంబేద్కర్ ఆడిటోరియంలోని కుర్చీల్లోనే నిరీక్షించారు. ఉత్కంఠతో ఎదురు చూశారు. మొత్తం 203 దుకాణాలకు సంబంధించిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దుకాణాలను కైవసం చేసుకున్న వారిలో చాలామంది పాత వ్యాపారులే ఉండ టం గమనార్హం. దుకాణాలు కైవసం చేసుకున్నవారిలో... శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని దుకాణాలను కైవసం చేసుకున్నవారిలో గజెట్ నెంబరు వరు స క్రమం ప్రకారం ఎస్.నాగమణి, జి.భాస్కరరావు, ఎం.కనకమ్మ, ఎస్.గాంధీభరత్నాయు డు, పి.రాజారావు, పి.శ్రీరాములు, పి.బి. రామకృష్ణ, జి.రాజకుమారి, ఎస్.గోపాలరావు, సి.హెచ్.వెంకటకృష్ణారెడ్డి, ఎస్.అనూష, బి.వెం కటరావు, ఎం.సర్సింహమూర్తి, కె.అప్పారావు, ఓ.రాధ,ఆర్‌ఆర్‌డి.శ్వేత, బి.వి.రమణ, సిమ్మ వైకుంఠరావు, ఎం.శ్రీనివాసరావు, పైడి గోవిం దరావు, ఎస్.అప్పలరాజు, బి.ప్రవీణ్‌కుమార్, ఎం.నర్సింగరావు, వై.జగదీష్, కె.గోవింద్, బి.సాయిరాం, బి.అప్పలస్వామి, ఎం.రమణ, ఎం.మెహర్శంకర్ ఉన్నారు.