alluri krishnam raju
-
రాజోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ వైయస్సార్ సిపి కోఆర్డినేటర్ అల్లూరి కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి
-
చాలా గర్వంగా ఉంది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. కేసీఆర్ పాత్రలో నటుడు నాజర్ నటిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాజర్ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి.. గెలిచిన కేసీఆర్‌గారి పాత్రలో నటించడం చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. కేసీఆర్‌గారి వీడియోలు చాలా చూశా. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా’’ అన్నారు. ‘‘కేసీఆర్‌గారు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం నుంచి బంగారు తెలంగాణ వరకు ఈ సినిమా ఉంటుంది. నవంబర్ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్రావు. ‘‘కేసీఆర్‌గారి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. నాజర్గారైతే పర్ఫెక్ట్గా ఉంటుందని ఆయన్ని తీసుకున్నాం’’ అన్నారు కృష్ణంరాజు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి, సహ నిర్మాత: మేకా రాఘవేంద్ర. -
వైఎస్సార్సీపీలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్న అనంతరం పార్టీలో చేరారు. అలాగే, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దౌలతాపురం ప్రభాకర్, దశరథ్‌రెడ్డి, శంకర్లు కూడా జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పామిడి వీరాంజనేయులు, సీహెచ్ దిలీప్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ .... అల్లూరి కృష్ణంరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లూరి కృష్ణం రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.