తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు సోమవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ .... అల్లూరి కృష్ణంరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అల్లూరి కృష్ణం రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.