Alok Sharma
-
బొగ్గు వినియోగం నిలిపివేతపై ఇంకా అస్పష్టత
గ్లాస్గో: భూతాపం(గ్లోబల్ వార్మింగ్)పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు ముగిసిపోయినప్పటికీ తాజా ప్రతిపాదనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునివ్వాలన్న సూచనలను పరిశీలిస్తున్నట్టు శనివారం విడుదల చేసిన ముసాయిదా ప్రకటన స్పష్టం చేసింది. కాప్–26 నిర్ణయాలను 197 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే అవి అమల్లోకి వస్తాయి. అందుకే సదస్సు ముగిసిన తర్వాత కూడా అతి పెద్ద దేశాలు చర్చల ప్రక్రియని ముందుకు తీసుకువెళతాయి. కాప్–26 శిఖరాగ్ర సదస్సుకి నేతృత్వం వహించిన బ్రిటన్ మంత్రి, భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పులపై అత్యుత్తమ పరిష్కారాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలేవీ భూతాపం పెరుగుదలను నిరోధించలేవని, మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాప్–26లో పాల్గొన్న పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు. -
భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలి
గ్లాస్గో: గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని కాప్– 26 అధ్యక్షుడు, బ్రిటన్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అలోక్శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు)కి నేతృత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలోక్ శర్మ భూతాపోన్నతిని తగ్గించడానికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉష్ణోగ్రతల్ని తగ్గించే మార్గాన్ని చూడాలన్నారు. ‘‘ఆరేళ్ల క్రితం పారిస్ సమావేశలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడాలని అనుకున్నాం. 1.5 డిగ్రీలకి పరిమితం చేయడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలి’’ అని అలోక్ అన్నారు. నవంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
బోరిస్ టాప్ టీంలో ముగ్గురు మనోళ్లే
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కేబినెట్లో భారత సంతతికి చెందిన ముగ్గురికి కీలక పదవులు దక్కాయి. బ్రిటన్ హోంశాఖ కార్యదర్శిగా ప్రీతి పటేల్ కీలక పదవిని దక్కించుకోగా, టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, రిచ్మాండ్ ఎంపీ రిషి సునాక్(39) ట్రెజరీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జూనియర్ మంత్రి అలోక్ శర్మ(51) ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖలతో కేబినెట్ మంత్రి హోదాకు పదోన్నతి లభించింది. బోరిస్ నేతృత్వంలోని కొత్త కేబినెట్లో మెరిసిన కొత్త ముఖాల్లో ముగ్గురు భారతీయులు ప్రముఖంగా వుండటం ఒక విశేషం కాగా, టాప్ టీంలో ముగ్గురు మంత్రులు చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. బోరిస్ కేబినెట్లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ప్రీతి పటేల్ గుజరాత్‌కు చెందినవారు. 2010లో ఎసెక్స్‌లోని వీథమ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రీతి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బృందంలో ఆమె కీలక పాత్ర పోషించారు. హాంప్‌షైర్‌లో జన్మించిన రిషి సునాక్ 2015 నుంచి రిచ్మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేశారన్న ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ఆగ్రాలో జన్మించిన శర్మ ...థెరిసా మే ప్రభుత్వంలో ఉపాధి మంత్రిగా ఉన్నారు. 2010 నుండి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గంనుంచి ఎంపీగా ఉన్నారు. కన్జర్వేటివ్ నాయకత్వ ఎన్నికల్లో జాన్సన్‌కు మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ఒకరు. కాగా మాజీ ప్రధాని థెరిసామే రాజీనామా అనంతరం బోరిస్ జాన్సన్ బుధవారం అధికారికంగా బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తామనీ, ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు బ్రెక్సిట్ బ్రిటిష్ ప్రజల ప్రాథమిక నిర్ణయం. అందుకే ఎలాంటి శషభిషలు లేకుండా బ్రెగ్జిట్‌కు కట్టుబడి వున్నామని, అక్టోబర్ 31 న ఈయూ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ఆత్మహత్యా లేదా హత్యా అన్న కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అలోక్ శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల అవి విషపూరితమై సునంద మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన శవ పరీక్షలో తేలిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె రెండు చేతులపై 12కు పైగా గాయాలున్నాయని, ఎడమ చెంపపై కమిలిన గాయం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అయితే ఈ గాయాల వల్ల చనిపోయే అవకాశం లేదని వివరించారు. చేతులపై గాయాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్డీఎం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా హత్యకు గురైందా అన్న కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులకు సూచించారు. ‘‘ఆమె మరణానికి మూడు కారణాలు ఉండొచ్చు. ఒకటి హత్య.. రెండు ఆత్మహత్య.. మూడోది ప్రమాదవశాత్తూ చనిపోవడం. ఇందులో మరణానికి కచ్చితంగా ఏది కారణమైందో దర్యాప్తు చేయాలి’’ అని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
-
'విష ప్రయోగం వల్లే సునంద పుష్కర్ మృతి'
సునంద పుష్కర్ మరణం హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ ఆదేశించారు. అయితే విష పూరిత పదార్ధాలు తీసుకోవడమే ఆమె మరణానికి దారి తీసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సునంద మృతిపై ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని నివేదికలో శర్మ తెలిపారు. అతిగా డ్రగ్స్ తీసుకోవడంతో ఆమె మరణం సంభవించిందని.. ఇలాంటి కేసులో విష ప్రయోగం జరిగిందని చెప్పవచ్చు అని ఎయిమ్స్ వైద్యులు శవపరీక్షలో అనంతరం వెల్లడించారు. అంతేకాకుండా సునంద చేతులపై డజన్ పైగా గాయాలు, బుగ్గపై ఓ గాయం కూడా ఉందని వైద్యులు నివేదికలో తెలిపారు. తన మరణానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోలేదని, ఆమె కడుపులో ఎలాంటి ఆహార పదార్ధాల నమూనాలు లభించలేదని తెలిపారు. ఆమె మరణించిన హోటల్ గదిలో మానసిక రుగ్మత నుంచి ఉపశమనం పొంతే కొన్నిమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. కేంద్రమంత్రి శశి థరూర్ తో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో ట్విటర్ లో గొడవ పడిన మరుసటి రోజే ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.