Alwar district
-
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ దెబ్బలకు పోలీసులకు సంబంధం లేదు..!
ఆల్వార్/రాజస్థాన్: ఆళ్వార్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న మూకహత్యపై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండగా.. గోరక్షకుల దాడిలో చనిపోయిన రక్బార్ఖాన్ పోస్టుమార్టం రిపోర్టు విడుదలైంది. మూకదాడిలో చనిపోయిన వ్యక్తి మృతికి పోలీసులు కారణం కాదని ఈ నివేదిక వెల్లడించింది. పోస్టుమార్టం జరిగే సమయానికి 12 గంటల క్రితం తగిలిన గాయాల వల్లే బాధితుడు కన్నుమూసినట్టు నివేదిక చెప్తోంది. అంటే రక్బార్ఖాన్పై శనివారం అర్ధరాత్రి దాడి జరిగినట్టు లెక్క. కానీ, అది అవాస్తవమనీ రక్బార్ఖాన్ను పోలీసులు చితకొట్టడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మొత్తం మీద దాడి జరిగిన తర్వాతే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నట్టు, మృతదేహంపై ఉన్న గాయాలకూ పోలీసులకు సంబంధం లేనట్టు నివేదిక పేర్కొంది. వివరాలు.. రక్బార్ఖాన్, అతని మిత్రుడు అస్లాంలు రెండు ఆవులను కొనుగోలు చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్తుండగా కాపుకాసిన కొందరు దుండగులు ఆళ్వార్ పట్టణ సమీపంలో వారిపై మూకదాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రక్బార్ఖాన్ను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. క్షతగాత్రున్ని అయిదు కిలోమీటర్ల దూరంలో గల ఆస్పత్రికి చేర్చడానికి వారికి నాలుగు గంటల సమయం పట్టింది. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తీరిగ్గా టీ, కాఫీలు తాగి ఆస్పత్రికి చేరుకోవడంతో రక్బార్ఖాన్ అప్పటికే మృతి చెందాడనీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హోంమంత్రి గులాబ్చంద్ కటారియా విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు మాత్రం పోలీసులకు అనుకూలంగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి పోలీసులు నాలుగు గంటల పాటు టీ, కాఫీలే తాగారా..! లేదా అమాయకున్ని చూసి ఆడుకున్నారా అనే విషయం మరుగున పడినట్టయింది. -
మనిషా, పశువా లేదా పశువా, మనిషా!
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ మూక హత్య జరిగి ఏడాది గడిచిందో లేదో రాజస్థాన్లోని అదే అల్వార్ జిల్లాలో శనివారం నాడు మరో మూక హత్య చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా లాల్వండి గ్రామంలో రక్బర్ ఖాన్, ఆయన మిత్రుడు అస్లాంలు కలిసి రెండు ఆవులను, వాటి దూడలను తోలుకొని వెళుతుండగా వారిపై సాయుధులైన గోరక్షకులు దాడి జరిపారు. తమపై అనుమానాలుంటే పోలీసులకు పట్టించి విచారించాల్సిందిగా వేడుకున్న వినకుండా తీవ్రంగా కొట్టారని అదే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అస్లాం తెలిపారు. దేశంలో కొనసాగుతున్న మూక హత్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నివారించడం కోసం పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత విచారకరం. మూక హత్యలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల పహారాను పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనలను కూడా ఇక్కడ పట్టించుకోక పోవడం రాజస్థాన్ ప్రభుత్వం వైఫల్యం. ఇక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా ఉంది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్బర్ ఖాన్ను అస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు నాలుగున్నర గంటలు పట్టిందంటే వారి అలసత్వం అర్థమవుతూనే ఉంది. ముందుగా స్వాధీనం చేసుకున్న గోవులను గోరక్షణ శాలకు తరలించడంపై దృష్టి పెట్టిన పోలీసులు గాయపడిన ఖాన్ను పట్టించుకోకపోగా, మార్గమధ్యంలో తీరిగ్గా టీ తాగి మరీ ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణంకన్నా ఓ గోవు ప్రాణానికి ఎక్కువ విలువనిస్తున్న వసుంధర రాజె ప్రభుత్వం దృక్పథం వంటబట్టి పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, సహజసిద్ధంగానే వారి నరాల్లోనే నిర్లక్ష్యం పేరుకుపోయిందా? మనిషి ప్రాణానికి రూ.26, గోవు ప్రాణానికి రూ.70 దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను, దూడపై రోజుకు 35 రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 33 రకాల ప్రజల లావాదేవీలపై ‘ఆవు సెస్సు’ విధించడం ద్వారా రాబడుతోంది. రాష్ట్రంలోని పలు గోసంరక్షణ శాలలను ఆధునీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా మేత అందుతుందో, లేదో పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజస్థాన్లో గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకన్నా ఏటా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. రాష్ట్రంలో గోవుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని ఓ అంచనా. సకల చరాచర ప్రపంచంలో జంతువుల పట్ల కారణ్యం కలిగి ఉండాలని వాదించే నేటి రోజుల్లో పాలిచ్చే ఆవు పట్ల మరింత శ్రద్ధ ఉండాల్సిందే. కానీ మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు. మనిషి ప్రాణాలకన్నా గోవు ప్రాణాలకే విలువ ఇవ్వదల్చుకుంటే ‘మనిషివా, పశువువా!’ అని తిట్టేబదులు ‘పశువువా, మనిషివా!’ అంటూ ఇక తిట్టాలి కాబోలు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఓ సగటు రిక్షా కార్మికుడు రోజుకు 70 రూపాయల నుంచి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో 28 రూపాయలు గుడిశె అద్దెకు చెల్లించాలి. మిగతా డబ్బుతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించాలి. దారిద్య్ర రేఖకు దిగువనున్న రాష్ట్ర పేద ప్రజల్లో 30 శాతం మంది ఇలాంటి రిక్షా కార్మికులే ఉన్నారు. మోది ప్రతిష్టను దెబ్బతీయడానికా! దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కొంత మంది కుట్ర పన్ని ఇలాంటి మూక హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆరోపించడం, హిందువులకు చెడ్డ పేరు తీసుకరావడం కోసం పోలీసులే ఖాన్ను చంపేశారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజ ఆరోపించడంలో అర్థముందా! -
మాంగల్య బలం
రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా భికంపుర గ్రామానికి చెందిన విజేంద్ర ఒక ట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జూన్ 12, 2013లో భార్య లీలతో పాటు, 30 మంది ప్రయాణికులతో తాను చేసే ట్రావెల్ కంపెనీ బస్సులో చార్ధామ్ యాత్రకు వెళ్లాడు. కానీ, దురదృష్టం మృత్యువరదైంది. చెల్లిని కోల్పోయిన అన్న, కొడుకును కోల్పోయిన తండ్రి, తండ్రి చావు చూసిన కొడుకు... గుండె చెరువయ్యేంత విషాదం. ఈ వరదల్లో విజయేంద్ర కూడా తన భార్య లీలను కోల్పోయాడు. ఆమె కోసం వెదకని చోటు లేదు. కలవని అధికారి లేడు. మొక్కని కాలు లేదు. ఎక్కడా ఆమె జాడలేదు. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. ఏడాదిన్నర అయింది. బంధువులందరూ ఆశ వదులుకున్నారు. ఆమె చనిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, 9 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చింది. కానీ విజేంద్రకు ఎక్కడో ఒక నమ్మకం. తన భార్య ఎక్కడో ఒక చోట బతికే ఉందని. దేవుడి దయ తన మీద ఉందని. అందుకే... ఏ రోజు అయితే తన భార్య కనిపించకుండా పోయిందో, ఆరోజు నుంచి ఉత్తరాఖండ్ను విడిచివెళ్లలేదు అతను. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా భార్యను వెదుక్కుంటూ వేలాది గ్రామాలకు వెళ్లాడు. కనిపించిన వారికల్లా ఆమె ఫోటోను చూపించాడు. 2015 జనవరి 27. చివరికి ఎవరో చెప్పారు. ‘‘గోంగోలి అనే ఊళ్లో ఒక అమ్మాయి మతిస్థిమితం లేకుండా తిరుగుతోంది. నీ దగ్గర ఉన్న ఫొటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది’’ అని చెప్పారు. పరుగుపరుగున ఆ ఊరికెళ్లాడు విజేంద్ర. అదృష్టం ఏమిటంటే ఆమె అతడి భార్యే! దురదృష్టమేమిటంటే... లీలా ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు కూడా. అయితే ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందట. ఆమె తిరిగి మామూలు మనిషయ్యే రోజు కోసం, జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకునే రోజు కోసం ఇంటిల్లిపాది ఆశగా ఎదురుచూస్తోంది.