Amara Raja Group
-
రామోజీ.. అస్మదీయ తకథిమి
కంపెనీలకు ప్రాజెక్టులెలా ఇవ్వాలో రామోజీ చెబుతాడు! ఆ కంపెనీలతో ఆయన చెప్పినట్టే ఒప్పందాలు చేసుకోవాలట! వాళ్ల పెట్టుబడి, వాళ్లకిచ్చే రాయితీలు... అన్నిటినీ ఆయన నిర్దేశించినట్లే ఉండాలట! అలా చేయకపోతే..? ఒక కంపెనీ వచ్చినా ఆ కంపెనీ అస్మదీయులదేనంటూ ముద్రవేస్తాడు. ఒక కంపెనీ దివాలాతీసి వెళ్లిపోతే... ప్రభుత్వమే వెళ్లగొట్టిందని ప్రచారం చేస్తాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు చీకటి రోజులు దాపురించాయంటాడు. ఎందుకంటే ఆయన చేతిలో పత్రిక ఉంది. ఆయన రాతలు... ఆయనిష్టం. కానీ ఇక్కడున్నది ఆయన చెప్పినట్టల్లా ఆడే నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదే..? ఈ ప్రభుత్వానికి తన ప్రాధాన్యాలేంటో తెలుసు!. వాటి కోసం ఎలా పనిచేయాలో తెలుసు! అందుకే ఈ ప్రభుత్వాధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అందరూ అస్మదీయులే. ఎందుకంటే ఆయన ప్రజలందరినీ ‘నా వాళ్లే’ అనుకుంటారు కాబట్టి!!. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయండంటూ ఎవరైనా టెండర్లు పిలుస్తారా రామోజీరావ్? అసలు అలా టెండర్లు పిలవటం ఏ రాష్ట్రంలోనైనా... ఎప్పుడైనా చూశామా? ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు పెట్టాలని అనుకుంటే... వాటికి సంబంధించి ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. అలా వచ్చిన వాటి నుంచి.. వాటి సామర్థ్యం, గత అనుభవం, పేరు ప్రఖ్యాతుల ఆధారంగా ఎంపిక చేస్తుంది. ఇదీ పద్ధతి. కానీ... ‘సన్నిహితులకే ఎనర్జీ’ అంటూ మంగళవారం ‘ఈనాడు’ ఏడ్చిన ఏడ్పులో రవ్వంతైనా నిజముందా? ఆరు కాలాల కడుపుమంట తప్ప అసలేముంది అందులో? ప్రతి అక్షరం అబద్ధాలు పేర్చుకుంటూ రాసిన విషపు రాతల్లో అబద్ధాల గుట్టును విప్పే... ‘ఏది నిజం?’ ఇదిగో... మరీ అన్ని అబద్ధాలు అచ్చేయటానికి కొంచెమైనా విలువలంటూ అడ్డురావాలి కదా? ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించడానికి వీలైన ప్రాంతాలను గుర్తించి, నివేదికలు తయారు చేయించింది ప్రభుత్వం. మరో 10వేల మెగావాట్లకు కూడా ప్రాంతాలను గుర్తించింది. వాటన్నిటినీ నెడ్‌క్యాప్ వెబ్సైట్లో ఓపెన్‌గా ఉంచింది. తగిన ప్రతిపాదనతో ఎవరైనా ముందుకు రావచ్చు. ఈ అవకాశాలను వివరించడానికే ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దావోస్‌కు వెళ్లారు. అక్కడ ఇవన్నీ వివరించిన మీదట... అదానీ, అరబిందో, షిర్డీ సాయి, అస్థా, ఇండో సోలార్, గ్రీన్కో సంస్థలు 14,650 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కోసం అక్కడే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంకా 30వేల మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఓపెన్‌గానే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఆఖరికి రామోజీరావైనా... ఆయన అస్మదీయులు రాధాకృష్ణ, చంద్రబాబు, టీవీ 5 నాయుడు... ఎవరైనా!!. ఇవేమైనా చిన్న సంస్థలా? అదానీ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటి. అరబిందో ఫార్మా రూ.2,500 కోట్ల వార్షిక లాభంతో దేశంలో టాప్–2 ఫార్మా కంపెనీ. షిర్డీ సాయి విషయానికొస్తే... దేశీయంగా ఉత్పత్తిని పెంచి.. చైనా దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) కింద భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. అది కూడా... అదానీ, జిందాల్, రిలయన్స్ వంటి సంస్థలతో పోటీపడి !!. రూ.10వేల కోట్లతో రాయాయపట్నంలో సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోందీ సంస్థ. ఆ పరిశ్రమ అవసరాల కోసం (క్యాప్టివ్) 1,200 మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు, మరో 900 మెగావాట్ల పీఎస్పీని చేపడుతోంది. కడప జిల్లాలో ఈ సంçస్థకు చెందిన ట్రాన్స్ఫార్మర్ల ప్లాంటు దేశంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి. గ్రీన్కో సంస్థ చంద్రబాబు హయాంలోనే పీఎస్పీ ప్రాజెక్టును చేపట్టింది. ఇండోసోలార్, అస్థా గ్రీన్ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో ఉన్నాయి. అంటే... అరబిందో, షిర్డీ సాయి సంస్థల ప్రమోటర్లకు పేరు చివర ‘రెడ్డి’ అని ఉంటే.... వాళ్లు అస్మదీయులైపోతారా? ఈ కంపెనీలకున్న అర్హతలేవీ చూడాల్సిన పనిలేదా? ఎందుకీ దుర్మార్గపు రాతలు? మరి ఇదే అరబిందో ఫార్మాతో కలిసి తన తమ్ముడు భాగస్వామిగా ‘ఆంధ్రా ఆర్గానిక్స్’ సంస్థను గతంలో చంద్రబాబే స్వయంగా పెట్టించాడు. అప్పుడేమనుకోవాలి? అది ఎవరి అస్మదీయుల సంస్థ? షిర్డీ సాయి సంస్థకు అంతటి భారీ ప్రాజెక్టును పీఎల్ఐ కింద కేంద్రం ఇచ్చింది కాబట్టి ఇది కేంద్రానికీ అస్మదీయ సంస్థేనా? ఇంకా ఎన్నాళ్లీ దగుల్బాజీ రాతలు? ఎన్టీపీసీ, జెన్కో మీ కళ్లకు కనిపించలేదా? ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, జెన్కోలకు ప్లాంట్లు ఇవ్వలేదని, అంతా ప్రయివేటు వ్యక్తులకే కేటాయిస్తున్నారంటూ మరో దారుణమైన అబద్ధాన్ని వండేసింది ‘ఈనాడు’. మరి కర్నూలు జిల్లాలోని తీగలేరు వద్ద 1,650 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఎన్టీపీసీ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే కేటాయించడం రామోజీకి కనిపించదా? ఏపీ జెన్కోకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మరో అబద్ధం కూడా అలవోకగా రాసేశారు. కానీ ఇప్పటికే సీలేరు వద్ద 1,350 మెగావాట్ల ప్రాజెక్టును అమలు చేస్తున్నది ఏపీ జెన్కో కాదా? ఎగువ సీలేరులో మరో 1,350 మె.వా., నంద్యాల జిల్లా బేతంచెర్లలో 500 మె.వా., యాగంటిలో 1,000 మె.వా., అన్నమయ్య జిల్లా వేంపల్లిలో 800 మె.వా.... ఇలా 5,000 మెగావాట్లు ఏపీ జెన్కో చేపట్టడానికి గుర్తించారు. ఈ వాస్తవాలెందుకు రాయరు? ఏపీ జెన్కోకు ఒక్క పీఎస్పీ కూడా ఇవ్వనట్లు ఎందుకీ దరిద్రపు రాతలు? ఎవరిని మోసం చేయటానికి? ఏ సంస్థయినా దాని సామర్థ్యం మేరకు అది ప్రాజెక్టులు చేపడుతుంది. అది కూడా రామోజీయే నిర్ణయిస్తే ఎలా? భూములనేమైనా ఉచితంగా ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను, నీటిని ఇస్తూ కూడా ప్రభుత్వం వారి నుంచి ఏమీ తీసుకోవటం లేదంటూ పనికిమాలిన రాతలు రాస్తున్న ఇలాంటి పత్రికల్ని ఏం చేయాలి? అసలు ఏ కంపెనీకైనా ప్రభుత్వ భూముల్ని కేటాయిస్తే ఛార్జీలు తీసుకోరా? చంద్రబాబు నాయుడి హయాంలో గ్రీన్కో సంస్థకు ఎకరానికి రూ.2.5 లక్షలు చొప్పున తీసుకుంటే.. ఈ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి... ఎకరా రూ.5 లక్షలుగా నిర్ణయించింది. పైపెచ్చు గ్రీన్ డెవలప్మెంట్ ఛార్జీల కింద మెగావాట్‌కు సంవత్సరానికి తొలి పాతికేళ్లు రూ.లక్ష, ఆ తరువాతి పాతికేళ్లు రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు కోసం తెచ్చే రుణాలను కంపెనీలు 25 ఏళ్లలో చెల్లిస్తాయి కనక... తదుపరి 25 ఏళ్లు ఫీజు ఎక్కువగా నిర్ణయించారు. అదే ఎంఎన్ఆర్ఈ నిబంధనల కింద యూనిట్‌కు 2పైసల చొప్పున వసూలు చేస్తే ఎంతవుతుందో తెలుసా? సంవత్సరానికి మెగావాట్‌కు రూ.43,800. మరి దీనికన్నా రూ.లక్ష/రూ.2 లక్షలు ఎక్కువే కదా? ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించవా? చంద్రబాబు హయాంలో భూముల రేట్లు తక్కువైనా... గ్రీన్ ఎనర్జీ చార్జీలనేవే పైసా కూడా లేకపోయినా... ఒక్క అక్షరం కూడా రాయని రామోజీరావు ఇప్పుడు చెలరేగిపోతున్నారెందుకు? అసలిలాంటి రోత రాతల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? రెవెన్యూపైనా తప్పుడు రాతలే... ఈ ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వానికొచ్చే రెవెన్యూ పెద్దగా ఉండదంటూ నోటికొచ్చిన లెక్కలతో ‘ఈనాడు’ చెలరేగిపోయింది. కానీ ప్రస్తుతానికి అనుమతించిన 14,650 మెగావాట్ల ప్రాజెక్టులతోనే... కేవలం జీఎస్టీ రూపంలోనే ప్రభుత్వానికి రూ.3,956 కోట్ల ఆదాయం రానుంది. ఇవికాక భవిష్యత్తులో గ్రీన్ డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.8,058 కోట్ల ఆదాయం వస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా కేవలం ఈ ప్రాజెక్టుల వల్లే 58,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకనుంది. పైపెచ్చు ఈ ప్రాజెక్టులు తమ సొంత అవసరాల కోసం మరో 7వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటిద్వారా మరో రూ.3,640 కోట్ల రెవెన్యూతో పాటు కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వీటిని ప్రస్తావించకుండా అవాస్తవాలు రాస్తున్న రామోజీని ఏమనాలి? ‘విద్యుత్ రేటు’పై ఒప్పందం సాధ్యమేనా? ఇక ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్తులో రాష్ట్రానికేమీ రాదని, ఇవి బయట విక్రయిస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని చేతికొచ్చినట్లు రాసిపారేశారు రామోజీ. ఈ మేరకు రాష్ట్రం ఎలాంటి ఒప్పందం చేసుకోకపోవటం అన్యాయమని కూడా సూత్రీకరించారు. నిజానికివి ప్రయివేటు ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు పనిచేసేదే... డిమాండ్ –సప్లయ్ సూత్రానికి అనుగుణంగా. అంటే... ఈ ప్రాజెక్టులకు ఎగువన– దిగువన రెండు రిజర్వాయర్లుంటాయి. పగటిపూట డిమాండ్ తక్కువుంటుంది కనక సోలార్ లేదా విండ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ... ఆ విద్యుత్తు సాయంతో నీటిని దిగువ నుంచి ఎగువన ఉండే రిజర్వాయర్‌లోకి పంపిస్తారు. ఇక సోలార్ అందుబాటులో లేనపుడు, డిమాండ్ పీక్‌లో ఉన్నపుడు ఎగువ రిజర్వాయరు నుంచి దిగువకు నీటిని పంపించటం ద్వారా సహజంగా విద్యుదుత్పత్తి చేస్తారు. అది పీక్ సమయం కనక అప్పుడు ఛార్జీలు కాస్త ఎక్కువ ఉంటాయి. అలా ఛార్జీలు ఎక్కువ వస్తాయి కనకే ఈ కంపెనీలు మనగలుగుతాయి. అందుకే ప్రభుత్వం వాటితో మొదటి ప్రాధాన్యత తమకే ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. రేటు అనేది ఆ సమయంలో మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఉంటుంది కనక అది మార్కెట్ చేతుల్లోనే ఉంటుంది. ఈ వాస్తవం రామోజీరావుకు తెలియందేమీ కాదు. కానీ... ప్రభుత్వంపై బురద జల్లటమనే ఎజెండాలో ఇదీ ఒక భాగం కనక... నిజాలు రాయరు. రైతులకు ఎంత లాభమో చెప్పరేం? రైతులు గనక సోలార్ ప్రాజెక్టులకు భూములిస్తే వారికి ఎకరాకు సంవత్సరానికి రూ.30వేల చొప్పున కంపెనీలు లీజు మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇందులో భాగంగానే ఒకేచోట 200, 300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు పెట్టడానికి వీలుగా రైతులంతా కలిసి 1500 ఎకరాల వరకూ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే... ప్రభుత్వమే లీజుకు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకటించారు. మరి ఆ లీజుకిచ్చేది అస్మదీయులా? తీసుకునేది అస్మదీయులా? రైతులకొచ్చే లాభం గురించి ఎందుకు రాయరు? సాగుకు పనికిరాని భూములున్న చోట మూడెకరాలున్న రైతుకు కూడా సంవత్సరానికి రూ.లక్ష వరకూ వచ్చే అవకాశం ఉంది కదా? దీన్ని రైతులంతా స్వాగతిస్తుంటే ఆ విషయమెందుకు రాయరు రామోజీ? డేటా సెంటర్ పోలేదు... మరిన్ని పెట్టుబడులొచ్చాయి అదానీ డేటా సెంటర్ తరలిపోతోందని, తాము కష్టపడి తెచ్చిన ప్రాజెక్టు వెళ్లిపోతోందని గగ్గోలు పెట్టింది చంద్రబాబు నాయుడైతే... దానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ అదానీ డేటా సెంటర్ వెళ్లిపోతే ఎంత నష్టమో ఆనాడు రాసింది ‘ఈనాడే’. నిజానికి డేటా సెంటర్ ఎక్కడికీ పోలేదు. దానికి కేటాయించిన భూములు తగ్గాయంతే. మరి అదే అదానీ సంస్థ ఆ డేటా సెంటర్‌కు అదనంగా ఇపుడు గ్రీన్ ఎనర్జీలో, పోర్టుల్లో దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటే ఎందుకీ ఏడుపు? మీ మనవరాలి వియ్యంకులు కాబట్టి మీరు అమర రాజాను వెనకేసుకుంటూ వస్తున్నారేమో!!. కానీ అమరరాజా సంస్థకు జరిగిన అన్యాయమేంటి? కాలుష్యం నిబంధనలను మించి ఉన్నపుడు... వాటిని సరిచేసుకోవాలంటూ నోటీసులివ్వటం తప్పా? మీ బంధువుల సంస్థలైతే మాత్రం నోటీసులివ్వకూడదా? ఆ సంస్థనేమీ అక్కడి నుంచి వెళ్లిపోమనలేదు కదా? నోటీసులిచ్చినపుడు ఆ నోటీసుల్లో పేర్కొన్న అంశాలను సరిచేసుకుంటే చాలు కదా? మరి అదే అమరరాజా ఇప్పుడు అదే చిత్తూరు జిల్లాలో మరో 250 కోట్ల రూపాయలతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తానని ప్రకటించింది కదా? అదెందుకు ప్రస్తావించరు రామోజీ? అలాంటి సలహాలు ఏనాడూ ఇవ్వరా? ‘ఈనాడు’ ఏనాడూ మంచి సలహాలివ్వదా? రాష్ట్రానికి అంత సత్తా లేదని తెలిసి కూడా... అంత ఖర్చును భరించలేమని తెలిసి కూడా అమరావతి పేరిట లక్షల కోట్ల రాజధానిని గ్రాఫిక్స్ సాయంతో చంద్రబాబు ప్లాన్ చేసినపుడు ఏమయింది రామోజీ మీ విజ్ఞత? విభజన కష్టాల్లో ఇరుక్కున్న ఆంధ్రకు అంతటి సత్తా లేదని, ఆచరణ సాధ్యమైన యోచన చెయ్యాలని మీ పత్రికా ముఖంగా గానీ... మీ ప్రయివేటు సంభాషణల్లో గానీ చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు? నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖపట్నం చక్కని రాజధానిగా మారి ఈ రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటుందని మీకు అనిపించలేదా? అలా అనిపించని మీదీ ఒక పత్రికేనా? అదీ ఒక ప్రభుత్వమేనా? ఎంఎస్ఎంఈలను పట్టించుకున్నారా? లక్షల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని (ఎంఎస్ఎంఈ) చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్నది లేదు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) సమయానికిస్తేనే ఇవి బతికి బట్టకడతాయని తెలిసి కూడా... ఆ ప్రయత్నం చేస్తే ఒట్టు. నిర్లక్ష్యంతో వీటికి సమాధికట్టేశారు. ఒక్కో ఎంఎస్ఎంఈలో సగటున 10 మంది ఉపాధి పొందుతున్నారనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.33 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలలో 23 లక్షలకు పైగా ఉపాధి పొందుతున్నారు. అంత ముఖ్యమైన రంగాన్ని బాబు చిదిమేసినా... రామోజీ పెన్నెత్తితే ఒట్టు. కోవిడ్ కుంగదీíసినా సరే... ఎంఎస్ఎంఈ రంగాన్ని ఈ ప్రభుత్వం నభూతో.. అన్న రీతిన ఆదుకుంది. ప్రోత్సాహకాలను సమయానికి ఇవ్వటమే కాకుండా... అలా ఇచ్చే పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చింది. అందుకే ఈ మూడున్నరేళ్లలో కొత్తగా 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. రూ.20,537 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయిన ఈ యూనిట్ల ద్వారా 10.04 లక్షల మందికి ఉపాధి కలిగిన విషయాన్ని రాయరెందుకు రామోజీ? ఎప్పుడూ ఉద్యోగాల్లేవని, ఉన్నవి ఊడిపోతున్నాయని అబద్ధాలు రాయటం తప్ప ఇంత మందికి ఉపాధి కల్పించిన వాస్తవాన్ని ప్రస్తావించరెందుకు? ఇంకెప్పుడు మారతారు? మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్–1 ఏ పనైనా ఎంత బాగా చేశామన్నదానికి ఫలితాలే గీటురాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన స్వర్ణయుగం అనేది రామోజీరావు నిత్యం అచ్చేసే కథనాల సారాంశం. ఇక చంద్రబాబైతే స్వర్ణయుగాన్ని మించి... అంటుంటారు. మరి ఫలితమో? చూద్దాం. పరిశ్రమలకు ఈ రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైన స్వాగతమిస్తోందన్నది రామోజీ, చంద్రబాబు చెప్పనే చెప్పరు. కానీ సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించే రాష్ట్రాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నెంబర్–1గా నిలుస్తూ వస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేకపోతే... పరిశ్రమలు తాము సంతోషంగా ఉన్నామని చెప్పకపోతే ఈ ర్యాంకు ఎందుకొస్తుంది? మూడేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఈ హోదా మన రాష్ట్రానికే ఎందుకు దక్కుతోంది? అర నిమిషంలో తనను ముఖ్యమంత్రి ఒప్పించారంటూ... 6 నెలల్లో ఆలోచన నుంచి అనుమతులన్నీ వచ్చి, భూ కేటాయింపు పూర్తయి శంకుస్థాపన చేయగలిగామని సాక్షాత్తూ టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ ప్రశంసించారు. ఆయన తన కుమారుడి బయో ఇథనాల్ ప్లాంటు ‘అస్సాగో’కు ఏపీనే ఎంచుకున్నారు. ఏపీలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెప్పింది ఏకంగా ఐటీసీ సీఈఓ సంజీవ్ పురి. ఏపీలో అతిపెద్ద స్పైసెస్ ప్రాసెస్ ప్లాంట్‌ను గత నెల్లోనే ఆయన ప్రారంభించారు. ఇక ఆదిత్యబిర్లా గ్రూపు వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేసిన రెండు నెలలకే తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించింది. తమ గ్రూపు సంస్థలకు ఏపీ కీలకమని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉందని ఆ గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాయే చెప్పారు. ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం ఇప్పుడు ‘జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’ అనేట్లుగా మారిందనేది డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ ప్రశంస. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి కొప్పర్తి ఈఎంసీలో భూమి పూజ చేశారాయన. ఇక రూ.600 కోట్లు పెట్టుబడి పెడదామనుకున్నామని, దాన్నిపుడు రూ.2,600 కోట్లకు పెంచుతున్నామని చెప్పింది సాక్షాత్తూ సెంచురీ ఫ్లైవుడ్ ఛైర్మన్ సజ్జన్ భజాంక. తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్ జిల్లా బద్వేల్లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయనే చెప్పారు. ఇక తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంటు ప్లాంట్లున్న శ్రీసిమెంట్... తొలిసారి ఏపీలో అడుగుపెడదామని నిర్ణయించుకున్నది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని శ్రీసిమెంట్ ఎండీ హరిమోహన్ బంగూర్ కలిశాకే. గుంటూరులో రూ.1,500 కోట్లతో ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది కంపెనీ. మరి ఒక్క కంపెనీ కూడా రాలేదని... ఇప్పటికే ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని విష ప్రచారమెందుకు? అసలు ఏపీ నుంచి ఇటీవలి కాలంలో వెళ్లిపోయిన కంపెనీ పేరు ఒక్కటి చెప్పండి రామోజీ? కొత్తగా నాలుగు పోర్టులు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు రావటంతో పాటు ఆక్వా యూనివర్సిటీ సైతం వచ్చాయంటే అది ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల కాదా? కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులతో పాటు ఎన్నో బాలారిష్టాల్లో చిక్కుకున్న భోగాపురం ఎయిర్‌పోర్టు కూడా ఒక కొలిక్కి వస్తున్నదంటే అది రాష్ట్ర ప్రభుత్వ కృషివల్లనే కదా? రాష్ట్రంలో టైర్–1 నగరాలు లేవు కాబట్టి ఆసుపత్రుల్లో టెర్షియరీ కేర్ (స్పెషలిస్టు సేవలు) తక్కువే. అయినా సరే ప్రభుత్వం ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెస్తున్నదంటే ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ!
సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ! ► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు. ► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. అదనపు పెట్టుబడులు కనిపించవా? ► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది? రిలయన్స్‌కు వివాదాస్పద భూములు ► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్‌టాప్ బ్యాక్స్‌ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్‌కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకువస్తున్న జీయో నెట్ వర్క్ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్ సెట్‌టాప్స్ బాక్స్‌ల తయారీని థర్డ్ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఫ్రాంక్లిన్ పరిస్థితి తెలియదా? ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ డెట్ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. ► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ? ► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? ► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? ► లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)రిపోర్ట్ 2022లో ఆంధ్రప్రదేశ్ అచీవర్‌గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్10 రీజియన్స్‌లో చిత్తూరు–నెల్లూరు రీజియన్ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. ► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది. ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి. ‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం. గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’ – కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి -
హైకోర్టు ఉత్తర్వులా.. డోంట్ కేర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికార వ్యవస్థలను కనీసం ఖాతరు చేయని అమర్‌రాజా సంస్థల యాజమాన్యం చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. టీడీపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీల విష కాలుష్యంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల కిందట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమర్‌రాజా ఫ్యాక్టరీల్లోని కార్మికులకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా మంగళగిరి ఎయిమ్స్‌కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది. వేచిచూసి వెనుదిరిగిన వైద్యులు దీంతో 20 మంది ఎయిమ్స్ వైద్యుల బృందం సోమవారం ఉదయం 9 గంటలకు తిరుపతికి సమీపంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో గల అమర్‌రాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్యుల బృందం కూడా విచ్చేసింది. కానీ ఒక్కరంటే ఒక్క కార్మికుడిని కూడా వైద్యుల వద్దకు ఫ్యాక్టరీ యాజమాన్యం పంపించలేదు. ఉదయం షిఫ్ట్‌లో వెయ్యిమందికి పైగా కార్మికులున్నా వైద్యులు ఉన్న రూమ్ వైపునకు ఎవరూ పోలేదు. కార్మికులను పంపాలంటూ వైద్యులు ఎన్నిసార్లు అడిగినా ఫ్యాక్టరీ సంబంధీకుల నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది. పరీక్షలకు కార్మికులెవరూ రానంటున్నారని.. కావాలంటే వాళ్లు పనిచేస్తున్న మిషినరీ వద్దకు వెళ్లి అడగాలని వైద్యులకు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘అలా చేస్తే కార్మికుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని యాజమాన్యం ఆలోచించింది. అందువల్ల మేం వైద్య శిబిరం వద్దే వేచి చూశాం’ అని ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు. దీంతో సాయంత్రం 5.30 గంటల వరకు వేచిచూసిన తాము చేసేది లేక వెనుదిరిగామని వైద్యులు చెప్పుకొచ్చారు. -
ఎంపీడీవోలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించలేదని చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతిగా వెంటనే సమస్యను అర్థం చేసుకున్నారని చెప్పారు. పదోన్నతులకు ఉన్న ఆటంకాన్ని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 12 కేడర్లకు చెందిన 18,500 మంది పదోన్నతులకు మార్గం సుగమం అయ్యిందని పెద్దిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారిలో విశ్వాసాన్ని కలిగించారన్నారు. తాజాగా పదోన్నతులు పొందిన 255 మంది ఎంపీడీవోలను మంత్రి అభినందించారు. లోపాలను సవరించుకోవాలని చెప్పడం తప్పా? ఏ పరిశ్రమ అయిన నిబంధనల ప్రకారమే పని చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అదనపు ప్రయోజనాల కోసమే అమరరాజా పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్లాలనుకుంటోందన్నారు. అమరరాజా పరిశ్రమ వల్ల కాలుష్య సమస్య ఉందని పీసీబీ, ఎన్జీటీ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏ రసాయనిక పరిశ్రమ అయినా నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత వేరే చోటికి తరలించాలని నిబంధనలుంటాయని, దానిని ఎవరైనా అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేస్తూ, సీఎంపై బురద చల్లాలని చూడటం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రం నుంచి పరిశ్రమ తరలిపోవాలని కోరుకుంటుందా? అని మంత్రి ప్రశ్నించారు. తాము కూడా తమ జిల్లా నుంచి పరిశ్రమ వెళ్లిపోవాలని కోరుకోమన్నారు. లోపాలను సవరించుకుని, నిబంధనలు పాటించాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. 5:3:3 నిష్పత్తిలో పదోన్నతులు.. రాష్ట్రంలో పనిచేస్తున్న ఎంపీడీవోల పదోన్నతికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. పదోన్నతి విధానం లేక 25 ఏళ్లుగా ఎంపీడీవోలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే పరిష్కారం సూచిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రమోషన్లలో సీనియారిటీ వివాదాలను పరిష్కరిస్తూ మధ్యేమార్గంగా మూడు కేటగిరీలైన.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంపీడీవోలు, ప్రమోట్ ఎంపీడీవోలు, ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎంపీడీవోలకు 5:3:3 నిష్పత్తిలో పదోన్నతి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
విషం పీల్చుతూ.. తాగుతూ..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆయా కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ధాటికి చుట్టుపక్కల గ్రామాలు బలిపీఠంపై ఉన్నాయి. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన నీటిని వాడాలి. కానీ అమరరాజా ఫ్యాక్టరీస్ శుద్ధి చేసిన నీటిని కాకుండా పలుమార్లు ప్రాసెస్ చేసిన నీటిని అక్కడే మొక్కలకు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఆ నీటిని దూరంగా సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేయాలి. కానీ అక్కడే వదిలేయడంతో అవి ఇంకిపోయి మొత్తం భూగర్భజలాలన్నీ పాడవుతున్నాయి. ఇక ఆయా ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢత తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కార్మికులు వేసుకునే దుస్తులపైనే కాదు.. కార్మికుల రక్తంలోనూ ఉంది. 20 శాతం ఉద్యోగుల రక్తంలో సీసం శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని పరీక్షల్లో తేలింది. నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీల్లో పనికి వెళ్లే కార్మికులు ప్రత్యేక యూనిఫాం ధరించాలి. విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందు ఆ యూనిఫాం తీసివేసి,.. వేరే దుస్తులు వేసుకోవాలి. కానీ సదరు ఫ్యాక్టరీల యాజమాన్యం ఎక్కడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు... ఫలితంగా కార్మికుల ప్రాణాలకు అక్కడ భద్రత లేకుండా ఉంది.’’ అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఆందోళన వక్తం చేస్తున్నారు.. ‘అమరరాజా లెడ్తో అంతులేని వ్యధ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పీసీబీ అధికారులు స్పందిస్తూ... నిజంగానే అక్కడి పరిస్థితి అదుపుతప్పుతోంది.. కానీ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. అని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢతకు చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువులూ కాలుష్యకాసారంలా మారాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో పీసీబీ తనిఖీలే లేవట గత టీడీపీ ఐదేళ్ల హయాంలో గానీ, అంతకుముందు నాలుగేళ్లలో గానీ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అమరరాజా ఫ్యాక్టరీస్‌లో ఏనాడూ పీసీబీ తనిఖీలు చేసిన దాఖలాలే లేవని స్వయంగా సదరు అధికారులే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఎప్పుడైనా మొక్కుబడిగా పీసీబీ అధికారులు వెళ్లి రావడం తప్పించి తనిఖీలు, దాడులు, విచారణల ప్రసక్తే లేదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడం వల్లనే వాస్తవాలు బయటికొచ్చాయని చెప్పుకొచ్చారు. అక్కడ కాలుష్య నివారణ ప్రమాణాలు కనీసంగా పాటించడం లేదని తేలిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే వరకూ అక్కడ రోడ్లు కూడా లేవు వాస్తవానికి ఎక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పినా.. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కృషి చేస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీల కాలుష్యపు దుష్ప్రభావంతో కునారిల్లే గ్రామాలకు ఇంకెంత ఖర్చు చేస్తారో చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ అమరరాజా ఫ్యాక్టరీ .. గేటు పక్కనే ఉన్న తారకరామానగర్ గ్రామం గురించే కనీసంగా పట్టించుకోలేదు. పైగా ఓ దశలో ఆ ఊరి ప్రజలను తమ ఫ్యాక్టరీ మీదుగా నడవొద్దని హుకుం జారీచేశారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు దారి ఇచ్చారు. ఆ ఊరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిమెంట్ రోడ్డు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలన వచ్చిన తర్వాతే మా గ్రామంలోకి సిమెంట్ రోడ్లు వచ్చాయని స్థానికంగా నివసిస్తున్న ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఏం చేస్తారో చూడాలి ‘అమరరాజా ఫ్యాక్టరీల కాలుష్యం, అందులోని లెడ్ శాతంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణ చర్యలకు ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువిచ్చింది. ఈ లోగా సదరు యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి...’ అని పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ లోగా తమ పీసీబీ తరఫున ఓ కమిటీ అక్కడ పరిస్థితులపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందన్నారు. – పీసీబీ జేసీఈఈ వెంకటేశ్వరరావు -
‘అమర్‌రాజా’లో ప్రమాదకర స్థాయిలో లెడ్
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర స్థాయిలో లెడ్ కాలుష్యం వెలువడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల రక్తంలోనూ లెడ్ శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గాలి, నీరు, భూమిలో కూడా లెడ్ శాతం ప్రమాదకరస్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసివేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. అమర్‌రాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కాలుష్య నివేదికలు సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. నివేదికలోని అంశాలను తాము సమగ్రంగా పరిశీలించామని స్పష్టం చేసింది. -
ఈ ఏడాదే అమర రాజా... బిలియన్ డాలర్ క్లబ్‌లోకి!
రూ. 600 కోట్లతో విస్తరణ ⇒ ఉత్తర, పశ్చిమ భారత్‌లో యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన ⇒ అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా చిత్తూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఈ ఏడాది బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరగలమన్న ధీమాను అమర రాజా గ్రూపు వ్యక్తం చేసింది. గడిచిన ఏడాది తమ గ్రూపు వ్యాపార పరిమాణం రూ. 5,600 కోట్లు దాటిందని, ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో వ్యాపార పరిమాణం బిలియన్ డాలర్ల ( సుమారు రూ.6,300 కోట్లు) మార్కును అందుకోగలమన్న ధీమాను అమర రాజా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా వ్యక్తం చేశారు. చిత్తూరులో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అమర రాజా గ్రోత్ కారిడార్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది విస్తరణ కోసం రూ. 550 కోట్లు వ్యయం చేయగా, ఈ ఏడాది రూ. 600 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన గ్రోత్ కారిడార్‌లో తమ గ్రూపు 150 ఎకరాల వరకు వినియోగించుకొని మిగిలిన ఎకరాలను అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెట్టింపు కానున్న ద్విచక్ర బ్యాటరీ యూనిట్ ద్విచక్ర వాహన బ్యాటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 11 మిలియన్ యూనిట్ల వార్షిక సామర్థ్యానికి అదనంగా మరో 11 మిలియన్ యూనిట్లు కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంతోపాటు ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని, నిర్వహణ పరంగా తక్కువ వ్యయం ఉన్న చోట ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఇంకా 18 నెలల సమయం ఉన్నందున పెట్టుబడి వ్యయం గురించి చెప్పలేమన్నారు. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలకు నేరుగా బ్యాటరీలను అందించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని, ఇప్పటికే హోండా, మహీంద్రా వాహనాలకు అందిస్తుండగా, త్వరలోనే బజాజ్, హీరో గ్రూపులతో ఒప్పందాలు కుదరనున్నట్లు తెలిపారు. ఎగుమతులపై దృష్టి ఎగుమతులపై దృష్టి సారిస్తున్నట్లు అమర రాజా ప్రకటించింది. హిందూ మహా సముద్ర తీర దేశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు రామచంద్ర నాయుడు తెలిపారు. ఇప్పటికే సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లో పట్టు సాధించామని, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, కువైట్, ఆఫ్రికా దేశాల్లోకి విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో సుమారు 15 శాతం ఎగుమతులు ద్వారా సమకూరుతోంది. డిసెంబర్ నాటికి ట్యూబులర్ యూనిట్ రూ. 500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న హోమ్ ఇన్వర్టర్ బ్యాటరీ ‘ట్యూబులర్’ యూనిట్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో పాటు ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్లను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ బ్యాటరీ యూనిట్ సామర్థ్యం 2 బిలియన్ ఎంఏహెచ్‌గా ఉందని, దీన్ని వచ్చే ఒకటి రెండేళ్ళలో 2.4 బిలియన్ ఎంఏహెచ్‌కు పెంచనున్నట్లు తెలిపారు. అలాగే 10 మిలియన్ యూనిట్లుగా ఉన్న ఆటోమోటివ్ యూనిట్ సామర్థ్యాన్ని రెండేళ్లలో 16 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.