Amarana Nirahara Deeksha
-
ప్రశ్నిస్తే పరువు నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కలియుగంలో మనుషులకు దురాశ పెరిగిపోయి డబ్బు మీద వ్యామోహంతో ఎక్కడలేని అరాచకాలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడిని టీటీడీ రోజుల తరబడి పస్తులు ఉంచి అవమానించటానికి నిరసనగా జూలైలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. స్వామివారి సంపదను కాపాడమని అడగడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తనకు శ్రీనివాసుడి సేవ, గుడి మినహా మరో వ్యాపకం, కార్యక్రమాలు లేవని స్పష్టం చేశారు. స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు, తిరువాభరణాలు, ఆలయ భద్రత, పూజల తీరు, అసలు నగలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? తదితర అంశాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపాక దావా వేసుకోండి టీటీడీ తనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం విచిత్రమని రమణ దీక్షితులు పేర్కొన్నారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నోటీసులు ఇవ్వటం, పరువు నష్టం దావా వేయటం సబబుగా లేదన్నారు. తన ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కావాలంటే అప్పుడు పరువునష్టం దావా వేయాల్సిందన్నారు. తన ఆరోపణల విలువ రూ.100 కోట్లేనా అనే సందేహం కలుగుతోందన్నారు. స్వామి పాదాల చెంత రూ.25 వేల కోట్లు పెట్టాలి.. కోట్ల కుటుంబాలకు ఇష్ట దైవమైన తిరుమల శ్రీవారికి ఎన్నో శతాబ్దాలుగా ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలు, పూజలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు చెప్పారు. అయితే ఇటీవల స్వామివారి చెంత అపచారాలు జరుగుతున్నాయని తెలిపారు. 25 రోజులపాటు స్వామివారిని పస్తులు ఉంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి రోజుకు రూ.1,000 కోట్లు చొప్పున 25 రోజులకు గాను రూ. 25 వేల కోట్లు స్వామివారి పాదాల చెంత పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతాపరుద్రుడి కానుక 18 లక్షల మోహరీలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు స్వామివారికి 18 లక్షల బంగారు మోహరీలు కానుకగా ఇచ్చారని రమణ దీక్షితులు చెప్పారు. ఒక్క మోహరీ అంటే 100 గ్రాముల బంగారం అని వివరించారు. ఈ సంపదను ఆలయ ప్రాకారంలోనే దాచి ఉంచినట్లుగా చరిత్ర చెబుతోందన్నారు. స్వామివారికి నైవేద్యం తయారు చేసే పాకశాల నుంచి సంపద దాచిన ప్రాకారానికి సొరంగ మార్గం ఉందన్నారు. అలాంటి పాకశాలలో నిర్మాణ పనులు ఎందుకు చేశారో వెల్లడించాలన్నారు. ఆ మేడం ఎవరు? భూకంపం వచ్చిన మాదిరిగా తిరుమల ఆలయంలో పోటును తవ్వేశారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఈ పనులు నిర్వహిస్తున్నామని జేఈవో తనతో స్వయంగా చెప్పారన్నారు. ‘ఒక మేడం గారు కూడా చెప్పారని జేఈవో అన్నారు. ఆ మేడం ఎవరో తెలియాలి. నా మాట వినకుండా అతి క్రూరంగా వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారు. వెయ్యేళ్ల క్రితం నిర్మించిన కట్టడాలకు మరమ్మతుల పేరుతో అసలేం చేస్తున్నారో చెప్పాలి. రాబోయే తరాలకు అందించాల్సిన చారిత్రక సంపదను నిర్వీర్యం చేస్తున్నారు’అని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మళ్లీ అవే ఎందుకు? తిరుమల వెంకన్నకు కిరీటం, స్వర్ణపత్రాలు, కంటెలు, శంఖుచక్రాలు, హస్తములు, సహస్ర నామహారం, లక్ష్మీహారం, తులసీహారం, సాలగ్రామ హారం, సూర్యకిరీటం, అంతెలు, పద్మపీఠం లాంటివన్నీ ఉన్నా భక్తులతో మళ్లీ మళ్లీ అదే నమూనాలో ఎందుకు తయారు చేయిస్తున్నారో అర్థం కావటం లేదని రమణ దీక్షితులు చెప్పారు. కొత్తగా హారాలు వచ్చినప్పుడు పాతవాటిని భద్రపరిచే ట్రెజరీని ఎవరు పర్యవేక్షిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వకుండా దాటవేస్తోందని ఆరోపించారు. 2017లో అతి నీచమైన కార్యక్రమాలు... 2017లో అతి నీచమైన, అపవిత్ర కార్యక్రమాలు ఎన్నో స్వామివారి సన్నిధిలో జరిగాయని రమణ దీక్షితులు తెలిపారు. ‘అంటు’లో ఉన్న ఇద్దరు అర్చకులతో పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పూజలు చేయించారన్నారు. ఇలా చేయటం స్వామివారి పట్ల అపచారమని చెప్పినందుకే తనను ఇలా వేధిస్తున్నారన్నారు. 1994–95లో అప్రైజర్స్ ఆభరణాల లెక్క తేల్చగా తాను టీటీడీకి రూ.34 వేలు కట్టానని చెప్పారు. ప్రభుత్వం నియమించే అధికారుల వల్లే అన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తిరుమలలో చోటు చేసుకుంటున్న ఘటనలపై పెద్దలు, రాజకీయ ప్రముఖులు, స్వామివారి భక్తులను కలుస్తానని ప్రకటించారు. -
పొన్నం ఆమరణ నిరాహార దీక్ష
కరీంనగర్: జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమరణ దీక్షకు అనుమతి ఇవ్వాలని పొన్నం పోలీసులను కోరగా వారు అనుమతించకపోవడంతో ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. తొలుత ఇంట్లో నుంచి దీక్షకు బయలు దేరగా ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన సోదరి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. పొన్నంతో పాటు దీక్షలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం పాల్గొన్నారు. ఈ దీక్షకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. -
జగన్‌కు మద్దతుగా దీక్షలు
-
వైఎస్ జగన్‌కు మద్దతుగా సీమాంధ్రలో దీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు సీమాంధ్రలోని సమైక్యవాదులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వివిధ ప్రాంతాల్లో ఆయనకు మద్దుతుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అలాగే పలు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌కు మద్దతుగా నగర ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ఫోటోలు పట్టుకుని సమైక్యవాదులు తిరుపతి పుర వీధుల్లో జగన్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినదించారు. సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని వారు హెచ్చరించారు. జగన్ దీక్షకు మద్దతుగా మదనపల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. అదే జిల్లాలోని పుంగనూరులో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సత్యవేడులో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో ఆ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు పునుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఆ పార్టీ నేత సౌమ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. అదే జిల్లాలోని ఆత్మకూరులో జగన్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తులు నిరాహార దీక్ష చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో వైఎస్ జగన్ అభిమానులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలో కూడా జగన్‌కు సంఘీభావంగా పలువురు ఆమరన నిరాహార దీక్ష చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఆ పార్టీ రూరల్ మహిళ అధ్యక్షురాలు పీల మహాలక్ష్మి ఆధ్వరంలో దీక్ష ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలువురు జగన్‌కు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. -
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికొద్ది సేపట్లో చంచల్‌గూడ జైల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. ఉన్నతస్థాయి అధికారులు జైలులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, అలా కుదరకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు నగరంలో సమరభేరీ దీక్షను చేపట్టారు. ఆరోగ్య పరిస్థితల దృష్ట్యా దీక్ష విరమించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైఎస్ విజయమ్మకు సూచించారు. అందుకు ఆమె ఒప్పుకో లేదు. దాంతో శుక్రవారం ఆర్థరాత్రి వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలు అధికారులు కల్పించిన ఫోన్ సహాయంతో నేరుగా వైఎస్ విజయమ్మతో మాట్లాడారు. అనారోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తన తల్లిని జగన్ కోరారు. ఆదివారం నుంచి తాను చంచల్‌గూడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్ విజయమ్మకు జగన్ తెలిపారు. దాంతో వైఎస్ విజయమ్మ దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. -
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికొద్ది సేపట్లో చంచల్‌గూడ జైల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు ఆదివారం చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. ఉన్నతస్థాయి అధికారులు జైలులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, అలా కుదరకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు నగరంలో సమరభేరీ దీక్షను చేపట్టారు. ఆరోగ్య పరిస్థితల దృష్ట్యా దీక్ష విరమించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైఎస్ విజయమ్మకు సూచించారు. అందుకు ఆమె ఒప్పుకో లేదు. దాంతో శుక్రవారం ఆర్థరాత్రి వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు వైఎస్ జగన్ చంచల్‌గూడ జైలు అధికారులు కల్పించిన ఫోన్ సహాయంతో నేరుగా వైఎస్ విజయమ్మతో మాట్లాడారు. అనారోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తన తల్లిని జగన్ కోరారు. ఆదివారం నుంచి తాను చంచల్‌గూడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్ విజయమ్మకు జగన్ తెలిపారు. దాంతో వైఎస్ విజయమ్మ దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.