పొన్నం ఆమరణ నిరాహార దీక్ష
కరీంనగర్: జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమరణ దీక్షకు అనుమతి ఇవ్వాలని పొన్నం పోలీసులను కోరగా వారు అనుమతించకపోవడంతో ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు.
తొలుత ఇంట్లో నుంచి దీక్షకు బయలు దేరగా ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన సోదరి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. పొన్నంతో పాటు దీక్షలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం పాల్గొన్నారు. ఈ దీక్షకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.