Ambit Capital
-
కమలానికి యూపీ దెబ్బ?
సార్వత్రిక ఎన్నికల సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసింది. అధికార పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గనుందన్న సరికొత్త ఆంచనాలు కమలనాథుల్లో ఎంతో కొంత గుబులు రేపుతున్నాయి. ఆంబిట్ కేపిటల్ అనే ఓ బ్రోకరేజీ సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 50 సీట్లు కోల్పోనుంది. దేశం మొత్తమ్మీది 543 సీట్లలో అధికార పార్టీ గెలుచుకోగల స్థానాలు 210 పదికి మించవని క్షేత్రస్థాయిలో తాము చేసిన సర్వే తెలుపుతోందని ఆంబిట్ కేపిటల్ బిజినెస్ స్టాండర్డ్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వివరాలు... గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో తాము ఒక సర్వే నిర్వహించామని.. దాని ప్రకారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో 220 – 240 సీట్లు రావచ్చునని తేలింది. ఆంబిట్ కేపిటల్‌కు చెందిన రితిక మన్కర్ ముఖర్జీ, సుమీత్ శేఖర్లు ఈ సర్వే నిర్వహించారు. మరోసారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు ఉత్తర ప్రదేశ్ ఫలితాలు గండికొట్టవచ్చునని.. 2014లో గెలుచుకున్న 71 స్థానాల్లో గరిష్టంగా 35 మాత్రమే దక్కుతాయని వీరు అంటున్నారు. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్లతో ఏర్పాటైన మహాగఠబంధన్ ప్రభావం బీజేపీపై ఉండనుందని వీరు చెబుతున్నారు. ఈ అంచనాలే నిజమైతే.. ఫలితాల తరువాత బీజేపీ కనీసం నాలుగు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఉండనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీఎస్పీ జట్టు కట్టినా ఆశ్చర్యం లేదన్నది ఆంబిట్ అంచనా. బీజేపీ అభ్యర్థులు నేరుగా అఖిలేష్‌ను మాత్రమే విమర్శిస్తూండటం.. మాయావతిపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని భవిష్యత్ పరిణామాలకు సూచికగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే బీఎస్పీ మూడో అతిపెద్ద జాతీయ పార్టీ. అప్పట్లో తగినన్ని సీట్లు రాకపోయినా.. ఈ సారి ఎస్పీతో జట్టు కట్టిన ఫలితంగా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముంది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసినప్పుడు బీఎస్పీ, ఎస్పీల కూటమికి యూపీలో 45 శాతం ఓట్లు రావచ్చునని, బీజేపీ ఓట్ల శాతం 34.2 వరకూ ఉండవచ్చునని వివరించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొనడం, పశువధశాలపై నిషేధం తమ ఉపాధికి గండికొట్టిందని ఒక వర్గం వారు భావిస్తూండటం దీనికి కారణం. నగరాలకు హిందూ పేర్లు పెట్టడం కూడా ఓటర్లకు నచ్చడం లేదని ఆంబిట్ అంటోంది. -
నోట్ల రద్దుతో వృద్ధికి కోత..!
• కేర్, ఆంబిట్ క్యాపిటల్ నివేదికలు • 2016-17లో 0.5% వరకూ వృద్ధి పడిపోతుంది: కేర్ • వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు అంచనా • 7.3 శాతం నుంచి 5.8 శాతానికి ఆంబిట్ కోత • దేశీయ డిమాండ్ పడిపోతుందని విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెను ప్రతికూల ప్రభావం చూపనుందని కేర్ రేటింగ్స, ఆర్థిక సేవల సంస్థ ఆంబిట్ క్యాపిటల్ శుక్రవారం విడుదల చేసిన తమ నివేదికల్లో తెలిపారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) వృద్ధిరేటుపై ఈ ప్రభావం 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ ఉంటుందని కేర్ రేటింగ్స పేర్కొంది. పలు రంగాల్లో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషించింది. కాగా మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశీయ డిమాండ్ గణనీయంగా పడిపోతుందని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కేవలం 5.8 శాతం వృద్ధి మాత్రమే నమోదవుతుందని నివేదిక పేర్కొంది. చిన్న వ్యాపారాలకు పెను దెబ్బ: ఆంబిట్ ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలోనే జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశం ఉంది. మొదటి తొలి నెలల్లో 6.4 శాతం వృద్ధి నమోదరుుతే, ఇది ద్వితీయార్థంలో 0.50 శాతం తగ్గవచ్చు. ⇔ అక్టోబర్-డిసెంబర్ 2016 నుంచి 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య పన్ను చెల్లింపు రహిత వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జీడీపీలో దాదాపు 40 శాతంగా ఉన్న ఈ వ్యాపారాలకు సంబంధించి దాదాపు సగం వ్యాపార పరిమాణాన్ని సంఘటిత రంగానికి అసంఘటిత రంగం కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పరిణామం అంచనా కారణంగా 2017-18 వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నాం. ⇔ రియల్ ఎస్టేట్, తనఖా రహిత రుణాలు, రియల్టీ సేవలు, బిల్డింగ్ మెటీరియల్స్ వంటి నగదు ఆధారిత లావాదేవీలపై నోట్ల రద్దు సమీప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ⇔ నగదు ఆధారిత లావాదేవీలపై అధికంగా వ్యాపారం చేసే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ⇔ ఆయా రంగాలు స్వల్పకాలంలో తీవ్ర నష్టాలకు గురవుతారుు. వచ్చే రెండేళ్లలో చిన్న, అసంఘటిత రంగాలు పోటీతత్వాన్ని కోల్పోతారుు. తమ మార్కెట్ వాటాను పెద్ద సంస్థలకు కోల్పోతారుు. ⇔ 2017 మార్చి నాటికి సెన్సెక్స్ 29,500 లక్ష్యంగా ఇంతక్రితం అంచనాల ఉపసంహరణ. 2018 మార్చి నాటికి సూచీ 29,000గా ఉంటుందని అంచనా. ⇔ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య,పరపతి విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 25 నుంచి 50 బేసిస్ పారుుంట్ల మేర రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గించే వీలుంది. ⇔ పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని ఇప్పటికే సిటీగ్రూప్, కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం కట్టడికి, ఆర్బీఐ రెపో రేటు కోతకు దారితీస్తాయనీ ఆయా సంస్థలు విశ్లేషించారుు. మరోవైపు రేట్ల కోత, వృద్ధి ఊపుకు తాజా చొరవ దోహదపడుతుందని పారిశ్రామిక సంఘాలు విజ్ఞఫ్తి చేస్తున్నారుు. సేవలు, తయారీలపై ప్రభావం: కేర్ రేటింగ్స ఆర్థిక వ్యవస్థలో దాదాపు 70 శాతం వరకూ ఉన్న సేవలు, తయారీ రంగాలపై ఈ నిర్ణయ ప్రతికూల ప్రభావం ఉంటుంది. అరుుతే బ్యాంకింగ్‌కు ఇది సానుకూలాంశం. వ్యవసాయంపై కొంత తక్కువ ప్రభావం ఉండే వీలుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా నోట్ల రద్దుకు ముందు 7.8 శాతం కాగా ఇప్పుడు దీనికి 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ తగ్గిస్తున్నాం. సేవల రంగంలో వాణిజ్యం, హోటల్స్, రవాణా వంటి రంగాలపై ప్రతికూలత చూపుతుంది. నగదు లావాదేవీలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండడం దీనికి ఒక కారణం. వచ్చే త్రైమాసికంలో కూడా ఈ రంగాల్లో రికవరీ అవకాశాలు ఉండకపోవచ్చు. అరుుతే తయారీ రంగం మాత్రం రెండు నెలలు ప్రతికూలత ఎదుర్కొనే వీలుంది. రియల్టీది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతికూలతే. బ్యాంకింగ్ విషయానికి వస్తే- డిపాజిట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. -
దేశంలో నల్లడబ్బు 30 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బు దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు అంబిట్ కాపిటల్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇది భారత జాతీయ స్థూల ఉత్పత్తిలో 20 శాతానికి సమానమని పేర్కొంది. అదే థాయ్‌లాండ్, అర్జెంటీనా దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా అధికమని తెలిపింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల బంగారం లేదా బులియన్ మార్కెట్లో నల్లడబ్బు పెట్టుబడులు తగ్గిపోయాయని, భౌతికంగానే నల్లడబ్బు మూలుగుతోందని అంబిట్ సంస్థ తెలియజేసింది. ఫార్మల్ బ్యాంకింగ్‌లో కూడా నల్లడబ్బు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయని, నల్లడబ్బు రుణాల రేట్లు గతేడాది 24 శాతం ఉండగా, ఇప్పుడు 34 శాతానికి పెరిగిందని వెల్లడించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ప్రస్తుతం 30 శాతం నల్లడబ్బు చెలామణి అవుతోందని, ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువ శాతం ఉండేదని, రియల్ ఎస్టేట్‌లో రేట్లు పడిపోవడమే నల్లడబ్బు పెట్టుబడులు తగ్గాయనడానికి సూచన అని అంబిట్ సంస్థ పేర్కొంది. 1970, 80 ప్రాంతాల్లోనే దేశంలో నల్లడబ్బు ఎక్కువగా పేరుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ వెల్లడించింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును దేశానికి రప్పించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విఫలమైనా బంగారం కొనుగోళ్లపై నిఘా వేయడం లాంటి చర్యల వల్ల దేశంలో నల్లడబ్బు లావా దేవీలను మోదీ ప్రభుత్వం తగ్గించగలిగిందని తెలిపింది. -
సెన్సెక్స్ టార్గెట్ 30,000!
* ఏడాదిలో చేరే అవకాశం... * స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా.. * మోడీ-బీజేపీ అఖండ విజయంతో * ఇక సంస్కరణలకు జోష్ * అభివృద్ధిపైనే మోడీ పూర్తిగా దృష్టిసారించే చాన్స్ * ఆర్థిక వ్యవసపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తాజా ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం దేశ ఆర్థిక వ్యవస్థకు దివ్వ ఔషధంగా పనికొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఎన్డీఏ కూటమి సాధారణ మెజారిటీ కంటే భారీగా సీట్లను కైవసం చేసుకోవడం... బీజేపీ ఒక్కటే సొంతంగా మేజిక్ ఫిగర్ 272 సీట్లను అధిగమించడంతో ఇక ఆర్థిక సంస్కరణలు కొంత పుంతలు తొక్కుతాయనే అంచనాలు సర్వత్రా బలపడుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి కూడా. అయితే, మోడీ నేతృత్వంలోని సుస్థిర సర్కారు తీసుకోబోయే సాహసోపేత పాలసీ చర్యలతో మార్కెట్లు మరింత పరుగు తీస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సంస్కరణలకు గనుక చేయూత లభిస్తే... సెన్సెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికల్లా 30,000 పాయిం ట్లను తాకొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పెరుగుతుంది... ప్రస్తుతం సెన్సెక్స్ గత రికార్డులన్నీ చెరిపేసి 24,500 స్థాయిలో కదలాడుతోంది. మోడీ విజయం రోజున ఏకంగా 25,000 పాయింట్లనూ అధిగమించింది. అయితే, చరిత్రాత్మక గరిష్టాల వద్దే సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ... మరింత దూసుకెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది. మార్చినాటికి తమ సెన్సెక్స్ లక్ష్యాన్ని 30,000 పాయింట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఈ లక్ష్యం 24,000 పాయింట్లుగా ఉంది. గత దశాబ్దపు కాలానికి పైగా సంకీర్ణ ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో జడత్వం నెలకొందని.. ఇప్పుడు మోడీ నేతృత్వంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పారిశ్రామిక రంగానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని మోడీ సర్కారు విజయాలు.. తాజా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిపైనే మోడీ దృష్టిసారించడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతోందంటున్నారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది... విదేశీ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌నాటికి సెన్సెక్స్ 28,000 పాయింట్లకు, నిఫ్టీ 8,000 పాయింట్లకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ‘దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులకు భారత్ మెరుగైన గమ్యంగా భావిస్తున్నారు. దీంతో మరిన్ని నిధులు ఇక్కడకు తరలనున్నాయి’ అని డీబీఎస్ బ్యాంక్ హెడ్(ట్రెజరీ-మార్కెట్స్) విజయన్ ఎస్ పేర్కొన్నారు. ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా తన తాజా రీసెర్చ్ నోట్లో మార్కెట్లు మరింత దూకుడును కనబరుస్తాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి సెన్సెక్స్ టార్గెట్‌ను 26,300 పాయింట్లకు పెంచింది. గతంలో ఈ టార్గెట్ 21,280 పాయింట్లుగా ఉంది. ‘మోడీ సాధించిన భారీ విజయం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టిపెడుతూ ఆయన సాగించిన ప్రచారంతో సంస్కరణలు, ప్రస్తుత పాలసీ చర్యలు మరింత ముందుకెళ్తాయన్న నమ్మకం పెరుగుతోంది. భారత్ ఈక్విటీ మార్కెట్‌పై మా బులిష్ ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే లాభాలను స్వీకరించడం తొందరపాటే’ అని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. సంస్కరణలు, సరైన ఆర్థిక మంత్రే కీలకం: డీబీఎస్ ముంబై: మోడీ ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల ఎజెండా... ఆర్థిక మంత్రి ఎంపిక, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కొనసాగించడం... ఈ అంశాలే మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపిస్తాయని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. గతేడాది జపాన్‌లో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పుడు అక్కడి మార్కెట్లు దూసుకెళ్లిన అంశానికీ... ఇప్పుడు మోడీ భారీ విజయంతో భారత్ మార్కెట్లలో దూకుడుకు ఎలాంటి పోలికలూ లేవని కూడా డీబీఎస్ పేర్కొంది. తక్షణం మార్కెట్ల సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చేది సరైన ఆర్థిక మంత్రి నియామకమేనని, రాజన్‌ను కొనసాగించడం కూడా రూపాయి విలువకు మద్దతుగా నిలుస్తుందని తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది.