Ambition
-
ఆనంద్ మహీంద్రా: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి
స్కూల్ టైంలో పెద్దయ్యాక ఏమవుతావురా? అంటే.. సంకల్లో చేతులు కట్టుకుని సంతోషంగా ‘ఫలానా అయిపోతాం సార్’ అని చెప్తుంటాం. కానీ, కష్టపడి ఆ కలను నెరవేర్చుకునేవాళ్లం కొందరమే!. పరిస్థితుల మూలంగానో, ఇతర కారణాల వల్లనో కొందరు అనుకున్నవి సాధించలేకపోవచ్చు. ఆ లిస్ట్‌లో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఒక ఫిల్మ్ మేకర్ అనే విషయం తాజాగా ఓ ఫొటో ద్వారా బయటపడింది. ‘మహీంద్రా గ్రూప్ అనే ప్రతిష్టాత్మక కంపెనీని ముందుడి నడిపిస్తున్నారు. కానీ, చదువుకునే రోజుల్లో మీ లక్ష్యం ఏంటి?.. ఫేవరెట్ ప్రొఫెషన్‌గా దానిని మిస్ అవుతున్నారా?’ అని ట్విటర్లో ఈశ్వరన్ వ్యక్తి ఎప్పుడో వారం కిందట ఆనంద్ మహీంద్రాను అడిగారు. దానికి ఇప్పుడు రిప్లై ఇచ్చారు ఆయన. Easy to answer this. I wanted to be a filmmaker & was studied film in college. My thesis was a film I made at the ‘77 Kumbh Mela. But this pic was while shooting a documentary in a remote village near Indore. Anyone old enough to guess which handheld 16mm camera I was using? https://t.co/xmLuuLrv3A pic.twitter.com/oKCddQFyGf — anand mahindra (@anandmahindra) January 20, 2022 ‘‘దానికి సమాధానం చెప్పడం సులువు. ఫిల్మ్ మేకర్ అవుదామనుకున్నా. కాలేజీలోనూ సినిమా కోర్స్ చేశా. 1977 కుంభమేళా సమయంలో ఒక సినిమా కూడా తీశా. కానీ, ఇక్కడ కనిపించే ఫొటో మాత్రం ఇండోర్ దగ్గర ఒక మారుమూల పల్లెలో డాక్యుమెంటరీని తీసేప్పుడు క్లిక్ మనిపించింది. ఇంతకీ ఈ ఫొటోలో నేను హ్యాండిల్చేసిన 16ఎంఎం కెమెరా ఏంటో ఎవరైనా చెప్పగలరా?’’ అంటూ ఓ ప్రశ్న సైతం నెటిజనులకు సంధించాడాయన. aap ko kis se dar lagta hai — Pawan Singh (@Singh12351) January 20, 2022 Was studied ?? Typo or indian English — flygps (@desigladiator) January 20, 2022 Can we watch the documentary ??? — Mourya (@SanMourya9922) January 20, 2022 కెరీర్‌కు ఎందుకు దూరం అయ్యారనే విషయం ఆయన చెప్పక్కపోయినప్పటికీ.. ఆయన బోల్తా కొట్టింది మాత్రం లేదు. ఎందుకంటే.. ఇప్పుడాయన బిలియనీర్ బిజినెస్ టైకూన్ కాబట్టి. ఇక ట్విటర్లో ఆయన పోస్ట్‌కి మాత్రం రకరకాల రియాక్షన్లు దక్కుతున్నాయి. కొందరు చమక్కులు పేలుస్తుండగా.. మరికొందరు అయ్యిందేదో మంచికే అయ్యిందని ఆనంద్ మహీంద్రాకు సర్దిచెప్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం.. అదేనండీ ఏ కంపెనీ కెమెరానో రిప్లై ఇస్తున్నారు. An AKAI. Around that time this was very popular. — AnandMadabhushi (@andmadca) January 20, 2022 Pic Kapil Dev? — TresVida Charm🇮🇳 (@TresVida18) January 20, 2022 -
ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ పరిధిలో జాతీయ విధానాలు రూపుదిద్దుకుంటున్నా.. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు పలు అంశాల్లో స్వయం ప్రతిపత్తిని గణనీయంగా పెంచుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, భూ కేటాయింపు, ఆమోదం, కంపెనీలకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులు అందేలా చూడటం, వనరుల సేకరణ వంటి అంశాల్లో రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకుంటున్నాయని తెలిపారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’వాణిజ్య సదస్సులో కేటీఆర్ శుక్రవారం కీలకోపన్యాసం చేశారు. సెనేట్ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో, ‘కోవిడ్ తదనంతర కాలంలో భారత్–ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ’అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల కోసం, ముఖ్యంగా ఎస్ఎంఈల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీఎస్ ఐపాస్‌తో త్వరితగతిన అనుమతులు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు 15 రోజుల వ్యవధిలో సులభంగా లభించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలు చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్రప్రభు త్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలె డ్జ్’(టాస్క్) ద్వారా సొంత ఖర్చుతో శిక్షణ ఇస్తోం దని తెలిపారు. పెట్టుబడులతో ముందుకువచ్చే సంస్థల ఆకాంక్షలకు అనుగుణంగా వసతులు సమకూరుస్తామన్నారు. ‘యాంబిషన్ ఇండియా 2021’ సదస్సులో తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’సందర్శన పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’ను కేటీఆర్ సందర్శించారు. తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ‘టీ హబ్’, ‘వీ హబ్’, ‘టీ వర్క్స్’వంటి ఇంక్యుబేటర్లతో అవకాశాలు, పరస్పర అవగాహనపై చర్చించారు. పారిస్ నడిబొడ్డున గతంలో రైల్వే డిపోగా ఉన్న ‘స్టేషన్ ఎఫ్’ను వేయి స్టార్టప్‌లతో కూడిన ప్రత్యేక క్యాంపస్‌గా తీర్చిదిద్దిన తీరుపై వివరాలు సేకరించారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన ‘ఎయిర్‌పోర్ట్స్ డి పారిస్’(ఏడీపీ) చైర్మన్, సీఈఓ ఆగస్టిన్ రోమనెట్తోనూ కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. కరోనా తదనంతర పరిస్థితుల్లో భారత్‌లో విమానయాన పరిశ్రమ వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్తోనూ కేటీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సనోఫి సంస్థ త్వరలో హైదరాబాద్‌లోని తమ ఫెసిలిటీ ద్వారా ‘సిక్స్ ఇన్ వన్’వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయా సమావేశాల్లో కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సీఈవోలతో భేటీ పారిస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం వరుసగా రెండోరోజు కూడా పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. మూవ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈఎఫ్) డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్తో జరిగిన భేటీలో ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సహకారాన్ని కేటీఆర్ వివరించారు. ఫ్రాన్స్‌లోని 95 శాతం వ్యాపార సంస్థలు, ఎస్ఎంఈలు ఎంఈడీఈఎఫ్ నెట్‌వర్క్‌లో అంతర్భాగంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని చెప్పారు. -
త్రీ సోల్జర్స్
ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాది చొరబడ్డాడు! ‘భారత్ మాతాకీ జై’ అంటూ.. వెంకట రమణ తెగబడ్డాడు. అతడి పోరాట పటిమకు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అతడి శ్వాసతో మువ్వన్నెల గుండె.. జెండాలా ఎగసింది! రక్తాన్ని చిందించి.. తల్లి భారతికి ప్రాణాభిషేకం చేశాడు. శక్తికి, శౌర్యానికి.. కాషాయం. శాంతికి, సత్యానికి.. తెలుపు. సస్యానికీ, సాఫల్యానికీ ఆకుపచ్చ. జెండాలోని మూడు రంగులివి. త్యాగం అనే నాలుగో రంగు అద్ది అమరుడయ్యాడు రమణ! భార్యాబిడ్డల్లో సోల్జర్ ఆత్మను నింపి వెళ్లాడు రమణ! అతడి ఆశయం కోసం ఇప్పుడీ త్రీ సోల్జర్స్... ఉగ్ర విధితో పోరాడుతున్నారు! ‘అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు’ అని అడిగిన చిన్మయితో ‘రెండు రోజుల్లో వచ్చేస్తాడమ్మా’ అని చెప్పింది తల్లి అనిత.. కానీ ఆమెకు అప్పుడు తెలియదు ఒకరోజు ముందే విగతజీవిగా తన భర్త వస్తాడని. ఏడాదిలో వచ్చేది ఒకసారే.. ఉండేది రెండు నెలలే.. ఆ రెండు నెలల పండుగకు పది నెలలుగా ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఎదురు చూపులు మరో రెండు రోజులే అనుకుంటున్న సమయంలో ఉగ్రరక్కసి కాటేసింది. జమ్మూకాశ్మీర్‌లోని కుంపరాస్ పంజగ్రామ్ ఆర్మీక్యాంప్‌పై ఏప్రిల్ 27 తెల్లవారు జామున ఆర్మీ క్యాంప్‌లో ప్రవేశించి టెర్రరిస్టులు దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్, రాజస్థాన్‌కు చెందిన సబ్ బూప్సింగ్ గుజ్జార్‌లతో పాటు విశాఖపట్నం నగర పరిధిలోని ఆసవానిపాలెం గ్రామానికి చెందిన బివి రమణ అసువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కథనం. పెద్ద కుటుంబం పద్దెనిమిదేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ ‘నాయక్’ హోదాకు చేరుకున్న రమణకు భార్య అనిత, పాప చిన్మయి, బాబు గణేష్ ఉన్నారు. తల్లిదండ్రులు రాములమ్మ, కుంచయ్య, ఇద్దరు తమ్ముళ్లు అప్పలరాజు, కోటేశ్వరావు, మరదళ్లు లీల, రాజేశ్వరి, వాళ్ల పిల్లలు... వీరందరికీ అతనే పెద్ద దిక్కు. తనతోపాటు పెద్దతమ్ముడు అప్పలరాజును కూడా ఆర్మీలోకి తీసుకువెళ్లాడు రమణ. తల్లిదండ్రులకు, వదినలకు చేదోడు వాదోడుగా చిన్న తమ్ముడు కోటేశ్వరరావు విశాఖలోనే ఉండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నంతలో అంతా సాఫీగానే గడిచిపోతోందనుకునేలోగానే ఉగ్రరక్కసి వెంకట రమణ నిండుప్రాణాలను బలిదీసుకుంది. దాంతో ఆ కుటుంబం దిక్కుతోచనిదైపోయింది. జీవితాంతం తోడు ఉంటాడనుకున్న భర్త వెంకట రమణను విధి వేరు చేయడంతో భార్య అనిత జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది.. అయినప్పటికీ, దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించాడన్న ఆత్మ సంతృప్తి, తానూ తన పిల్లలూ కలిసి దేశానికి ఇంకా ఏదయినా చేయాలన్న తపనతో పొంగుకొస్తున్న కన్నీటి ఉప్పెనను రెప్పల మాటునే దాచుకుంటూ భర్త రమణీయ స్మృతులను సాక్షితో పంచుకున్నారు. ‘‘ముందు రోజు రాత్రే ఫోన్ చేశారు. తనకు రిలీవ్ దొరకలేదని, దొరికిన వెంటనే రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. ఆయన వస్తున్నారన్న మాట మాలో ఎంతో ఆనందాన్ని నింపింది. పిల్లలు నాన్న వస్తున్నారని తెలిసి సంబరపడిపోయారు. ఆ రాత్రంతా నిద్రకూడా పోలేదు. నాకయితే తెల్లవారగానే ఏదో అలజడి, మనసు కీడు శంకిస్తోంది. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఉదయం 10.30కి మావయ్య ఫోన్ చేశారు. రమణకు ఏవో దెబ్బలు తగిలాయంట, హాస్పిటల్లో ఉన్నాడంట అని. ఆ మాటలకే నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఆయనకు ఏదైనా జరగకూడనిది జరిగితే... అన్న ఆలోచనకే నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అందరూ ఏం కాదులే’’ అని ధైర్యం చెబుతున్నా, తెలియని భయంతో గుండె బరువెక్కుతోంది. నాకు తెలిస్తే ఏమైపోతానోనని వారికి ఉదయమే తెలిసినా ఆ బాధను దిగమింగుకుని నన్ను మానసికంగా సిద్ధం చేసి అప్పుడు చెప్పారు. అంతే! ఒక్కసారిగా ప్రపంచం శూన్యంగా కనిపించింది. అయినా మనసు పొరల్లో గర్వంగా కూడా ఉంది. నా భర్త దేశం కోసం ప్రాణాలిచ్చాడు. మాతృభూమి రుణం తీర్చుకుని వీరుడిలా మరణించాడు. ఆయన పంచిన జ్ఞాపకాలతో ఆయనిచ్చిన పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి ఆయనలా గొప్పవాళ్లను చేస్తాను. పాప మూడవ తరగతి, బాబు ఒకటవ తరగతి శ్రీ శారదా విద్యానిలయంలో చదువుతున్నారు. ఇకపై వాళ్లే నా లోకం. ‘‘ఏడాదిలో రెండు నెలలే ఇంటి దగగర ఉంటాను. మిగతా అన్ని రోజులూ నువ్వే పిల్లల్ని, అమ్మానాన్నలను చూసుకోవాలి. నేనున్నా లేకున్నా నువ్వు ధైర్యంగా ఉంటాలి’’ అంటూ మా పెళ్లి చూపుల్లోనే ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను’’. దేశానికి అంకితం చేశాను కూలి చేసుకుని బతికేవాడినైనా నా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరిని దేసేవకు పంపించాను. కుటుంబానికి ఒకరన్నా ఆసరా ఉండాలని మూడవ వాడిని మాత్రం పంపలేదు. ఇప్పుడు అన్నయ్య స్థానంలో వాడు వెళతానంటున్నాడు. పంపడానికి నేను సిద్ధం. – కుంచయ్య, రమణ తండ్రి నా బాబు మాయమైపోయాడు అమ్మా, రెండ్రోజుల్లో వచ్చేస్తా నేనొచ్చాక ఆస్పత్రికి తీసుకువెళతా అన్నాడు. నా పెద్ద కొడుకు ఇలా వస్తానని అలా మాయమైపోయాడు. ఇక తిరిగి రాడనే నిజాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. డ్యూటీకి ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్లేవాడు కాదు.’’ – రాములమ్మ, రమణ తల్లి అన్నయ్యే స్ఫూర్తి అన్నయ్య ఆర్మీలోకి వెళ్లి దేశసేవ చేస్తుంటే ఆయన స్ఫూర్తితో నేనూ వెళ్లాను. ముంబైలో సేవలందిస్తున్నాను. ఆ రోజు విషయం తెలియగానే శ్రీనగర్‌కు వెళ్లిపోయాను. అప్పటికే అన్నయ్య సజీవంగా లేడు. తమ్ముడితో మాట్లాడాలని ఆఖరి క్షణంలో అన్నాడంట. – అప్పలరాజు, రమణ పెద్ద తమ్ముడు నా గుండెల్లో ఉన్నాడు! చిన్నప్పటి నుంచీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఆయనే నాకు దేవుడు. అన్నయ్య పేరును గుండెలపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను. అన్న మమ్మల్ని ఏ పనీ చేయనిచ్చేవాడు కాదు. ఏదైనా తనే చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. – కోటేశ్వరరావు, రమణ చిన్న తమ్ముడు గాయపడి ఉంటారనుకున్నాం ఆ రోజు టీవీల్లో స్క్రోలింగ్ చూశాం. కాశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు అని వస్తోంది. ఆ ఐదుగురిలో మా బావ ఉంటాడనుకున్నాం. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి విషయం తెలుసుకోమని చెప్పాను. తీరా ప్రాణాలే లేవని తెలిసింది! – లీల, రమణ పెద్ద మరదలు మా పెద్ద దిక్కు మొదట ఆర్మీ ఆఫీసు నుంచి నా భర్తకే ఫోన్ వచ్చింది. కచ్చితంగా బతికి ఉంటారనుకున్నాం. కానీ నిజం కాలేదు. రమణ బావ ఉండే రెండు నెలల్లోనే ఎవరికి ఏ పని కావాలన్నా చేసిపెట్టేవారు. మాకు ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడాయనే లేకపోయేసరికి దిక్కుతోచడం లేదు. – రాజేశ్వరి, రమణ చిన్న మరదలు – బోణం గణేష్, సాక్షి, విశాఖపట్నం -
రెండంకెల అభివృద్ధే లక్ష్యం
–రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టరు శ్రీధర్ –ఖరీఫ్–2017 ప్రణాళికపై రైతులతో సమీక్ష ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రైతు ఆదాయం ద్వారా రెండంకెల అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టరు, ఖరీఫ్ ప్రణాళిక జిల్లా పరిశీలకులు వి.శ్రీధర్ అన్నారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికపై శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో వ్యవసాయాధికారులు, రైతులతో సమీక్ష నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా 13 జిల్లాల్లో రైతులు, వ్యవసాయాధికారులతో చర్చించి వ్యవసాయ ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. పంటలు, ప్రాంతాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 60వేల హెక్టార్లలో అపరాలు పండించి రైతులకు అదనపు ఆదాయం అందేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రామాలు, మండలాలు, డివిజన్ స్థాయి సదస్సులు ఏర్పాటు చేసి రైతుల డిమాండ్లను ప్రణాళికలో చేర్చుతామన్నారు. ప్రస్తుతం సాగులో లేని భూమిని సైతం వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో చర్చించి ఆ ప్రాంతాల్లో ఏ పంటలు పండుతాయో వాటిని వేసేలా చర్యలు చేపడతామన్నారు. ముందుగా మండలాల వారీగా రైతులు, వ్యవసాయాధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్వీప్రసాద్, డిప్యూటి డైరెక్టర్లు కె.లక్ష్మణరావు, వీటీ రామారావు, బోసుబాబు, ఏరువాక కోఆర్డినేటర్ ప్రవీణ, కేవీకే శాస్త్రవేత్త సత్యవాణి, రాజమహేంద్రవరం , కోరుకొండ సహాయ సంచాలకులు కె.సూర్యరమేష్, డి.కృష్ణ, వ్యవసాయాధికారులు, ఏఈవోలు, ఎంపీఈవోలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జాతీయ జట్టులో చోటు సాధించాలి
హకీ రాష్ట్ర జట్టుకు ఎంపికైన వీకే రాయపురం విద్యార్థి సామర్లకోట : జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి హకీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 22 నుంచి 26 వరకు బోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి చాంపియ¯ŒS షిప్ పోటీలలో అండర్- 17 విభాగంలో పాల్గొంటున్నాడు. ఇటీవల అండర్-17 విభాగంలో నెల్లూరు జిల్లాలో 12, 13, 14 తేదీలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు హకీ జిల్లా కోచ్ రవిరాజ్ ‘సాక్షి’కి తెలిపారు. 2014లో పైకా టోర్నమెంటులో పాల్గొన్న వీరబాబు 2015లో జిల్లా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి పాఠశాలలో చదువుకొంటున్నాడని, తల్లి అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా పని చేస్తోందన్నారు. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉందని వీరబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థి వీరబాబును పాఠశాల హెచ్ఎం అనురాధ, గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, కోచ్ రవిరాజ్‌లు, గ్రామ నాయకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బోపాల్ బయలు దేరాడు. -
కాపు రిజర్వేషన్ సాధనే నా ఊపిరి : ముద్రగడ
తాటిపాక(రాజోలు) : కాపు రిజర్వేషన్ సాధనే నా ఊపిరి అని, ఆర్థికంగా, సామాజికంగా కాపులు అనేక మంది వెనుకబడి ఉన్నారని కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అన్నారు. బుధవారం ఆయన తాటిపాక విచ్చేసి మాజీ ఏఎంసీ చైర్మన్ జక్కంపూడి తాతాజీ స్వగృహం వద్ద కాపు ఉద్యమ నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కాపు కుటుంబాలు ఇచ్చిన మద్దతు ఎంతో మనోబలాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యమం పేరుతో అనేక మందిపై కేసులు పెట్టారని కాపు నాయకులు పలువురు ముద్రగడకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా కాపు రిజర్వేన్ పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యమానికి సహకరించిన కాపు నాయకులకు, కార్యకర్తలకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ, నాయకులు అడబాల తాతకాపు, తోరం భాస్కరరావు, జక్కంపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. -
మీ చెప్పుల హీల్ సైజ్ మీరేంటో చెప్తుంది!
న్యూయార్క్: మీ గర్ల్ ఫ్రెండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆమె కాళ్లకు వాడే చెప్పులను గమనిస్తే సరిపోతుంట. సమాజంలో వారిని వారు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో.. వాళ్లు వాడే చెప్పుల హీల్ సైజ్ ఆధారంగా అంచనా వేయొచ్చని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. భిన్న నేపథ్యాలున్న మహిళల 16,236 ఆన్లైన్ కొనుగోళ్లను పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్థారించారు. హీల్ సైజ్ ఎక్కువగా ఉండేలా మహిళలు జాగ్రత్త పడుతున్నారంటే వారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతున్నట్లేనని పరిశోధకులు వెల్లడించారు. మధ్యతరగతి, పేద మహిళలు సైతం సంపన్న మహిళలలా కనిపించాలని, తమ వాస్తవిక నేపథ్యాన్ని వేరుగా చూపించాలనే కాంక్షను వెలిబుచ్చుతున్నారని పరిశోధకులు తెలిపారు. సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య పెరుగుతున్న అసమానతలు ఈ ఫ్యాషన్ అనుకరణకు దారితీస్తున్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కర్ట్ గ్రే తెలిపారు. ఆన్లైన్ ఫ్యాషన్ మార్కెట్ సైతం హై స్టేటస్ ఉన్నట్లు కన్పించే వస్తువులను తక్కువ ధరకు అందించి వినయోగదారులను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. పురుషుల్లో సైతం వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల విషయంలో ఈ అనుకరణ గమనించొచ్చని చెబుతున్నారు. -
భువిపై స్వర్గం... అరవిందుని ఆశయం
‘‘మానవులమైన మనకు, భగవంతునికి ఒక అనుబంధం ఉంది. దైవం- మనిషి పరస్పర రుణగ్రస్థులు. ఆయన స్వభావాన్ని మనం, మన స్వభావాన్ని ఆయనా స్వీకరించి, ధరించాలి. ఈశ్వర సంతానమైనా ఈశ్వరునిలా మనగలగాలి. మానవ స్వభావం దివ్యత్వంగా పరిణమించాలి. పరస్పర విరుద్ధంగా తోచే మానవ జీవితానికి ఈశ్వరుడే మూలసూత్రం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం భగవంతునికి విరుద్ధమైనది కాదు. ఈ భూమిపై భగవంతుడు శాశ్వతంగా భాసిస్తుండాలి. అందుకే నా తపస్సు’’ అని ప్రవచించారు అరవిందులు. భగవంతుని ప్రసక్తి లేని ప్రపంచం, జీవితం అసంపూర్ణం. మానవజాతి భవిష్యత్తు ఆధ్యాత్మిక ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ధర్మం మామూలుగా భావించే విశ్వమతం కంటే భిన్నమైనది. బుద్ధిజనిత సిద్ధాంతాల మీద, బాహ్యక్రతువుల మీద ఆధారపడే మతం కాదు. మానసికమైన సిద్ధాంతం, దానికి సచేతన స్వరూపం మనిషికి అవసరం. గుప్తమైన దివ్యత్వం ఉన్నదనే విశ్వాసం క్రమవికాసం పొందడమే మానవ ధర్మ స్వభావం. ఆ దివ్యత్వ ప్రకటనకు మానవజాతే ఉత్తమ సాధనం. మానవునిలోనే ఆ దివ్యత్వపు అభివ్యక్తి క్రమవికాసం పొందగలదు. ఈ అభిజ్ఞకు అనుగుణంగా జీవితం సాగించి, ఈ భూమి మీద దివ్యత్వపు సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించాలి. ఈ భావన మనలో రేకులు విప్పుకుంటే మానవులందరూ సమానులనే దృష్టి జీవితాన్ని నడిపించే ముఖ్యసూత్రం అవుతుంది. సహకార సూత్రం కంటే గాఢమైన ఈ భావన ద్వారా సమష్టి జీవనం, సోదరభావం, సమానత్వం మనకు అలవడతాయి. సాటి మానవుల శ్రేయస్సు మూలంగానే వ్యక్తిజీవితం స్వతంత్రంగా సంపూర్ణంగా కొనసాగినప్పుడే తన పరిపూర్ణత్వం, శాశ్వత సుఖం వాటి మీద ఆధారపడి వర్థిల్లగలవని జాతి గుర్తించాలి. ఈ ధర్మాన్ని అనుసరించి క్రమశిక్షణ, ముక్తిమార్గాలను ప్రతివ్యక్తీ సాధించుకోవాలి. ఆ విధమైన లక్షణాలు జాతి అంతటిలోనూ వృద్ధి పొందాలి. ఇతర భావాల మాదిరిగా ఇది కూడా ఒక ఆశయంగా మిగిలి పోకూడదు. ఇది మన అంతర్గత ధర్మం అయితే మనం చేసే ప్రయత్నాల న్నింటికీ అది గమ్యం కావాలి. ప్రాతిపదికమైన, అంతర్గతమైన, సంపూర్ణమైన యథార్థమైన సమైక్యతను సాధించడానికి ఉపకరణం కావాలి. మానవ జీవన సమైక్యతకు అది పదిలమైన పునాది కావాలి. మానసిక సమైక్యతను సాధించగల ఆధ్యాత్మిక సమైక్యత మనకు అవసరం. ఇది బుద్ధిగతమైన బాహ్యమైన ఏకీభావంతో ముడిపడి ఉండదు. యాంత్రిక విధానాల ద్వారా తెచ్చుకునే ఏకత్వం కాదు. అంతరంగ జీవితంలో స్వేచ్ఛతో కూడిన మార్పులను... వాటిని ప్రకటించుకునే పద్ధతులతో స్వాతంత్య్రాన్ని సమకూర్చగల భద్రమైన సమైక్యతను సాధించుకోవాలి. ఈ సమైక్యతే పునాదిగా ఉత్తమ జీవన విధానం విలసిల్లాలి. ఈ సత్యాన్ని మానవులంతా తొందరగా గ్రహించగలిగితే సమైక్యత సమస్యను పరిష్కరించగలుగుతాం. అంతర్గత సత్యంతో మొదలుపెట్టి బాహ్య స్వరూపాలకు విస్తరించే గంభీరమైన, యథార్థమైన సమైక్యత సాధించగలుగుతాం. ఈ లోపుగా సమైక్యతను సాధించే యాంత్రిక పద్ధతులు కొనసాగించవలసిందే. కాని, మానవ భవితవ్యం ఆశాజనకం కావాలంటే ఈ తత్వాన్ని అవగాహన చేసుకునే వ్యక్తుల సంఖ్య పెరగాలి. యాంత్రికమైన పరిష్కారాలు తాత్కాలికమైనవనీ, ఆశాభంగం కలిగిస్తాయనీ గ్రహించిన ఆధ్యాత్మికవేత్తల సంఖ్య అధికం కావాలి. అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఆవిర్భవించి, అత్యుత్తమ సంపూర్ణ సుఖం దిక్కుగా మానవజాతిని నడిపించాలి. అప్పుడే ప్రకృతి సమున్నత శృంగాల పైన ఆత్మభూమిలో అతీత మానవుడు జీవిత సామ్రాజ్యానికి సార్వభౌముడై పరిపాలించి, భువిని- దివికి సమానంగా మలచగలడు... అన్నారు అరవిందులు. ఈ ప్రపంచంలోని సమస్త వస్తుజాలం ఈశ్వరుని వల్లే మనకు లభిస్తోంది. తిరిగి అంతా ఈశ్వరునికే నివేదింపబడాలన్నది ఆత్మశక్తి సంపన్నులైన అరవిందుల అభిమతం. దేవతలాంటి పూర్ణమానవుడు ఆయన స్వప్నం. దివ్యజీవన ఆవిర్భావం ఆయన యోగ పరమావధి. భువిపై స్వర్గం అరవిందుని ఆశయం. - చోడిశెట్టి శ్రీనివాసరావు