Amit Bhandari
-
ఆ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారీపై దాడికి పాల్పడిన అండర్-23 క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు ఆ క్రికెటర్‌ను జీవితకాలం ఏ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. ‘ అమిత్ భండారీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువ క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధిస్తున్నాం. ఇక్కడ అనూజ్ దేడాపై న్యాయపరమైన చర్యలను పక్కకు పెడితే, అతను ఇక నుంచి ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్నాం’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం అనూజ్ బృందం గుంపుతో కలిసి దాడికి దిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టడంతో తీవ్ర అలజడి రేగింది. -
‘ఏ క్రికెట్ ఆడకుండా వాడిపై నిషేధం విధించండి’
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై జరిగిన దాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాడి చేసిన ఆ యువ క్రికెటర్‌ను ఏ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఇక ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగిన విషయం తెలిసిందే. రౌడీల్లా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అమిత్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాడే అయిన గంభీర్.. ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ‘దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు ఆటగాడిపై ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలి’ అని గంభీర్ డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై మాజీ డాషింగ్ ఓపెనర్, ఢిల్లీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం స్పందించాడు. ‘జట్టులో ఎంపికచేయలేదని సెలక్టర్‌పై దాడి చేయడం అమానుషం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.’ అని ట్వీట్ చేశారు. దాడికి గురైన 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. ఇక భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఢిల్లీ చీఫ్ సెలక్టర్ అమిత్ భండారిపై దాడి
న్యూఢిల్లీ: ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఆటగాళ్ల ఎంపికలో నిబంధనల ఉల్లంఘనలతో అప్రతిష్ఠ పాలైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మరో అవాంఛనీయ ఘటన. ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు ఏకంగా... భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అనూజ్ బృందం దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టారు. తల, చెవి భాగంలో గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు. పరిస్థితిని గ్రహించిన క్రికెటర్లు అడ్డుకునేందుకు ముందుకొచ్చారు. ఎవరూ కలుగజేసుకోవద్దంటూ నిందితులు తుపాకీ చూపించి బెదిరించారు. మరోవైపు అనూజ్ విషయంలో భండారి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవంబరులో 79 మందితో డీడీసీఏ విడుదల చేసిన అండర్– 23 ప్రాథమిక జాబితాలో అతడి పేరున్నా, ప్రదర్శన బాగోలేకపోవడంతో పక్కన పెట్టారు. అనూజ్ 1995 నవంబరు 22న జన్మించడంతో ఎంపికకు అర్హుడు కాలేకపోయాడు. 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. దాడిని మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండించారు. భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఐరన్ రాడ్లతో భారత మాజీ క్రికెటర్‌పై దాడి
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సెలక్షన్ కమిటీ చీఫ్ అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. డీడీసీఏ అండర్-23 సెలక్షన్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యూఢిల్లీలోని స్టీఫెన్స్ గ్రౌండ్ వద్ద ఉన్న కశ్మేరా గేట్ ఏరియాలో దాడి జరిగినట్లు సహ సెలక్టర్ సుఖ్విందర్ సింగ్ తెలిపారు. అతనిపై ఐరన్ రాడ్లు, హాకీ స్టిక్‌లతో కొన్ని అల్లరి మూకలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భండారీ తలకు, చెవికి తీవ్ర గాయాలైన భండారీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ అండర్-23 టీమ్ మేనేజర్ శంకర్ సైనీ కథనం ప్రకారం.. ‘టీమ్ ట్రయల్స్‌ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా సుమారు పదిహేను మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. దీంతో.. అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే భండారీని తీవ్రంగా గాయపడ్డాడు’ అని సైనీ తెలిపారు. ఈ దాడి ఎవరు చేసారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.