రైఫిల్ షూటింగ్లో జాతీయస్థాయి పోటీలకు నిమ్స్ విద్యార్థి
ఇబ్రహీంపట్నం: నిమ్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఎన్.తేజవర్థననాయుడు రైఫిల్ అండ్ ఫిస్టల్ షూటింగ్లో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన అంతర్ వైద్య కళాశాలల రైఫిల్ షూటింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ యూనివర్సిటీలో జరిగే అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపికయ్యాడు. కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ డాక్టర్ మహ్మద్ సాఖీబ్ రసూల్‌ఖాన్, డీన్ డాక్టర్ సుందరరావు, క్రీడాధికారి ఎం.ఎస్.ఖాన్ తేజవర్థన్ నాయుడును అభినందించారు.