'పాత్రికేయుల సంక్షేమ నిధి రూ. కోటికి పెంచుతాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పి. రఘునాథారెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయానికి రూ. లక్ష విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ... పాత్రికేయుల సంక్షేమ నిధిని రూ. కోటికి పెంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టే పథకాలు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తామని రఘునాథరెడ్డి వెల్లడించారు.