andhra pradesh special package
-
ప్రత్యేక హోదా అనేది లేదు.. ప్యాకేజీతోనే సహకరిస్తాం: : కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్టీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మిత్రపక్షాలకు కేంద్రంలోని బీజేపీ మొండి చేయి చూపిస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నరసాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారాయన. అలాగే.. బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపైనా స్పందిస్తూ.. జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని ఎదురు ప్రశ్నించారాయన. ‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది తీర్మానాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్‌కు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారాయన. అలాగే.. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వస్తారని, ఎంపీలతో సమావేశం అవుతారని, రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తామని చెప్పారాయన.ఇక.. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా స్పందిస్తూ.. నిర్మాణ వైఫల్యం వల్లే డయాఫ్రం వాల్, కాపర్ డ్యాంకు పగుళ్లు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పొలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పర్వంపైనా స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు కొలిక్కి రావడానికి రెండు, మూడు నెలల టైం పట్టొచ్చని, గత పరిస్థితుల వల్లే ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారాయన. -
ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబే కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన రూ. 7,798 కోట్లు తీసుకొని కేంద్రానికీ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ రాజకీయ ఉనికి కోసం పార్లమెంట్‌లోనూ, బయటా హోదా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా కొందరు రాజకీయ కుట్రలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉందన్నారు. జనసేనతో కలసి మిత్రపక్షంగా ముందుకు సాగుతామన్నారు. -
మాటలేనా? మద్దతిస్తుందా?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు జాతీయ అంశాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయింది. కానీ ఆ దిశగా చొరవ చూపి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడే కేంద్రం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు! ఏపీకి ప్రత్యేక హోదా అంశం పట్ల గత సీఎం చంద్రబాబు నాలుగు రకాలుగా స్పందించి నవ్వుల పాలవడం వల్ల అది నాన్ సీరియస్ వ్యవహారానికి తగ్గిపోయింది. అప్పుల విషయంలోగానీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని సమస్యల పట్లగానీ జగన్ వైఖరి స్పష్టంగా ఉంది. మరి ఆ దిశగా కేంద్రం కూడా అంతే స్పష్టంగా ఉంటుందా, అన్ని రకాలుగా ఆదుకుంటుందా అన్నది చూడాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు కేవలం ఆ రాష్ట్రాలకే పరిమితం కాదనీ, జాతీయ అంశాలు అనీ అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను ఆయన అంగీకరించారు. తద్వారా విభజన సమస్యలకు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్న భరోసా కూడా ఇచ్చినట్లు అయింది. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా ఈ హామీ ఇచ్చారు. నిజానికి ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సింది. కాలం గడిచేకొద్దీ సమస్యల పరిష్కారం కష్టసాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పరిస్థితి అదే రకంగా ఉంది. ఒక పక్క విభజన సమస్యలు, మరో వైపు నదీ జలాల వివాదాలు పెరుగుతున్నాయే గానీ తేలడం లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న సంస్థల ఆస్తులపై ఇంత వరకు ఏమీ తేలలేదు. దాంతో తెలంగాణకు పెద్ద నష్టం లేదు. కానీ ఏపీకి వాటిని అనుభవించే అవకాశం లేదు. విక్రయించే అవకాశం లేదు. ఆయా సంస్థలలో ఉన్న నిధుల పంపిణీపై సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినా, అది అమలు కావడం లేదు. ఈలోగా తెలుగు అకా డమీ వంటి సంస్థలలో నిధులను కాజేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం విభజన చట్టం కల్పించింది. దాని ప్రకారం 2024 వరకు అలాగే ఉండవచ్చు. ఇందుకు తగ్గట్లుగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు భారీగానే ఖర్చు చేసి ఆయా భవనాలను ఆధునీకరిం చారు. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనా లలో కేవలం తన చాంబర్‌కే కోట్ల రూపాయలను చంద్రబాబు వ్యయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతలో ఏడాదిలోపే పెద్ద సంచలన ఘటన జరగడం, దాంతో చంద్రబాబు పెట్టేబేడా సర్దుకుని హడావుడిగా విజయవాడ వెళ్లిపోవడం జరిగింది. తెలం గాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ప్రయత్నించా రన్న ఆరోపణ రావడం, ఆ క్రమంలో అప్పట్లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు యాభై లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలిసిన సంగతే. ఈ ఒక్క ఘటన ఏపీ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేసిందంటే ఆశ్చర్యం లేదు. ఉమ్మడి రాజధానిపై హక్కు వదలుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడం తదితర ఘట్టాలు జరిగాయి. చంద్రబాబు అయితే పైస్థాయిలో పైరవీ చేసుకుని కేసీఆర్‌తో రాజీపడి కేసు నుంచి బయటపడ్డారు గానీ, ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కన బెట్టి ప్యాకేజీని తెరపైకి తెస్తే అంగీకరించారు. పోల వరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టవలసి ఉండగా, తమకు కాంట్రాక్టు నిర్ణయాధికారంతో తామే నిర్మిస్తామని తీసుకున్నారు. విజయవాడలో వివిధ ఆఫీసుల ఏర్పాటుకు అద్దె భవనాలను తీసుకున్నారు. అందుకోసం కోట్లు వ్యయం చేయవలసి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాపై స్పష్టత లేకుండా ఆమోదిం చారు. 2013–14 నాటి వ్యయ అంచనాకు ఒప్పు కోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ధరల నిర్ణయంపైనా, భూసేకరణకు పరి హారం చెల్లించడంపైనా ఒక స్పష్టమైన అవగా హనను కేంద్రంతో కుదుర్చుకుని ఉంటే ఇప్పుడు వివాదం అయ్యేది కాదు. ఈ అంశాలన్నింటి గురించి ఈ జోనల్ సమా వేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ హుందాగా ప్రసంగిం చారు. అదే సమయంలో ఎక్కడా రాజీపడ కుండా ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పగలిగారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఏమి చెబు తున్నారో అదే పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా కావాలనీ, ఇంకోసారి అక్కర్లేదనీ, అదేమీ సంజీవని కాదనీ, మళ్లీ ప్రత్యేక హోదా కావాలనీ కేంద్రం వద్ద నవ్వుల పాలయ్యారు. ఆ అంశానికి సీరియస్‌నెస్ లేకుండా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ కీలక భేటీ లలో ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తా వించకుండా ఉండటం లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రెండు, మూడు భేటీలలోనూ ఈ అంశం తేల్చాలని గట్టిగా కోరారు. మరో ముఖ్యమైన విషయం. రుణాల పరిమితి, కేంద్రం విధించిన కోత గురించి జగన్ కొన్ని ఆస క్తికర విషయాలు వెల్లడించారు. తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం రుణాలు ఇష్టం వచ్చినట్లు చేస్తోందనీ, ఫలితంగా కేంద్రం రుణాలలో కోత పెడుతూ షాక్ ఇచ్చిందనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గత ప్రభుత్వం 2015–16 నుంచి మితి మీరి, ఎఫ్ఆర్బీఎంను అతిక్రమించి అప్పులు చేసిందని జగన్ స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఆ విషయాలను పట్టించు కోకుండా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆనాటి తప్పులకు ఇప్పుడు కోత పెడుతున్నారని వెల్లడిం చారు. 42,447 కోట్ల రుపాయల రుణ పరిమితి ఉంటే, 19,923 కోట్ల రుణా లను మినహాయి స్తున్నట్లు కేంద్రం తెలిపిందనీ, వచ్చే మూడేళ్లు రుణ పరిమితిలో కోత పెడుతున్నామనీ పేర్కొ న్నారని వివరించారు. ఇంత అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆధారాలు లేకుండా మాట్లాడజాలరు. చంద్రబాబు టైమ్‌లోని అప్పుల గురించి అదరహో అని ప్రచారం చేసి, ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి నెగెటివ్‌గా ప్రచారం సాగించిన టీడీపీ మీడియా దీన్ని పట్టించుకోకుండా వదిలేసింది. వెనుకబడిన జిల్లాల ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని జగన్ నొక్కి చెప్పారు. వాస్తవానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సుమారు పాతికవేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇవ్వవలసి ఉండగా, వెయ్యి కోట్ల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. విభజన చట్టం ప్రకారం ఇంకా రావల్సిన సంస్థలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను జగన్ ప్రస్తావించారు. గతంలో ఏపీ సరఫరా చేసిన విద్యుత్తుకు గాను చెల్లించవలసిన బకాయిల విష యంలో తెలంగాణ ప్రభుత్వం మొండికేసిన వైనాన్ని ప్రస్తావించారు. సుమారు ఆరువేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఏపీ వాదిస్తుంటే, మూడు వేల కోట్ల పైచిలుకు మాత్రమేనని తెలంగాణ అంటున్నది. ఈ సమస్యలపై ఒక కమిటీని వేస్తామని అమిత్ షా చెప్పడం ముదావహం. తిరుపతిలో ఈ సమావేశం జరిగింది కనుక ఈ విషయాలకు ప్రాధాన్యత వచ్చింది. అమిత్ షా కూడా కొంత ఎక్కువ దృష్టి పెట్ట గలిగారు. కానీ ఆయన ఢిల్లీ వెళ్లిపోయాక, దీనికి ఫాలో అప్ లేకపోతే ఏపీకి ఒనగూరే ప్రయోజనం ఉండదు. విభజన సమ యంలో తెలంగాణ తలసరి ఆదాయం 15 వేల రూపాయలకు పైగా ఉంటే, ఏపీ తలసరి ఆదాయం 9 వేల లోపే ఉంది. హైదరా బాద్ మాదిరి ప్రధాన నగరం ఏపీలో లేదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఏపీకి కేంద్రం సాయం చేయాలని జగన్ కోరడం బాగానే ఉంది. వీటితో పాటు విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక కారి డార్ తదితర అంశాలకు కూడా కేంద్రం ప్రాధాన్యం ఇస్తే ఏపీకి ప్రయో జనం ఉంటుంది. అమిత్ షా చెప్పినట్లు ఇవి జాతీయ అంశాలే. విభజన సమయంలో పార్లమెంటులో ప్రకంపనలు వచ్చాయి. తెలం గాణ ఎంపీలు విభజన కోరుతూ, ఏపీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఆందో ళనలకు దిగడంతో పార్లమెంటు స్తంభించింది. అయినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టడం, దానికి బీజేపీ సహకరించడం, గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం పొందడం జరిగాయి. కేంద్రానికి చెందిన కొన్ని విద్యాసంస్థలను ఇచ్చినా, వాటికి అవసరమైన నిధు లను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారన్న భావన ఉంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తగు రీతిలో ఆదు కుంటే ఎపీ నిలదొక్కుకుంటుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
అసంబద్ధ వ్యాఖ్యల బాబుదే ‘యూటర్న్’
తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన పిదప ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయస్థాయి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో కొన్ని అసందర్భ విషయాల గురించి అతిగా మాట్లాడటం తెలంగాణవాదులమైన మా బోటి వాళ్లను తీవ్ర మనస్తాపం కలి గించింది. బాబు వినిపించిన మాటలనే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు తిరిగి వినిపించారు. అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుంచే ఇలాంటి అసందర్భ అనుచిత వాక్యాలు రావటం సహజం. అసలు మొత్తంగా వీళ్లు లేవనెత్తుతున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో పరిశీ లిద్దాం. 1.హైదరాబాద్ నా మానసిక పుత్రిక దానికి నేనే రూపమిచ్చా. 2. మోదీ, కేసీఆర్‌ల కన్నముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇద్దరు ప్రధాన మంత్రులను చేయడంలో నాదే కీలకపాత్ర. 3.మాది మెజారిటీ మైనార్టీలకు చెందిన విషయం కాదు మెజార్టీ మొరాలిటికి సంబంధించిన విషయం 4.యూటర్న్ తీసుకున్నది ఎవరు? ముందుగా హైదరాబాద్ నా మానసిక పుత్రిక, దానికి నేను రూపమిచ్చా అనే దాన్ని పరిశీలిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి పుట్టక ముందే ఇక్కడ అన్ని వసతులు, కీలక సంస్థలు నిజాంల కాలంలోనే నెలకొల్పారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలో వెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? ‘‘మీ కంటే నేనే సీనియర్‌ను. మోదీ, కేసీఆర్లకన్న ముందే నేను సీఎంని అయ్యా’! అనే మాటల్లో వ్యక్తికి ఉండే అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపిం చటం లేదు. మీరు మోదీ, కేసీఆర్‌ల కన్న ముందే సీఎం అయిన్రు. కాని ఎట్ల అయిన్రు అన్నది ప్రశ్న. కుట్రజేసి మీ మామను గద్దెదించి గద్దెనెక్కిన వైనం ఎవరికి తెలువదని? రాజకీయాల్లో మీకున్న అనుభవమల్లా ఇదేనా? పైగా మీరు సీఎం అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అని మర్చిపోవద్దు. నైతిక విలువలను ఇతరులకు చెప్పేవాళ్లు కొంతలో కొంతైన తమ నిత్యజీవితంలో ఆచరించడం మంచిది. రాజకీయాలలో ఏ నైతిక నియమాలను పాటించి మీరు సీఎం అయ్యిన్రు. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మీ పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం నైతికమా? మొదట స్పెషల్ హోదాను కాదని స్పెషల్ కేటగిరీకి ఒప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పెషల్ హోదా కోరుతున్నది ఏ నైతిక విలువల ప్రకారం? తాను మొరాలిటి పక్షాన మెజారిటీపై పోరాడుతున్నానని తనది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తనతో అందరూ కలిసిరావాలని కోరడం జరిగింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వారిది ధర్మపోరాటం కాదట. కాని తన ఒక్కనిదే ధర్మపోరాటం అనడం ఆశ్చర్యకరం. తనతో కలసి వచ్చే వాళ్లు నీతిమంతులు, ధర్మకర్తలట. తనతో కలసిరాని వాళ్ళు అవినీతి పరులు, అధర్మకర్తలట. ఇక చివరగా వీరంటున్న యూటర్న్ గురించి చర్చిద్దాం. రాజకీయపార్టీలు తమ అవసరాన్ని ఇతర పార్టీలతో కలిసి జతకడుతూ ఉంటాయి. కానీ బాబులాగా యూటర్న్ మాత్రం తీసుకోవు. యూటర్న్ రాజకీయాలకు శ్రీకారం పడ్డది చంద్రబాబు ద్వారానే. గత ఎన్నికలలో ఎన్డీయేతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసి గెలిచి కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి తీరా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి కాంగ్రెస్ మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం యూటర్న్ రాజ కీయం కాదా? నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన కారకుడు బాబు, అతని యూటర్న్ అనైతిక రాజకీయాలు. తన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పులన్నింటిని ఇతరులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే అతను కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చింది. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ ప్రజలను పోరాటానికి రమ్మని పిలుపునివ్వటం బాధ్యతారాహిత్యమే. గత నాలుగేళ్లుగా ఏపీ సమస్యలపైనా దాని అభివృద్ధి పట్ల దృష్టి సారించక ఈ రోజు మేల్కొని పోరాటానికి పిలుపునివ్వటం, ప్రజ లను తనతో కలిసి రావాల్సిందిగా కోరటం విచారకరం. బాబు ఇప్పటికైనా అనవసరమైన రాద్ధాంతాల జోలికి పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం. ప్రొ‘‘ జి.లక్ష్మణ్, వ్యాసకర్త అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 98491 36104 -
‘ఆ భయంతోనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదా?’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి దగా చేయబడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామిని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని వాగ్దానాలను అమలు చేయకుండా ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. ఇప్పటికైనా ప్రజలకు చంద్రబాబు నిజాలు వెల్లడించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... జైట్లీ, చంద్రబాబు ప్రకటనతో ఏపీ ప్రజలు మరోసారి దగా పడ్డారు ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేటస్ భారతదేశంలో ఏంటి? ఏపీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ విభజన చట్టం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారు కంటితుడుపుగా చేసిన విభజన చట్టంలోని వాటిని కూడా అమలు చేయడం లేదు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన మరింత మెరుగుపరిచి అమలు చేస్తామని బీజేపీ నేతలు అన్నారు ఏదో ప్యాకేజీ ఇస్తారట... ఎలా నమ్మమంటారు? కన్సలిడేట్ ఫంఢ్ నుంచి 10 వేల కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వాలని రాజ్యసభలో వెంకయ్య పట్టుబట్టారు అప్పటి ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామని వెంకయ్య అన్నారు 2014-15 లోటును కేంద్రబడ్జెట్ లో పెట్టి భర్తీ చేస్తామని హామీయిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇవాల్టీకి లోటును భర్తీ చేయలేదు ప్యాకేజీ ఇస్తారట.. ఇది కంటితుడుపు మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత రాష్ట్రానికి ఎలా ఇస్తారు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలంటే చట్టసవరణ చేసి తీరాలి చంద్రబాబును సంతృప్తి పరిచేందుకే కేంద్రం ప్రకటనలు చేస్తోంది ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదని అంటున్నారు.. ఇంతకన్నా బూతు మాట మరోటి ఉండదు ఏపీకి ప్రత్యేక హోదాపై కేవీపీ పెట్టిన బిల్లును రాజ్యసభలో ఎవరూ వ్యతిరేకించలేదు కేంద్రం ఎందుకు మోసం చేస్తోంది ప్రత్యేక హోదాపై జైట్లీ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు లోటు భర్తీ చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీకి గతిలేదు, ప్యాకేజీ ఇస్తారా? ప్రత్యేక హోదా సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది హైదరాబాద్ లో ఏపీకి సమాన అవకాశాలుంటాయని విభజన చట్టంలో ఉంది హైదరాబాద్ గురించి మాట్లాడితే కేసీఆర్ ఏం చేస్తాడోనని చంద్రబాబుకు భయం ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు ఇద్దరి మధ్య అండర్ స్టాండింగా లేక బ్లాక్ మెయిలా? గుజరాత్ లో ఉన్న పరిశ్రమలు ఏపీకి వస్తాయన్న భయంతో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదేమో చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకపోయినా చంద్రబాబు అడగరా చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి -
‘ఆ భయంతోనే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదా?’
-
హామీలు, ప్రత్యేక హోదా.. రెండూ హక్కే
సాక్షి, హైదరాబాద్: కనీసం రాజధాని కూడా లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నప్పుడు రాష్ట్రప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమయినపుడు అన్యాయాన్ని పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పలు హామీలు చేర్చింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు సరిపోవన్న ఆందోళనలు పెరగడంతో ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని పార్లమెంట్లో సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హామీ ఇచ్చిన విషయం విదితమే. అంటే చట్టంలో పేర్కొన్న హా మీలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. వాటిని పొందడం రాష్ట్ర ప్రజల చట్టబద్దమైన హక్కు. ప్రత్యేక హోదా కూడా అంతే. హోదాను పొందడం ఆంధ్రప్రదేశ్ హక్కు. రాష్ట్ర బంగరు భవిష్యత్‌కు ఈ రెండూ అత్యావశ్యకం. ఈ రెండిం టిని సాధిస్తే రాష్ట్ర ప్రజలకు సంజీవినిలా ఉపయోగపడతాయి. అలా కాకుండా.. ఏ ఒక్కటి విస్మరించినా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. హామీలకు ప్యాకేజీ ముసుగు పార్లమెంట్ సాక్షిగా చట్టం ద్వారా సంక్రమించిన హామీలు అమలు చేస్తేనే.. రూ. 2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, మెట్రోరైల్ ప్రాజెక్టులు మొదలు భారీ నౌకాశ్రయాలు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విమానాశ్రయాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాలు, రాజధాని అభివృద్ధి, ఆర్థిక లోటు భర్తీ.. లాంటి హామీలను విభజన చట్టంలో పొందుపరిచారు. తప్పకుండా అమలు చేయాల్సిన హామీలను గాలికి విడిచి, ఆ హామీల్లో కొంత భాగానికి ప్యాకేజీ ముసుకు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ, శ్వాస హోదానే మరోవైపు.. రాష్ట్ర భవిష్యత్‌కు అపర సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కకు పెట్టే ప్రయత్నం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేయడం పట్ల రాష్ట్ర ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండూ హక్కులే అయినప్పుడు.. ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి, ఆ పని చేయకపోగా, పోరాడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌కు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ముఖ్యమంత్రి అంటున్నారు. ప్యాకేజీ ద్వారానే ఎక్కువ నిధులు వస్తున్నప్పుడు.. హోదా ఎందుకని ప్రశ్నిస్తోన్న ముఖ్యమంత్రి.. చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తే అంతకంటే ఎక్కువే నిధులు వస్తాయనే విషయాన్ని తెలివిగా పక్కకు తప్పిస్తున్నారు. ఈ ప్యాకేజీ ఏదో కొత్తగా సాధిస్తున్నట్లు ప్రజలను మభ్య పెడుతూ.. హామీలు, హోదాను అటకెక్కించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఓటుకు కోట్లు’ కేసులో బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి హోదా అంశాన్ని ఫణంగా పెట్టారు. ఇదే చంద్రబాబు.. గత ఏడాది తిరుపతి ఎన్నికల ప్రచార సభలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదని, కనీసం 15 సంవత్సరాలు ఉండాలని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు నిధులు తెచ్చి, ప్రత్యేక హోదా సాధించిన తర్వాతే.. ఆయన చెబుతున్న ప్యాకేజీ గురించి మాట్లాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోదా కోసం ప్రయత్నించకపోవడం, చట్టబద్దమైన హామీలకు ప్యాకేజీ ముసుగేయడం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు. హామీల అమలు చట్టబద్ద హక్కు విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు రూ. 2 లక్షల కోట్లు అవసరమని అంచనా. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. విభజన చట్టంలోని హామీల అమలు ఆంధ్రప్రదేశ్ ప్రజల చట్టబద్దమైన హక్కు. ఈమేరకు కేంద్రం నిధులు ఇచ్చి తీరాల్సిందే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ హామీలు అమలు కావాలనే ఉద్దేశంతోనే వాటికి చట్టబద్దత కల్పించారు. అప్పటి అధికార, విపక్షాలతో చంద్రబాబు కుమ్మక్కై అన్యాయంగా రాష్ట్రాన్ని విభజనకు కారకులయ్యారు. ప్రజల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. హామీలతో పాటు ప్రత్యేక హోదా కూడా కల్పించాలని పార్లమెంట్ సాక్షిగా హామీ లభించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలు ఫణంగా.. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు ప్రయత్నించకుండా.. ప్రత్యేక హోదా సాధనకు పోరాడకుండా.. ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వ పెద్దలు తెర మీదకు తీసుకొచ్చారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నుంచి కొన్ని నిధులు తెచ్చుకొని.. విభజన చట్టంలోని హామీలను గాలికి వదిలి.. భారీ ప్రచారంతో ప్రజల మెదళ్ల నుంచి హోదా ఆకాంక్షలను తొలగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి భారీగా నిధులు రానున్నాయని, ప్రత్యేక హోదాను మించి లబ్ది జరగనుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులయిన హామీల అమలు, హోదా సాధన.. రెండింటినీ విస్మరించి ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. హోదా వస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ప్రవహిస్తాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా చేయూతనిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి, శాశ్వత ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. 90 శాతం గ్రాంట్లు.. 10 శాతం లోన్లు సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గాంట్లు 30 శాతం దాటవు. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరిం చాలి. కానీ పత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లుగా కేంద్ర సాయం అందుతుంది. గ్రాంట్లుగా ఇచ్చే సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 10% రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. చాలా పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులకు రాష్ట్రం భరించాల్సిన 10 శాతాన్ని కూడా కేంద్రం రుణంగా సమకూరుస్తుంది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుంది. 90 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎకై్సజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు.