జై తో ఆండ్రియా రొమాన్స్
యువ నటుడు జై సంచలన నటి ఆండ్రియల రొమాన్స్‌ను త్వరలో తెరపై చూడవచ్చు. ఇంతకుముందు యువ కథానాయికలతో జతకట్టడానికి ఆసక్తి చూపిన జయ్ తాజాగా సీనియర్ హీరోయిన్లతో నటించడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. రాజారాణి చిత్రంలో నయనతారకు జంటగా నటించి చాలా కాలం తరువాత సక్సెస్‌ను రుచి చూసిన ఈ యువ నటుడు తాజాగా ఆండ్రియాతో రొమాన్స్ చేస్తున్నారు. ఎంగేయుం ఎప్పోదుమ్ చిత్ర దర్శకుడు శరవణన్, జైల కాంబినేషన్‌తో రూపొందుతున్న చిత్రంలో ఆండ్రియా హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇవన్ వేరే మాదిరి చిత్రం తరువాత శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిస్తున్న ఈ చిత్రం నగర నేపథ్యంలో సాగుతుందంటున్నారు దర్శకుడు. చిత్రంలో జై చాలా స్టరుులిష్ లుక్‌తో కనిపిస్తారని, ఆండ్రియాతో ప్రేమ సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయని అంటున్నారు. సెలైంట్‌గా మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందట. ఆండ్రియా ప్రస్తుతం కమలహాసన్ సరసన నటించిన విశ్వరూపం-2 చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.