ANI news agency Interviews
-
Amit Shah: కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ !
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..జడ్జీలు ఇది గమనించాలి‘‘కేజ్రీవాల్‌కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.బెయిల్ తీర్పుపై..‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.ప్రధానిగా మోదీ రిటైర్మెంట్పై‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్‌షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు. -
PM Narendra Modi: భారీ ప్లాన్ అనగానే భయపడొద్దు
న్యూఢిల్లీ: భారత్ కోసం బృహత్ ప్రణాళికలు ప్రకటించిన ప్రతిసారీ భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన క్షణాన దేశవ్యాప్తంగా జనంలో ఒకింత ఆందోళన, పాత నోట్ల మార్పిడిపై భయాలు నెలకొన్న ఘటనను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఏఎన్ఐ వార్తాసంస్థతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ పెద్ద ప్రణాళిక ఉంది అన్నంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎవరినీ ఆందోళనకు గురిచేసేలా నా నిర్ణయాలు ఉండవు. దేశ సమగ్రాభివృద్దే లక్ష్యంగా నా నిర్ణయాలుంటాయి. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం అంతా చేశామని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. అంతా నేనే చేశానంటే నమ్మను. సవ్యపథంలో ప్రజాసంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా దేశం సాధించాల్సింది ఇంకా ఉంది. ప్రతి కుటుంబం కలను నెరవేర్చేది ఎలాగ అనేదే నా ఆలోచన. అందుకే గత పదేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే అంటున్నా’’ అని మోదీ చెప్పారు. 100 రోజుల ప్లాన్ ముందే సిద్ధం ‘‘ నా ధ్యాసంతా 2047 విజన్ మీదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనభవం ఉంది. ఆ రోజుల్లో ఎన్నికలొచ్చినపుడు ఓ 40 మంది సీనియర్ ఉన్నతాధికారులు ఎన్నికల పర్యవేక్షక విధుల్లోకి వెళ్లిపోయేవారు. అలా దాదాపు 50 రోజులు కీలక అధికారులు లేకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి అనేదే సమస్యగా ఉండేది. తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. వాళ్లు లేని ఆ 50 రోజులు నాకు విరామం ఇచ్చినట్లు కాదని నిర్ణయించుకున్నా. పూర్తిచేయాల్సిన పనులను ముందే వాళ్లకు పురమాయించేవాడిని. రాబోయే ప్రభుత్వం కోసమే ఈ పనులు చేయండని ఆదేశించేవాడిని. అలా 100 రోజుల ముందస్తు ప్రణాళిక పద్ధతి ఆనాడే అలవాటైంది నాకు. అదే మాదిరి ఇప్పుడూ మూడోసారి ప్రధాని అయితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికలను ముందే సిద్ధంచేసి పెట్టుకున్నా. 2047 వికసిత భారత్ కోసం చేయాల్సిన పనులపై గత రెండు సంవత్సరాలుగా కస రత్తు చేస్తున్నాం’’ అని మోదీ వెల్లడించారు. విఫల కాంగ్రెస్‌కు, సఫల కమలానికి పోటీ ‘‘ వైఫల్యాల కాంగ్రెస్ విధానానికి, అభివృద్ధిని సాకారం చేసిన బీజేపీ విధానాలకు మధ్య పోటీ ఈ ఎన్నికలు. కాంగ్రెస్ ఐదారు దశాబ్దాలు పాలించింది. మాకు ఈ పదేళ్లే పనిచేసే అవకాశమొచ్చింది. అందులోనూ కోవిడ్ వల్ల రెండేళ్లకాలాన్ని కోల్పోయాం. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో కనిపిస్తున్న అభివృద్ధిని, నాటి కాంగ్రెస్, నేటి ఎన్డీఏ పాలనతో పోల్చి చూడండి. అభివృద్ది విస్తృతి, వేగాన్ని లెక్కలోకి తీసుకుని ఓటరు ఎటువైపు నిలబడాలో తేల్చుకోవాల్సిన తరుణమిది. వచ్చే ఐదేళ్లకాలంలో అభివృద్ధిని పరుగుపెట్టిస్తాం. దేశాన్ని పాలించే బాధ్యతలు మనకు అప్పగించినప్పుడు ఒక్కటే లక్ష్యం కళ్ల ముందు కదలాడుతుంది. అదే దేశ ప్రజల అభ్యున్నతి’’ అని మోదీ అన్నారు. గాంధీల కుటుంబంపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ ఒక్క కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా నాడు రాజకీయ సంస్కృతి కొనసాగింది. కుటుంబ పునాదులు కదలకుండా అంతా కాపుగాశారు. దేశ పునాదులను పటిష్టపరిచే సదుద్దేశంతో పనిచేస్తున్నా. నిజాయితీతో మేం చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి’’ అని అన్నారు. తొలి 100 రోజుల్లో చేసినవే అవి.. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే 100 రోజుల ప్లాన్ సిద్దంచేశాం. గెలిచి రాగానే ఒక్క నిమిషం కూడా వృథాచేయకుండా వాటి అమ లుపై దృష్టిపెట్టా. 2019లో గెలిచిన 100 రోజుల్లోపే ఆర్టికల్ 370ని రద్దుచేశా. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దుచే యడంతో ముస్లిం సోదరీమణులకు స్వేచ్ఛ లభించింది. ఇది కూడా తొలి 100 రోజుల్లోనే అమలుచేశా. విశ్వాసమనేది కొండంత బలాన్ని ఇస్తుంది. భారతీయులు నా మీద పెట్టుకున్న నమ్మకం నాపై వాళ్లు ఉంచిన బాధ్యతగా భావిస్తా. భరతమాత ముద్దుబిడ్డగా నేను చేస్తున్న సేవ ఇది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 20 లక్షల మంది నుంచి సలహాలు ‘వచ్చే పాతికేళ్లలో దేశం ఎలాంటి అభివృద్ధి దిశలో పయనిస్తే బాగుంటుందో చెప్పాలని లక్షలాది మందిని సలహాలు అడిగా. వారి నుంచి సూచనలు స్వీకరించా. విశ్వవిద్యాలయాలు, వేర్వేరు రంగాల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఇలా దాదాపు 15–20 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నా. కృత్రిమ మేథ సాయంతో సలహాలను రంగాలవారీగా విభజించా. ప్రతి మంత్రిత్వశాఖ, డిపార్ట్మెంట్లో అంకితభావంతో పనిచేసే అధికారులకు ఈ పని అప్పగించా. ఈసారి ఐదేళ్ల ఎన్డీఏ హయాంలో చేయగలిగిన అభివృద్ధి ఎంత అని బేరీజువేసుకున్నా. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి మైలురాయిని చేరుకున్నపుడు గ్రామమైనా, దేశమైనా కొత్త సంకల్పంతో ముందడుగు వేయాలి. నా గ్రామనికి నేనే పెద్ద అయినపుడు 2047కల్లా సొంతూరుకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటాను కదా. దేశవ్యాప్తంగా ఇలాంటి స్ఫూర్తి రగలాలి. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు అనేవి ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయి’’ అని మోదీ అన్నారు. -
ఎన్నికల బాండ్ల రద్దు : ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల విధానం రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రద్దు చేయడం పట్ల ప్రతి ఒక్కరు బాధపడతారన్నారు. తాజాగా జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ విషయమై స్పందించారు. ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేస్తాయని, బ్లాక్‌మనీని అరికట్టేందుకు తన మనసులోకి వచ్చిన ఆలోచనే ఎలక్టోరల్ బాండ్లు అన్నారు. బ్లాక్‌మనీ నిర్మూలనకు ఇదే మార్గమని తాను ఎప్పుడూ చెప్పలేదని ప్రధాని గుర్తు చేశారు. ఈ పథకంతో బీజేపీకే ఎక్కువ నిధులు వచ్చాయన్నదానిపై ప్రధాని మండిపడ్డారు. బాండ్ల అంశంలో విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదీ చదవండి.. దీదీ ఫైర్.. చాయ్‌కి బదులు అది తాగమంటారేమో -
అదానీపై దాచేదేమీ లేదు
అగర్తల(త్రిపుర): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదిక రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారిగా పెదవి విప్పారు. అదానీ అంశంలో తాము భయపడుతున్నది కానీ, దాస్తున్నది కానీ ఏమీ లేదన్నారు. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో కేంద్ర మంత్రిగా తానిప్పుడేమీ మాట్లాడకూడదని మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో అన్నారు. బీజేపీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుందని ఎవరైనా భావిస్తే కోర్టులను ఆశ్రయించాలన్నారు. విపక్షాలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. మోదీపై కుట్రలు జరిగిన ప్రతీసారి ఆయన మరింత బలం పుంజుకుని ప్రజాదరణ పొందుతున్నారన్నారు మరి భయమెందుకు?: కాంగ్రెస్ అదానీ ఉదంతంలో దాయటానికేమీ లేకుంటే కేంద్రం ఎందుకు భయపడుతోందని, జేసీసీ విచారణకు ఆదేశించకుండా ఎందుకు పారిపోతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఈ అవకతవకలు కేంద్రాన్నే వేలెత్తి చూపుతున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. -
వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్‌సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్‌సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే... యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు... గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు... వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్‌వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు. హెడ్లైన్ల కోసం పాకులాడట్లేదు... నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో! దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం... దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి. నెహ్రూపై విమర్శలు సబబే... నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్‌నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో! దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు.. నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం. ఎన్నికలు మాకు నిత్య పాఠాలు.. ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం. -
మేము టీఆర్ఎస్తో కలిసిపోయామనడం సిగ్గుచేటు
-
రాహుల్, మోదీ మధ్య ఆమె ఎందుకు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీకి మీ ముందుకు వచ్చి కూర్చునే దమ్ము లేదు. నేను వచ్చాను. ప్రతి ఏడు రోజులకోసారి వస్తాను. మీరు నన్ను ఏ ప్రశ్నయినా అడగవచ్చు. మీరు ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ చూశారు గదా! ఓ సానుకూల జర్నలిస్ట్ మోదీని ఓ పక్క ప్రశ్న అడుగుతూ మరో పక్క ఆమే సమాధానం ఇస్తోంది’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని జనవరి ఒకటవ తేదీన ఏఎన్ఐ (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాష్ చేసిన ఇంటర్వ్యూ గురించి రాహుల్ ప్రస్తావిస్తూ స్మితా ప్రకాష్‌ను ఉద్దేశించి ‘సానుకూల’ జర్నలిస్ట్ అని విమర్శించారు. పాలకపక్ష బీజేపీ అనుసరిస్తున్న దురుసుతనం, మెజారిటీవాద దృక్పథానికి తమ పార్టీ దూరమని, ఆ పార్టీ పాలనలో మీడియా స్వేచ్ఛ హరించుకు పోయిందని గతంలో పలుసార్లు విరుచుకుపడిన రాహుల్ గాంధీ నుంచి ఈ సానుకూల జర్నలిస్ట్ అన్న విమర్శ వస్తుందని ఊహించలేదు. మీడియా బయాస్‌గా ఉండడం ఇప్పుడే కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీని అర్నాబ్ గోసామి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అయన మోదీని ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయలేదు. క్రాస్ క్వచ్చనింగ్ జోలికి పోలేదు. పైగా తాను అడగదల్చుకున్న ప్రశ్నలను ఆయన పీఎంవో కార్యాలయానికి ముందే పంపించారు. వాటికి పీఎంవో కార్యాలయం కూడా కొన్ని ప్రశ్నలను జోడించింది. అదే అర్నాబ్ గోసామి నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీని ఇంటర్వ్యూతో ముచ్చెమటలు పోయించారు. ఆ ఇంటర్వ్యూ ద్వారానే రాహుల్ గాంధీకి ‘పప్పూ’ అనే పేరు వచ్చింది. ఇలాగే ‘డెవిల్స్ అడ్వకేట్’ కార్యక్రమంలో నరేంద్ర మోదీని ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టారు. దాంతో నరేంద్ర మోదీ కార్యక్రమం మధ్యలోనే కాలర్ మైక్‌ను విదిలించి బయటకు వెళ్లి పోయారు. అర్నాబ్ గోసామి లాగా ఏఎన్ఐ జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం మోదీని ఇంటర్వ్యూ చేసినట్టులేదు. ఆమె అడిగిన ప్రశ్నల్లో కొన్ని కఠిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మత విశ్వాసాన్ని గౌరవించిన మీరు, ట్రిపుల్ తలాక్ విషయంలో ఎందుకు మత విశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారు ?’ లాంటి ప్రశ్నలు. కాకపోతే సరైన సమాధానం వెతుక్కొని రావడానికి వీలుగా ముందుగానే పీఎంవో కార్యాలయానికి అడిగే ప్రశ్నలను పంపించినట్లు స్పష్టం అవుతోంది. మీడియా తప్పొప్పులను ప్రశ్నించాల్సిందే! అయితే అది ఎవరు చేయాలి? మీడియా సంస్థలు, మీడియా కమిటీలు, మొత్తంగా సమాజం చేయాలి. రాజకీయ నాయకులు మాత్రం కాదు, కాకూడదు! వ్యవస్థ మంచి, చెడులకు వారే బాధ్యులవుతున్నందున వారు చేయడం సబబు కాదు. ఇంకా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలు మీడియాను నిలదీయవచ్చు. విమర్శంచవచ్చు! -
చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు
* ఏఎన్ఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్మోహన్రెడ్డి * ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు * దాన్నుంచి బైటపడడం కోసమే హోదాపై ఒత్తిడి తేవడం లేదు * విభజన చట్టంలో హామీలకే ప్యాకేజీ పేరు * హోదా నిరాకరిస్తూ మోసం చేస్తున్నారు... * మా పోరాటం ఆపేది లేదు.. హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్నుంచి బైటపడడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఫణంగా పెట్టారని జగన్ విమర్శించారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోనే సాంత్వన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు జగన్మోహన్రెడ్డి ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష, ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తొలిసారిగా మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘నిరవధిక నిరాహార దీక్ష ఎందుకు చేశాం? ఈ దీక్షకు కారణాలున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార పక్షం, మొత్తం ప్రతిపక్షం ఏకమయ్యాయి. విభజనకు అనుకూలంగా ఓటేశాయి. పార్లమెంటు వేదికగా ఆనాడు ప్రత్యేక హోదాకు అన్ని పక్షాలు హామీ ఇచ్చాయి. ఇవాళ అవే పక్షాలు మాట తప్పుతున్నాయి. అలాంటపుడు ఇక పార్లమెంటుకు విశ్వసనీయత ఎక్కడుంటుంది? మేం అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది. రాష్ర్టవిభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచే 60శాతం ఆదాయం వస్తుంది. 95శాతానికి పైగా సాఫ్ట్వేర్ సంస్థలు, 70శాతానికి పైగా మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాటిలో ఉపాథి అవకాశాలు కూడా కోల్పోయాం. వీటన్నిటినీ కోల్పోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే ఇపుడు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. ఇదేమి న్యాయమో అర్ధం కావడం లేదు. రాష్ర్ట విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చారు. పోలవరం నిర్మిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు. కేంద్రసంస్థలను ఇస్తామన్నారు. ఎయిర్‌పోర్టులు కడతామన్నారు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి. ఇపుడు అందరూ మాటమారుస్తున్నారు. ఆ హామీలకే కొత్త పేరు పెడుతున్నారు. దానికి ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త పేరు తగిలించారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక పక్క ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ మరో పక్క అబద్దాలాడుతూ మోసం చేస్తున్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన వాటికే కొత్తగా ప్రత్యేక ప్యాకేజీ అనే పేరు పెట్టడం మోసగించడమే. మాకు ఆకాంక్ష ఉంది. మేం పోరాడతాం. మా దురదృష్టమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కానీ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు వత్తిడి చేయడం లేదు? ఇప్పటికి 18 నెలలు గడచిపోయాయి. ఇప్పటికీ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. ఒకనెల గడువిస్తున్నా.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరిస్తా అని చంద్రబాబు ఎందుకు అల్టిమేటమ్ ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఆయన ఓటుకు కోట్లు కేసులో ఆడియోటేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక కుంభకోణాలలో సంపాదించిన డబ్బును తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తూ ఆయన దొరికిపోయారు. ఆ కేసునుంచి బైటపడడం కోసమే ఆయన హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు’’.