Anil jain
-
సాగర్‌కు ఓనర్ తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆనకట్టల భద్రత చట్టం–2021 ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్‌జైన్ స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏకు సంబంధించిన ‘డ్యామ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్’ వెబ్సైట్ (http://dharma.cwc.gov.in)లో డ్యామ్ ఓనర్‌గా ఎవరి పేరుతో ఉంటే.. వారే ఓనర్‌గా ఉంటారని తెలిపారు. దీని ప్రకారం సాగర్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని తేల్చి చెప్పారు. ఏపీ పర్యటన ముగించుకొని తెలంగాణ పర్యటనకు వచ్చిన అనిల్‌జైన్‌తో బుధవారం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం వాలంతరిలో సమావేశమైంది. రాష్ట్రంలో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం అమలు తీరును అనిల్‌జైన్ అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి డ్యామ్‌కు సంబంధించిన డ్యామ్ బ్రేక్ అనాలసిస్ తయారు చేస్తున్నామని ఈఎన్సీ అనిల్‌కుమార్ తెలియజేశారు. వర్షాలకు ముందు, తర్వాత డ్యామ్‌లకు తనిఖీలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతి డ్యామ్, బరాజ్‌కు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ, పర్యవేక్షణ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) నియమావళి (మాన్యువల్)ని సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అనిల్‌జైన్ సూచించారు. నాగార్జునసాగర్ డ్యామ్‌కు మరమ్మతులు చేయకపోతే డ్యామ్ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ విభజన తర్వాత నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణకు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీకి వెళ్లిందని అనిల్‌కుమార్ జైన్‌కు వివరించారు. 2023 నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం పోలీసు బలగాలతో బలవంతంగా నాగార్జునసాగర్ కుడివైపు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుందని తెలిపారు. దీంతో డ్యామ్‌కు మరమ్మతుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. చట్ట ప్రకారం సాగర్ డ్యామ్ ఓనర్ తెలంగాణ రాష్ట్రమేనని ఎన్డీఎస్ఏ చైర్మన్ బదులిచ్చారు.కాళేశ్వరం బరాజ్‌లపై దిశానిర్దేశం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు ఎన్డీఎస్ఏ తుది నివేదికలో ఎలాంటి సిఫారసులు చేయలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ అన్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వస్తే నిపుణుల కమిటీని పిలిపించి తగిన సిఫారసులు చేయిస్తామని అనిల్‌జైన్ బదులిచ్చారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) టి.శ్రీనివాస్, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి, కొత్తగూడెం సీఈ ఎ.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని, దిగువన ప్రమాదకర స్థాయిలో ప్లంజ్ పూల్ విస్తరించిందని, వర్షాలు ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని అనిల్‌జైన్ బదులిచ్చారు. నాగార్జునసాగర్ స్పిల్‌వేకు శాశ్వత మరమ్మతుల కోసం టవర్ క్రేన్ ఏర్పాటు చేశామని అనిల్‌కుమార్ చెప్పారు. సాగర్ కట్టపై ఏపీ ఆక్రమణను తొలగించి, మరమ్మతులకు సహకరించాలని కోరారు. -
శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యామ్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్‌జైన్ చెప్పారు. శ్రీశైలం డ్యామ్ పటిష్టతను అంచనా వేసేందుకు మంగళవారం అనిల్జైన్తోపాటు నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ రోడ్, ప్లంజ్‌పూల్, గ్యాలరీ, బ్లాకులు, రేడియల్ క్రస్ట్ గేట్లను నిపుణులు పరిశీలించి వివిధ సమస్యలను గుర్తించారు. 2009వ సంవత్సరానికి ముందు ప్లంజ్‌పూల్ ప్రాంతంలో గోతులు ఏర్పడ్డాయి. అయితే, 2009 వరదల వల్ల ఒక్క రోజులోనే 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్లంజ్‌పూల్ ప్రాంతంలో 120 మీటర్ల నుంచి 150 మీటర్ల లోతు గొయ్యిలు ఏర్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దీనివల్ల డ్యామ్ పునాదులు కూడా బలహీనపడినట్లు తేల్చారు. స్పిల్‌వే ఎగువన కటాఫ్ దెబ్బతినడంతో 17, 18 బ్లాక్‌లలో పగుళ్లు ఏర్పడ్డాయని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సీజన్‌తో సంబంధం లేకుండా గ్యాలరీలో సీపేజీలు అధికమయ్యాయని, ఇవి డ్యామ్ అంతర్గత నిర్మాణాన్ని శిథిలం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ పటిష్టతకు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జలాశయం మనుగడ మరింత ప్రమాదకరంగా మారుతుందని స్పష్టంచేశారు. అనంతరం డ్యామ్ ఇంజనీర్లతో అనిల్‌జైన్, నిపుణులు సమావేశమై మొదటి విడతలో అప్రోచ్ రోడ్ నిర్మాణం, ప్లంజ్‌పూల్ గోతుల పూడ్చివేత, రెండో విడతలో బ్లాకుల పటిష్టత, గ్యాలరీ సీపేజీల అరెస్ట్‌కు చేపట్టాల్సిన మరమ్మతులపై చర్చించారు. పరిశీలనలు, సమీక్షలతోనే సంవత్సరాలుగా కాలయాపన చేయడం, శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ప్రపంచ బ్యాంక్ రూ.200కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చినా వినియోగించుకోకపోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. ఎన్డీఎస్ఏ రీజనల్ డైరెక్టర్ ఎన్డీ గిరిధర్, డ్రిప్ ప్రాజెక్ట్ ప్రతినిధి నీతా, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్‌కుమార్, సీఈ రాజేష్ కశ్యప్, ఈఎన్సీ రత్నకుమార్, డ్యామ్ సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి డ్యామ్ తనిఖీల్లో పాల్గొన్నారు. -
AITA: అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)లో అనూహ్య పరిణామం... అధ్యక్షుడు అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన టెన్నిస్ సంఘాలు శనివారం ఢిల్లీలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేశాయి. చిత్రంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించతలపెట్టిన రోజే ఈజీఎం ఏర్పాటు చేశారు. ఓవైపు ఎన్నికల కోసం ఏజీఎం నిర్వహించాల్సి ఉండగా... కోర్టు మార్గదర్శకాల మేరకు ఫలితాలను సీల్డ్ కవర్లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.కారణం ఇదే..మరోవైపు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాజ్యసభ ఎంపీ అనిల్ జైన్ తన కుటుంబంతో సహా చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జైన్ మాట్లాడుతూ ఉన్నపళంగా ఈజీఎం నిర్వహణ నియమావళికి విరుద్ధమన్నారు.ఇదంతా కుట్ర!ఇది నిర్వహించాలంటే కనీసం మూడు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని, ‘ఐటా’ నియమావళిలోని 15వ క్లాజ్ ప్రకారం ఇలాంటి సమావేశాలు చట్ట విరుద్ధం. ఈ నెల 23న నోటీసు ఇచ్చి అంతలోనే 28న ఈజీఎం నిర్వహించాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘ఇదంతా కుట్ర! నేను ఐటా, రాష్ట్రాల సంఘాల్లో స్పోర్ట్స్ కోడ్‌ను అమలు చేయాలని కోరినందుకే వారంతా కక్ష గట్టి నాపై బదులు తీర్చుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదుమరోవైపు.. రాష్ట్ర సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదన్నారు. ‘కోడ్‌కు ఎవరూ వ్యతిరేకంగా లేరు. కేంద్ర క్రీడాశాఖ ప్రకారం అమలు చేయాల్సిందే. అనిల్ జైన్ చెబుతున్నట్లు ఇదే సమస్య అయితే గత నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేదు? ఏజీఎం, ఎన్నికల ప్రక్రియను ప్రకటించినపుడు ఎందుకు చర్చించలేదు’ అని రాష్ట్ర సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఈసారి ‘ఐటా’ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, క్రీడాకారులకు మద్దతుగా ఇవ్వాలనుకుంటున్నామని తద్వారా భారత టెన్నిస్ ముఖచిత్రాన్ని మార్చుతామని ఆయన తెలిపారు. అయితే, అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకున్నట్లు తాజా సమాచారం. ఏఐటీఏ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో ఈ విషయాన్ని పంచుకున్నాయి. చదవండి: Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’! -
తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో కేంద్రబృందం భేటీ
-
నీటి బొట్టు.. ఒడిసి పట్టు!
చిన్న కమతాలు.. పెరుగుతున్న పెట్టుబడులు.. రాబడుల లేమి.. వంటి ఎన్నో సమస్యలు భారత్‌లో రైతును అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడం కష్టమేమీ కాదంటున్నారు దేశంలో డ్రిప్ ఇరిగేషన్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన జైన్ ఇరిగేషన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిల్ జైన్. వ్యవసాయ రంగం సవాళ్లు.. పరిష్కారాలు అన్న అంశంపై ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించేందుకు వచ్చిన అనిల్‌జైన్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ప్రశ్న: దేశంలో వ్యవసాయ పరిస్థితి, ఎదుర్కొంటున్న సవాళ్లపై మీ అభిప్రాయం? జవాబు: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని కేంద్రం అంటోది. అయితే దేశంలోని రైతులందరి పరిస్థితి ఒకేలా లేదు. వీరి ఆదాయాన్ని పెంచడం ఓ సవాలు. ముందు వారికి సాగునీరు అందించాలి. అందువల్ల రెండు పంటలు వేసుకోవచ్చు. దీంతో పాటు వాణిజ్య పంటల సాగు చేసుకోవచ్చు. పేద రైతులకు మంచి విత్తనాలు, మొక్కలు, ఎరువులు అందించడం ఇంకో సవాలు. ఉత్పత్తులను మార్కెట్‌తో అనుసంధానించడం కీలకం. రైతు స్వయంగా పంట ఉత్పత్తుల ప్రీప్రాసెసింగ్ చేపట్టాలి. ప్ర: వర్షాలు పడని చోట్ల నీరందించడం ఎలా? జ: అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వాడుకునేలా చూడాలి. పొలాల వరకూ నీటిని తీసుకొచ్చేందుకు ప్రస్తుతం డ్యామ్‌లు, కాల్వలు ఉపయోగిస్తున్నాం. వీటికి బదులు పైపుల ద్వారా తీసుకొచ్చి.. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ల ద్వారా నీటిని 90 శాతం సమర్థంగా వాడుకోవచ్చు. దీంతో దిగుబడులు 30 నుంచి 40 శాతం పెరుగుతాయి.. రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. ప్ర: మిగిలిన విషయాల మాటేమిటి? జ: లీటర్ నీటితో ఏం పండిస్తున్నాం.. ఎంత పండిస్తున్నాం అన్నదీ ముఖ్యమే. ఓ పది లీటర్ల నీటి వాణిజ్య విలువ (వాటర్ ఫ్యాక్టర్ ప్రోడక్టివిటీ) ఎంతన్నది చూడాలి. ఈ అంశంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మేం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశాం. ప్రిసిషన్ అగ్రికల్చర్ టెక్నాలజీ వాడకానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకే సెన్సర్లను జోడించి మొక్కల వేళ్ల వద్ద తేమ శాతాన్ని గుర్తిస్తున్నాం. ప్ర: పాశ్చాత్యదేశాల్లో వర్టికల్ ఫార్మింగ్‌పై... జ: తగినంత వైశాల్యంలో 50 నుంచి 80 అంతస్తుల నిర్మాణాల్లో వర్టికల్ ఫార్మింగ్ చేస్తే 5 లక్షల ఎకరాలకు సమానమైన పంట సాధిం చొచ్చు. ఈ పద్ధతిలో 98% తక్కువ నీటితోనే బాగా పండించొచ్చు. కానీ, పెట్టుబడి ఎక్కు వ. ఒకట్రెండు ప్రాజెక్టులు మినహా దేశంలో వర్టికల్ ఫార్మింగ్ అవసరం లేదు. ప్ర: వ్యవసాయంలో టెక్నాలజీ వాడకానికి చిన్న కమతాలు అడ్డంకి కదా.. జ: ఈ సమస్యను అధిగమించేందుకు మేం ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీవో)తో కలసి పనిచేస్తున్నాం. కొంతమంది రైతులు ఒకే వేదికపైకి వస్తారు కాబట్టి ఈ ఎఫ్‌పీవోల ద్వారా వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడం సులువు అవుతుంది. ఈ విషయంలో టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ సాయంతో ఓ ప్లాట్ ఫార్మ్‌ను సిద్ధం చేస్తున్నాం. ఇది ఎఫ్‌పీవో రైతులు తమ సమస్యలను మొబైల్ఫోన్ల ద్వారా కూడా వారి మాతృభాషలోనే శాస్త్రవేత్తలకు తెలియజేసే వీలు కల్పిస్తుంది. ప్యాకెట్లలో పండ్ల ముక్కలు.. పళ్ల రసాల తయారీలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న జైన్ ఇరిగేషన్ సంస్థ త్వరలోనే పండ్ల ముక్కలను ప్యాకెట్లలో అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చక్కెర, నీరు, ఏ రసాయనాలు లేకుండా 5 రకాల పండ్లు, మిశ్రమాలు అందిస్తా మని అనిల్ జైన్ తెలిపారు. మార్చి లోపు మామిడితో పాటు యాపిల్, అరటి మిశ్రమం, స్ట్రాబెర్రీ, అరటి మిశ్రమం వంటి పండ్ల ముక్కలను నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
'వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లు'
ఢిల్లీ: వచ్చే హర్యానా అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లు ఇస్తామని బీజేపీ నేత అనిల్‌జైన్ హమీ ఇచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో హర్యానా బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అనిల్‌జైన్ మీడియాతో మాట్లాడారు. జాట్ల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని అనిల్‌జైన్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జాట్ల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగుతోంది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.