anil kumaru
-
హోదా కోసం జగన్‌ది అలుపెరగని పోరాటం
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ లంగర్ఖానా, శిఖరంవారివీధి, యడ్లవారివీధి ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నీలి రాఘవరావు ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమంలో భాగంగా నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ శనివారం పాల్గొని, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని చంద్రబాబు తిట్టడం, కేంద్రంలో మాత్రం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాటలే చంద్రబాబు తీరుకు బలం చేకూర్చుతున్నాయన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలతో, ధర్నాలతో , అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ఏ విధంగా పోరాడుతూ మాట్లాడారో ఆ విషయాలనే టీడీపీ ఎంపీ మాట్లాడారని గుర్తు చేశారు. నాలుగేళ్ల నుంచి చంద్రబాబు హోదా కోసం కట్టుబడి ఉంటే అందరం కలసి సాధించేవారమన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ గొప్పదంటూ కేంద్ర మంత్రులకు సన్మానాలు, సత్కారాలు చేసి, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. దేశంలోని ప్రతిపక్షపార్టీలన్నింటినీ ఏకం చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, లోకసభలో కనీసం ఏ ప్రతిపక్షపార్టీ కూడా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడలేదన్నారు. 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి నిరాహార దీక్ష చేద్దామని, హోదా ఎందుకు ఇవ్వరో చూద్దామని జగన్మోహన్రెడ్డి విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించేందుకు ముందుకు రాలేదని గుర్తు చేశారు. బీజేపీతో ఎవరు కుమ్మక్కై ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 24వ తేదీ తలపెట్టిన బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని సహకరించాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు నీలి రాఘవరావు, వేలూరు మహేష్, పి.అశోక్, జాకీర్, మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి, జి.నిరంజన్‌రెడ్డి, జి.మనోరంజన్‌రెడ్డి, పి.హరికృష్ణ, సి.సురేష్‌రెడ్డి, ఎ అప్పారావు, సాయికృష్ణ, యూసఫ్, వెంకటేశ్వర్లు, నసీమ్, శ్రీనివాసులు, రఘురాం, సుమంత్, ఎస్కె హాజీ, కుమార్, పెరిమిడి రాజా, హంజాహుస్సేన్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ హయాంలోనే పేదలకు న్యాయం
సిరిసిల్లటౌన్ : వైఎస్సార్ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని పేదలకు న్యాయం దక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కెమిస్టు భవన్లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా టీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో సర్కారు ఏ ఒక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమయం ఆసన్నమైందని, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సమాయత్తం కావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. స్థానిక సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బెంబెడ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, రాష్ట్ర నాయకులు జక్కుల యాదగిరి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గడ్డం జలజారెడ్డి, గుంటుకు సంపత్, జిల్లా చీఫ్ సెక్రటరీ వంగరి అనిల్, ప్ర«ధాన కార్యదర్శి గుండేటి శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ బూర నాగరాజు, జిల్లా కార్యదర్శులు కొత్వాల రవి, బొడ్డు శ్రీనివాస్, పల్లె రవి, తీగల శ్రీనివాస్‌రెడ్డి, అనుములు శ్రీకాంత్‌రెడ్డి, కడుగుల నాగరాజు, ఎండి. యూనుస్, ఎల్లయ్య, తిరుపతిరెడ్డి, తిరుపతి, హైదర్, నవీన్ పాల్గొన్నారు. ప్రజాసమస్యలపైనే బస్సుయాత్ర సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జూన్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా 54 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌కుమార్ తెలిపారు. యాత్ర రూట్‌మ్యాప్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలపై అధిష్టానానికి నివేదించి, సర్కారును నిలదీస్తామన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన యువకులను అభినందించారు. -
అమల్లోకి ‘ఈ–వే’
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ‘ఈ–వే బిల్లు’ విధానం అమల్లోకి వచ్చిందని, పన్నుల ఎగవేతకు ఇక ముకుతాడు పడనుందని రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో మైలురాయి అని అభివర్ణించారు. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువుల రవాణాకు తప్పనిసరిగా ఈ–వే బిల్లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ–వే బిల్లు విధానం అమలుతో వస్తు రవాణా రంగంపై తొలిసారిగా సమగ్రమైన డేటాబేస్ (సమాచార నిల్వ వ్యవస్థ) తయారవుతుందని పేర్కొన్నారు. ఏ సరకు ఎక్కడ నుంచి ఎక్కడకు రవాణా అవుతుందో తెలుస్తుందని వివరించారు. కంపెనీల నుంచి వస్తువులు ఎక్కడికి రవాణా అవుతున్నాయో, పన్నులు కట్టారో లేదో తెలుసుకోవడానికి ఈ సమాచార వ్యవస్థ ఉపయోగపడనుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్‌తో కలసి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడికైనా అనుమతి: ఒకే ఈ–వే బిల్లుతో దేశంలో ఎక్కడికైనా వస్తువుల రవాణాకు అనుమతి ఉంటుందని, అంతర్రాష్ట్ర సరుకుల రవాణాకు ఇకపై ట్రాన్సిట్ పాస్ అవసరం ఉండదని సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ట్రేడర్లకు వేధింపులు ఉండవ ని, ఈ–వే బిల్లులను సక్రమంగా తీసుకుంటున్నారో లేదో చెక్ చేస్తామని తెలిపారు. ఈ–వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తూ పట్టుబడితే ఎగ్గొట్టిన పన్నులతో పాటు సదరు పన్నులపై 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేస్తామని హెచ్చరించా రు. ఈ–వే బిల్లు డేటాబేస్ ఆధారంగానే జీఎస్టీ వసూళ్లకు ఇన్వాయిస్లు రూపొందించే అవకాశముందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తెలిపారు. ఈ–వే బిల్లును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, బిల్లు నంబర్ ఉంటే చాలన్నారు. జీ‘ఎస్’టీ!: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల సరళి సానుకూలంగా ఉందని, జీఎస్టీ అమలుల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జనవరిలోనే ఎక్కువ ఆదాయం వచ్చిందని సోమేశ్ కుమార్ తెలిపారు. జనవరిలో అత్యధికంగా రూ.1,656.14 కోట్లు వచ్చినట్లు చెప్పారు. డిసెంబర్లో వచ్చిన రూ.1,493.50 కోట్ల పన్నులతో పోల్చితే జనవరిలో పన్ను వసూళ్లు దూకుడు ప్రదర్శించాయన్నారు. పన్ను వసూళ్లలో పెరుగుదల కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలుత రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు రాష్ట్రానికి నష్ట పరిహారం లభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ముందుందని తెలిపారు. 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు: జీరో వ్యాపారాన్ని నిర్మూలించడానికి ట్రాన్స్‌పోర్టు గోదాముల్లో తనిఖీలు నిర్వహించామని సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 786 వాహనాలను తనిఖీ చేశామని, పన్నులు చెల్లించకుండా వస్తువులు రవాణా చేస్తున్న 90 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేశామని తెలిపారు. జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయని 14 వేల మంది ట్రేడర్లకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ నేత అనిల్ కుమార్‌పై దాడి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనిల్ కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసం అయ్యింది. దాడిపై అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.