నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని 44వ డివిజన్ లంగర్‌ఖానా, శిఖరంవారివీధి, యడ్లవారివీధి ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నీలి రాఘవరావు ఆధ్వర్యంలో ప్రజాదీవెన కార్యక్రమంలో భాగంగా నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ శనివారం పాల్గొని, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని చంద్రబాబు తిట్టడం, కేంద్రంలో మాత్రం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాటలే చంద్రబాబు తీరుకు బలం చేకూర్చుతున్నాయన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం దీక్షలతో, ధర్నాలతో , అసెంబ్లీలో జగన్‌మోహన్‌రెడ్డి ఏ విధంగా పోరాడుతూ మాట్లాడారో ఆ విషయాలనే టీడీపీ ఎంపీ మాట్లాడారని గుర్తు చేశారు. నాలుగేళ్ల నుంచి చంద్రబాబు హోదా కోసం కట్టుబడి ఉంటే అందరం కలసి సాధించేవారమన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ గొప్పదంటూ కేంద్ర మంత్రులకు సన్మానాలు, సత్కారాలు చేసి, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
దేశంలోని ప్రతిపక్షపార్టీలన్నింటినీ ఏకం చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, లోకసభలో కనీసం ఏ ప్రతిపక్షపార్టీ కూడా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడలేదన్నారు. 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి నిరాహార దీక్ష చేద్దామని, హోదా ఎందుకు ఇవ్వరో చూద్దామని జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించేందుకు ముందుకు రాలేదని గుర్తు చేశారు.
బీజేపీతో ఎవరు కుమ్మక్కై ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈ నెల 24వ తేదీ తలపెట్టిన బంద్‌లో అన్ని వర్గాల వారు పాల్గొని సహకరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు నీలి రాఘవరావు, వేలూరు మహేష్, పి.అశోక్, జాకీర్, మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి, జి.నిరంజన్‌రెడ్డి, జి.మనోరంజన్‌రెడ్డి, పి.హరికృష్ణ, సి.సురేష్‌రెడ్డి, ఎ అప్పారావు, సాయికృష్ణ, యూసఫ్, వెంకటేశ్వర్లు, నసీమ్, శ్రీనివాసులు, రఘురాం, సుమంత్, ఎస్‌కె హాజీ, కుమార్, పెరిమిడి రాజా, హంజాహుస్సేన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment