Anjali Lama
-
పద్ధతి గల మహిళలు
‘అమ్మాయిలూ.. మీరెలా ఉంటే అదే పద్ధతి. మీరెలా ఉండాలనుకుంటే అదే పద్ధతి’ అంటూ ‘రూల్స్‌ని బ్రేక్ చేయడం ఎలా?’ అని ప్యూమా కంపెనీ.. నలుగురు సెలబ్రిటీల చేత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అమ్మాయిలకు కొత్త పాఠాలు చెప్పిస్తోంది. అవి వినే పాఠాలు కాదు! కలిసి ఆడే పాటలు, కలిసి పాడే ఆటలు! స్త్రీలు అలా ఉండాలని, ఇలా ఉండాలని వాళ్లు పుట్టినప్పట్నుంచీ సమాజం స్టిక్ పట్టుకుని పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మేథ్స్, ఫిజిక్స్లా.. ఒద్దిక, అణుకువ అనేవి అమ్మాయిలకు సమాజం టీచ్ చేసే ముఖ్యమైన సబ్జెక్టులు! ఆ సబ్జెక్టుల్లో పాస్ అయితేనే చివరికి వారికి ‘ప్రాపర్ లేడీ’ అనే ప్రశంసాపత్రం వస్తుంది. ఆ పత్రం ఉంటేనే అమ్మాయి అమ్మాయిగా పెరిగినట్లు. ‘ప్రాపర్ లేడీ’ అంటే పద్ధతిగా పెరిగిన పిల్ల అని! అయితే ఇప్పుడు ‘ఫ్యూమా’ అనే అంతర్జాతీయ స్పోర్ట్స్ కంపెనీ ‘పద్ధతిగా లేకపోవడమే పద్ధతి’ అనే ఒక వీడియో క్యాంపెయిన్ మొదలు పెట్టింది! ‘ఎప్పుడూ ఎంపవర్మెంట్ని సాధించే పనేనా? సాధించిన ఎంపవర్మెంట్ని వేడుక చేసుకునేది ఎప్పుడు?’.. అని సారా అలీ ఖాన్, మేరీ కోమ్, అంజలీ లామా, ద్యుతీ చంద్ ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతారు. మీ చెయ్యి పట్టుకుని వాళ్లలోకి మిమ్మల్ని లాగేసుకుంటారు. సారా అలీఖాన్ బాలీవుడ్ వర్ధమాన నటి. మేరీ కోమ్ ఇండియన్ ఒలింపిక్స్ బాక్సర్. ద్యుతీ చంద్ ఇంటర్నేషనల్ అథ్లెట్, అంజలీ లామా ట్రాన్స్‌జెండర్ మోడల్. వీళ్లంతా స్టార్స్ కదా! పద్ధతిగా పెరగకపోతే, పద్ధతిగా ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంతవరకూ వస్తారా అనేదే మీ సందేహమైతే ఆ సందేహాన్ని తుడిచిపెట్టేయండి. వాళ్లు వాళ్లలాగే ఉంటూ.. ఇంత పైకి వచ్చారు. ‘వాళ్లలాగే అంటే..?’ అని ఇంకో డౌటా! ఒరిజినల్‌గా వీళ్లేమిటో ప్యూమా కంపెనీ తయారు చేయించిన ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ వీడియో చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కో పోకిరి పిల్ల్ల, కుండల్ని బద్దలు కొట్టే పిల్ల, ఎవరేమనుకుంటే నాకేంటి అనే పిల్ల, నీ గేమ్ నీ లైఫ్ అనే పిల్ల సాక్షాత్కరిస్తుంది. కుర్చీలో ‘అదోలా’ కూర్చుంటుంది ద్యుతీచంద్. నోటినిండా బబుల్గమ్ ఊదుతూ ఇంత కళ్లేసుకుని చూస్తుంది సారా అలీఖాన్. ‘ఉంటే జిమ్‌లో ఉండు.. లేదంటే స్ట్రీట్ ఫైట్‌లో ఉండు’ అంటుంది రింగ్‌లో జారి గిలబడి ఉన్న మేరీకోమ్. ‘నాకు ఇష్టమైనది తప్ప నాకు ఇంకేదీ వద్దు’ అని తెగే వరకు లాగి చెప్పేస్తుంది అంజలీ లామా! నేడో రేపో ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ అనే ఈ ప్యూమా కంపెనీ ప్రచారం ప్రారంభం కాబోతోంది. చూడండి. ‘పద్ధతిగా ఉండండి’. నీ గేమ్.. నీ లైఫ్..! సారా అలీఖాన్ నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చినట్లు నేనుంటా. మేరీ కోమ్ పంచ్ ఇస్తే తప్ప లైఫ్ దారికి రాదనుకుంటే పంచ్ ఇవ్వాల్సిందే ద్యుతీ చంద్ ఒకటేదైనా అనుకుంటే వదిలిపెట్టకు. నువ్వు అనుకున్నదాని కోసం నిన్ను నువ్వు వదులుకున్నా తప్పేం లేదు. అంజలీ లామా నా అన్వేషణ శిఖరంపై ఉన్నప్పుడు నేనెందుకు నేలపై వెదుక్కుంటాను? -
లాక్మేలో న్యూ లుక్
ఇండియన్ ర్యాంప్‌పై తొలి ట్రాన్స్‌జెండర్ రిపోర్టర్స్ డైరీ అంజలి లామా (32). నేపాల్ ‘అమ్మాయి’. వచ్చే నెల ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయబోతోంది. ఒక ట్రాన్స్ జెండర్ మోడల్ తొలిసారి ఇండియన్ ర్యాంప్‌పైకి వెళ్లబోవడమే ఇందులోని సంచలనం. అంజలి అమ్మాయి కాదు. అబ్బాయి. నవీన్ వైబా అనే అబ్బాయి! అతడు అంజలిగా మారడమే ఒక విశేషమైతే, ఏకంగా గ్లామర్ వరల్డ్‌లో పాదం మోపడం మరీ విశేషం. ఈ న్యూస్ తెలియగానే ‘సాక్షి’ ఆమెను అభినందించింది. ఆమెతో ముచ్చటించింది. అంజలి మనోభావాలివి. ఇంట్లోంచి.. వెళ్లగొట్టారు నేపాల్‌లోని నువాకట్ నా బర్త్ ప్లేస్. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే సమాజంలో లైంగికపరంగా ఉన్న వైరుధ్యాలను చూస్తూ పెరిగాను. అబ్బాయిలు, అమ్మాయిలు తమదైన సహజ స్వభావంతో ఎలా ప్రవర్తిస్తారో గమనిస్తున్నప్పుడు అందుకు భిన్నంగా.. నా ప్రవర్తన, ఆలోచనలు ఉండడం గ్రహించాను. అమ్మతో నాకు ఎక్కువ దగ్గరితనం. నా ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలే. ఎప్పుడూ వాళ్లతో ఉండేవాడిని. వాళ్లతో కంఫర్ట్‌గా అనిపించేది. నేనూ దాదాపుగా ఒక అమ్మాయిలా మారిపోయాను. అందరూ నన్ను వింతగా చూడడం మొదలైంది. చివరకు నా ప్రవర్తనతో తలెత్తుకోలేకపోతున్నామంటూ నా కుటుంబం కూడా నన్ను తరిమేసింది. గ్లామర్ ఫీల్డ్ ‘ఛీ’ కొట్టింది చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖాట్మాండులో మోడలింగ్ ట్రైనింగ్ పూర్తి చేశాను. ఒక మ్యాగజీన్ కవర్ పేజీ కోసం ఏర్పాటు చేసిన ఫోటో షూట్‌తో.. నా జీవితం ప్రారంభం అయినప్పఅయింది. అయితే అడుగడుగునా నా ప్రయాణం కష్టంగా మారింది. అనేక రకాలుగా ఎదురు దెబ్బలు తగిలాయి. ట్రాన్స్ జెండర్ అనే ఏకైక కారణంతో గ్లామర్ ప్రపంచం నన్ను తిరస్కరించింది. చాలా ఏడ్చాను. స్నేహితులు, బంధువులు అంతా ఈ వృత్తిని వదిలేయమని సలహా ఇచ్చారు. కాని నేను వదిలిపెట్టలేదు. నా పై నాకున్న నమ్మకంతో, ట్రాన్స్జెండర్లు గ్లామర్ ఫీల్డ్‌కు పనికిరారనే అపోహ తొలగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు నడిచాను. ప్రతిష్టాత్మకమైన లాక్మే ఫ్యాషన్ వీక్ దాకా రాగలిగాను. నాకు ఇష్టమైన మోడల్ ఆండ్రియానా లిమా. బ్రెజిల్. నేనింకా పైపైకి ఎదగాలి పూర్తిగా నా ప్రొఫెషన్పైనే దృష్టి పెట్టాను. మోడల్‌గా ఉంటూనే ఇంకా పెద్ద పోటీల్లో పాల్గొని గెలవాలనేది నా కోరిక. మోడలింగ్ రంగంపైనే పూర్తిగా నా దృష్టి ఉంటుంది. ఇక్కడే నా స్థానాన్ని ఏర్పరచుకుంటా. కానీ ఇందుకు నేను చాలా కష్టపడాలి. దేశంలో ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీ అయిన ఎల్జీబీటీ (లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ పీపుల్) హక్కుల పట్ల ఎవరికి పట్టింపు లేదు. మమ్మల్ని ఈ సమాజం అంగీకరించడం చాలా కష్టం. అయినప్పటికీ, నేను మాత్రం అతి కష్టమ్మీద అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ స్థాయికి వచ్చాను. నా విజయాలతో నాతోటి వారికి స్ఫూర్తిని కలిగించడం నా బాధ్యతగా భావించి పని చేస్తాను. ఫిట్నెస్ గురించి అంజలి ఆహారం మితంగా తీసుకుని.. తగిన మోతాదులో నీళ్లు తాగుతాను. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్‌గా ఉంచుకుంటాను. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఎంపికయిన తర్వాత, ఇప్పుడిప్పుడే జిమ్‌కు వెళ్లడం మొదలు పెట్టాను. నా సలహా ఒక్కటే.. మన శరీర తత్త్వాన్ని తెలుసుకుని, దానికి తగ్గ పని చెప్పాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేచురల్‌గా, సింపుల్‌గా ఉండాలి. అదే మన అందాన్ని కాపాడుతుంది. – ఎస్.సత్యబాబు