Apko
-
AP: ఆప్కోలో అద్భుతమైన డిజైన్లతో వస్త్రాలు
సాక్షి, అమరావతి: వస్త్ర ప్రేమికులకు అత్యాధునిక డిజైన్లతో కూడిన మరింత నాణ్యమైన వ్రస్తాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కో సంస్థ ‘కన్సైన్మెంట్’ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం పేరెన్నికగన్న చేనేత వ్రస్తాలను ఉత్పత్తి చేస్తున్న 50 సొసైటీలకు ఆప్కో షోరూమ్‌లలో చోటు కేటాయించనుంది. ఈ నెల 18న ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రయోగాత్మకంగా విజయవాడ పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని ఆప్కో మెగా షోరూంలో అమలులోకి తీసుకురానుంది. చదవండి: పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్ చేనేతలో బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చీరలు, అత్యాధునిక వస్త్రాలను తొలి దశలో అందుబాటులోకి తెస్తారు. ఉప్పాడ, చీరాల కుప్పటం పట్టు, మంగళగిరి చేనేత, వెంకటగిరి శారీ, ధర్మవరం జరీ బుటా తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడన కలంకారీ, పొందూరు ఖద్దరు వ్రస్తాలను కూడా ఆప్కో విక్రయించనుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను కూడా విక్రయించనుంది. నూతన డిజైన్ వ్రస్తాలకు మర్కెట్లో డిమాండ్ వచ్చేలా ప్రతి నెలా ‘వస్త్ర ప్రదర్శన(పాప్ ఆప్ షో)’ నిర్వహించనుంది. నేతన్నకు ఎంతో మేలు.. ‘కన్సైన్మెంట్’ విధానంతో నేతన్నకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు నేతన్నలు అత్యాధునిక డిజైన్లు, ఖరీదైన వ్రస్తాలను ప్రైవేటు క్లాత్ షోరూమ్‌లకే విక్రయించేవారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు వాటిని అమ్మిన తర్వాతే డబ్బులు ఇచ్చేవారు. ఆప్కో ద్వారా అమ్మితే ఏ నెల డబ్బు ఆ నెలలోనే చెల్లిస్తుంది. చేనేత సొసైటీల ప్రతినిధుల సమక్షంలోనే విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటుంది. చేనేతకు ఊతమిచ్చేలా చర్యలు రాష్ట్రంలో చేనేత రంగానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారు. ఏటా ‘నేతన్న నేస్తం’ అందిస్తున్నారు. సీఎం జగన్ స్ఫూర్తితో ఆప్కో ద్వారా కన్సైన్మెంట్ విధానం అమల్లోకి తెచ్చి చేనేత రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు చేపట్టాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి 50 చేనేత సొసైటీల ఉత్పత్తులను విక్రయిస్తాం. ఆ సొసైటీల ప్రతినిధులనే సేల్స్‌మెన్‌గా నియమించుకునే అవకాశం కల్పిస్తాం. బిల్లులను ఏ నెలకు ఆ నెల చెల్లించేలా పటిష్ట వ్యవస్థను తెస్తాం. తద్వారా చేనేత వ్రస్తాల ఉత్పత్తి పెరిగి.. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. లాభాపేక్ష లేకుండా ఆప్కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. – చిల్లపల్లి మోహనరావు, ఆప్కో చైర్మన్ -
ఐదు నెలలు.. అడ్రెస్ లేదు..!
పాత దుస్తులతోనే పాఠశాలకు.. • సగం విద్యాసంవత్సరం గడిచినా దుస్తులు కరువు • వస్త్రం కొనుగోలు ధర నిర్ణరుుంచని ప్రభుత్వం • పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల మధ్య అసమానతలు తొలగిస్తూ.. అంతా సమానమనే భావన కల్పించేందుకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో 1,591 పాఠశాలలు ఉన్నారుు. వాటిలో 2,13,093 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 49,336, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 28,983, ఉన్నత పాఠశాలల్లో 1,34,774 మంది విద్యార్థులు చదువుతున్నారు. కుల మతాలు, పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఒకే రకం దుస్తులు ఉండా లన్న నిబంధన ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొన్నేళ్లుగా ప్రభుత్వమే దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తోంది. మొదట కుట్టించిన దుస్తులను పంపిణీ చేసేవారు. విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తులు చిన్నవి, పెద్దవి కావడంతో ప్రభుత్వం ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలు చేసి.. ఎస్ఎంసీ ద్వారా కుట్టించి విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేసేవారు. జతకు రూ.40 చొప్పున కుట్టుకూలీ ఇచ్చేవారు లేకపోవడంతో ఈ బాధ్యతను కొన్ని సంస్థలకు అప్పగించారు. ఒక వేళ వస్త్రం కొనుగోలు చేసినా పాఠశాలలకు చేర్చి.. విద్యార్థులకు పంపిణీ చేయడానికి చాలా సమయమే పడుతుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం ముగిసిపోరుుంది. అందరికీ ఒకే కొలత... విద్యార్థులకు దుస్తులు అందజేయటం వరకు బాగానే ఉన్నా.. అందరికీ ఒకే విధంగా కుట్టించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు రెండు జతల చొప్పున దుస్తులు అందజేశారు. ఒక్క జత వస్త్రానికి రూ.160, కుట్టేందుకు రూ.40 వెచ్చించారు. దర్జీ అందరికీ ఒకే కొలత ప్రకారం కుట్టి పాఠశాలలకు పంపిణీ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు పొడవుగా ఉండటం, మరి కొందరు లావుగా ఉండటంతో ఆ దుస్తులు వేసుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈసారి అనుమానమే... ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి ఐదు నెలలు గడుస్తున్నా దుస్తుల పంపిణీ జాడేలేదు. ఇప్పటివరకు వస్త్రం కొనుగోలు చేయకపోవడంతో దుస్తులను పంపిణీ చేస్తారనే నమ్మకం కూడా లేదు. వేసవి సెలవుల్లోనే వస్త్రం ఎంపిక చేయడం.. కుట్టడం ప్రక్రియ చేపడితే పాఠశాలలు తెరిచేలోగా పంపిణీకి సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు వస్త్రానికి సంబంధించిన ధరను ప్రభుత్వ ఖరారు చేయకపోవడంతో కొనుగోలు చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు దుస్తులు అందిస్తాం.. ఇది పాత మాట.. ప్రస్తుతం ఐదు నెలలుగడుస్తోంది.. సగం విద్యా సంవత్సరం గడిచిపోరుుంది.. దుస్తుల పంపిణీ ఏమోగానీ.. అవసరమైన వస్త్రం ఎంపిక కనీసం చేపట్టలేదు.. పాతవి.. చిరిగిన దుస్తులతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.. పాఠశాలల తనిఖీలకు వచ్చిన రాష్ట్రస్థారుు అధికారులు ఉపాధ్యాయుల పనితీరు, సమస్యలను పరిశీలించారే తప్ప విద్యార్థుల దుస్తుల గురించి పట్టించుకోనట్లు తెలుస్తోంది. - వైరా -
ఆప్కో చైర్మన్ పదవికి హనుమంత రావు రాజీనామా
- కొత్త చైర్మన్‌గా గుజ్జల శ్రీను పేరు సీఎంకు సిఫారసు - ఇరువర్గాలతో చర్చించి కొలిక్కి తెచ్చిన మంత్రులు సాక్షి, విజయవాడ బ్యూరో ఆప్కో చైర్మన్ పదవికి ఎం.హనుమంతరావు సోమవారం రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలతో విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆప్కో చైర్మన్ పదవిని చేపట్టిన హనుమంతరావు అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరారు. అప్పట్లో మూడున్నర సంవత్సరాలు ఆయన ఆప్కో చైర్మన్ పదవిలో కొనసాగేలా అవకాశం ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించి మరో ఏడాదిన్నర కాలాన్ని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జ్జల శ్రీనుకు కట్టబెట్టేలా నిర్ణయించారు. ఆప్కో చైర్మన్ పదవి విషయంలో హనుమంతరావు, శ్రీను వర్గాలు పంతాలకు పోయి పట్టుబట్టడంతో ముగ్గురు మంత్రులు నచ్చజెప్పి వారి పంచాయితీని సర్దుబాటు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఎం.హనుమంతరావు తాను ఆప్కో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రులు గంటా, ప్రతిపాటి, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముందుగా అనుకున్న షరతు ప్రకారం హనుమంతరావు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం అభినందనీయమన్నారు. ఆప్కో చైర్మన్ పదవికి గుజ్జల శ్రీను పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి సిఫారసు చేసి ఖరారు చేస్తామన్నారు. అందుకు 13 జిల్లాల ఆప్కో డెరైక్టర్లు ఆమోదం తెలిపారని మంత్రులు చెప్పారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 ప్రకారం ఉమ్మడి ఆప్కో ఆస్తుల పంపకాల వివరాలను స్పష్టం చేయడం జరిగిందని వివరించారు. తెలంగాణ నుంచి రూ.40కోట్లు మన ఆప్కోకు రావాల్సి ఉంటుందన్నారు. నిధులు ఉన్నప్పటికీ పంపకాలు జరగడంలేదని, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారా చర్యలు కోరతామని మంత్రులు వివరించారు. ఏపీ ప్రభుత్వం, అనుబంధ శాఖలు కూడా ఆప్కోకు రావాల్సిన నిధులను సమీకరించేందుకు చర్యలు చేపడతామని, చేనేత రంగంలో ఉత్పత్తులను సేకరించడానికి కూడా ప్రభుత్వం చొరవచూపుతోందని వివరించారు.