apo
-
హెచ్ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్పల్లి జోన్లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్‌డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. -
ఏపీవోపై చర్యలు తీసుకోండి!
సాక్షి, ఒంగోలు : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఆళ్ల శేషయ్యను ఆ పోస్టు నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్ద కాలంగా శేషయ్య అనే ఉపాధ్యాయుడు బోధనేతర కార్యక్రమంలో అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. గతంలో తర్లుపాడులో ఎస్జీటీగా పనిచేస్తూ పాఠశాలకు హాజరు కాకుండా కార్యాలయానికి హాజరవుతుండేవారన్నారు. పదేళ్ల నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి కౌన్సిలింగ్‌కు పది నిమిషాల ముందు డీఈవోకు అందజేస్తారన్నారు. మెరిట్ కం రోస్టర్ విధానంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు తయారు చేయల్సి ఉండగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు మేలుచేసే విధంగా రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జీవోలను వక్రీకరిస్తూ, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్నుత్న ఏపీవోపై ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్రె వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల శరత్చంద్రబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పేరాబత్తిన జాలరామయ్య, జిల్లా కార్యదర్శి పాలేటి సువర్ణబాబు, నాయకుడు పల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఏపీఓ ఎవరో..?
బొబ్బిలి రూరల్ : బొబ్బిలి మండలంలో ఉపాధి పథకం ఏపీఓ ఎవరన్నది సందేహాస్పదంగా మారింది. ఈ నెల 9న డ్వామా పీడీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీలను తెర్లాం మండలానికి, అక్కడి ఏపీఓ కె.కేశవరావును బొబ్బిలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 12న ఎంపీడీఓ ఆర్వి.పద్మజకు ఆదేశాలు అందాయి. ఈ నెల 18న తెర్లాం ఏపీఓ కె.కేశవరావు బొబ్బిలిలో విధుల్లో చేరారు. కానీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీల మాత్రం బొబ్బిలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఫీల్డుకు వెళ్లి వివరాలు విలేకరులకు తెలిపారు. తాను ఇక్కడ రిలీవ్ కాలేదని, కేశవరావు తెర్లాంలో రిలీవ్ కాలేదని ఆమె చెబుతున్నారు. అయితే కేశవరావు విధుల్లో చేరి 2, 3 రోజులలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తానని ఎంపీడీఓకు తెలిపినట్లు సమాచారం. రిలీవ్ కావాల్సిందే.. ఏపీఓ సుశీల రిలీవ్ కావాల్సిందేనని ఎంపీడీఓ ఆర్వి.పద్మజ తెలిపారు. పీడీ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు తెర్లాం ఏపీఓ కేశవరావు బొబ్బిలిలో ఈ నెల 18న విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. కె.సుశీల విధులు నిర్వర్తించినా అధికారిక కార్యక్రమాలకు ఏపీఓ కేశవరావే అని తెలిపారు. రాజకీయ ఒత్తిడులే కారణమా..? ఏపీఓల బదిలీకి రాజకీయ ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. టీడీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రి సోదరుడు బేబీనాయన ఈ బదిలీలకు కారకుడని సమాచారం. అయితే తాను మంత్రి సుజయ్ వద్దే విషయం తేల్చుకుంటానని ఏపీఓ సుశీల చెప్పడం గమనార్హం. నేను విధుల్లో చేరా.. నా బదిలీ ఉత్తర్వుల మేరకు నేను ఈ నెల 18న ఏపీఓగా బాధ్యతలు స్వీకరించాను. ఎంపీడీఓకు బాధ్యతలు ïస్వీకరిస్తున్నట్లుగా పత్రాలు కూడా ఇచ్చాను. – కె.కేశవరావు, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం నుంచి బదిలీ అయిన ఏపీఓ) నేనే ఏపీఓని.. నేను బొబ్బిలిలో, తెర్లాంలో కేశవరావు రిలీవ్ కాలేదు. బదిలీలు అయితే అందరికీ చేయాలి. కానీ ఇద్దరినే చేయడమేంటి..? నేనే విధులు నిర్వర్తిస్తాను. ఏపీఓ నేనే. మంత్రి వద్ద విషయం తేల్చుకుంటా. – కె.సుశీల, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం బదిలీ అయిన ఏపీఓ) వివాదం ఏమీ లేదు.. పీడీ ఆదేశాల మేరకు ఏపీఓలు బదిలీ అయ్యారు. నేను çసుశీలకు రిలీవింగ్ ఇచ్చాను. కేశవరావును విధుల్లో చేర్చుకున్నా. ఇందులో వివాదం ఏమీ లేదు. అధికారికంగా కేశవరావు ఏపీఓ. సుశీల ఉన్నా మేమేమీ అనలేం కదా. ఆమె ఇష్టం. (ఈ మేరకు బదిలీ, జాయినింగ్, రిలీవింగ్ ఉత్తర్వులు చూపారు.) – ఆర్వి.పద్మజ, ఎంపీడీఓ,బొబ్బిలి. -
కాంట్రాక్ట్ ఆపరేటర్... ఉపాధి ఏపీఓనా?
ఉప్పలగుప్తం : అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా ఉప్పలగుప్తం మండలంలో ఉపాధిహామీ విభాగం అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ)గా పనిచేస్తున్నారు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఎంపీడీవో స్థాయికి సమానమైన ఏపీఓ పోస్టు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా వేరే మండలం నుంచి ఉప్పలగుప్తం మండలానికి డిప్యుటేషపై వచ్చి పనిచేయడం గమనార్హం. మండలంలో ఏడాదికి పైగా ఉపాధి ఏపీఓ పోస్టు ఇ0చార్జిలతోనే నడుస్తోంది. కాట్రేనికోన ఏపీఓ కొంతకాలం ఇ0చార్జిగా పనిచేయగా, మండలంలోనే పని చేస్తున్న ఉపాధి ఈసీ ఎస్.కృష్ణభగవానును ఏపీఓగా నియమించారు. మూడు నెలలుగా ఈసీ భగవాను కూడా పత్తాలేరు. ఇక్కడ రిలీవ్ కాకుండానే రౌతులపూడి మండలానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. రెండు నెలలుగా ఉపాధిహామీ విభాగాన్ని నడిపించే నాథుడు లేక కిందిస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మండలంలో ఇద్దరు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రమోషను జాబితాలో ఉన్నవారే. అయితే ఏపీఓగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని నియమించవచ్చు. కాని ఇక్కడ అలా జరగలేదు. అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఎం.సీతారాంను ఏపీఓగా నియమించించారు. ఈ వారంలో ఉపాధి ఆడిట్ ప్రారంభమవుతుంది. సదరు ఆపరేటర్ మండలానికి వచ్చిన నాటి నుంచి తానొక పలుకుబడి గల వ్యక్తినని, పంచాయతీరాజ్ కమిషనర్, డ్వామా పీడీలకు బాగా కావాల్సిన మనిషినని, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పీఏగా పని చేశానని చెప్పుకుంటున్నారు. వారి అండతోనే కాంట్రాక్ట్ ఉద్యోగికి సాధ్యం కాదని చెబుతున్న ఏపీఓ పోస్టు తనకు వచ్చిందని ఆయనే బాహాటంగా చెబుతున్నాడు. పంచాయతీరాజ్ శాఖలోని రాష్ట్రస్థాయి అధికారితో ఉన్న సన్నిహిత సంబంధాలు సీతారామ్‌కు బాగా కలిసొచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. -
అ‘పూర్వ’ సమ్మేళనం!
పాతికేళ్ల తరువాత కలుసుకున్న క్రాంతి కళాశాల విద్యార్థులు పొన్నెకల్ (ఖమ్మం రూరల్): ఐదేళ్లు కాదు.. పదేళ్లు కాదు.. పాతికేళ్ల క్రితం ఖమ్మంలోని క్రాంతి జూనియర్ కళాశాలలో కలిసి చదువుకున్న నాటి విద్యార్థులు.. ఇన్నేళ్ల తరువాత ఆదివారం కలుసుకున్నారు. ఆనందానుభూతులను, మధుర జ్ఞాపకాలను నెమరేసుకన్నారు. కష్టసుఖాలను కలబోసుకున్నారు. రోజంతా హ్యాపీ హ్యాపీగా గడిపారు. చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకుని నాటి గురువులను ఆహ్వానించారు. సాయంత్రం వరకు సందడి చేశారు. మొక్కలు నాటారు. మరువలేని, మరపురాని మధురానుభూతులనెన్నింటినో మదిలో మూటకట్టుకుని మళ్లీ కలుద్దామంటూ పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ అ‘పూర్వ’ సమ్మేళనానికి పొన్నెకల్‌లోని అనీబిసెంట్ బీఈడీ కళాశాల వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నర్సింహారావు, వీరారెడ్డి, విఎల్.రావు, భాస్కర్‌రావు, రమాదేవి, మధుసూధన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఓహ్.. ఎంత ఆనందంగా ఉందో..! విజయ్, పూర్వ విద్యార్థి ఎక్కడో పుట్టాం. ఎక్కడో పెరిగాం. ‘క్రాంతి’లో చదివాం. ఎక్కడెక్కడో స్థిరపడ్డాం. ఇన్నేళ్ల తరువాత ఈ రోజిక్కడ కలిశాం. ఓహ్.. ఎంత ఆనందంగా ఉందో..! అప్పుడు మా ఇంటర్లో 106 మందిమి ఉండేవాళ్లం. అనేకమందిమి అనేకానేక రంగాల్లో స్థిరపడ్డాం. మనం ఎక్కడున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. అందరం కలిసి ఇతరులకు చేతనైనంత సాయం చేద్దాం. మరువలేనిది... మరపురానిది..! యు.మహేష్, పూర్వ విద్యార్థి ఈ కలయిక మరువలేనిది.. మరపురానిది. నా సహాధ్యాయులను, స్నేహితులను, గురువులను అందరినీ ఇలా ఒకేచోట కలుసుకోవడం.. చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది. ఆ రోజుల్లో మమ్మల్ని మా గురువులు తమ కుటుంబ సభ్యుల్లాగా ఆప్యాయంగా చూసుకున్నారు. ఈ ఆదివారాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. మరోసారి ఇలా కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తుంటాను. గురువుల స్ఫూర్తితోనే కళాశాల నెలకొల్పా ఎ.జితేందర్‌రెడ్డి, పూర్వ విద్యార్థి మేం ఇంటర్ చదివే రోజుల్లో మా గురువులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా బోధించారు. జీవితంలో ఎలా స్థిరపడాలన్న దానిపై కూడా అవగాహన కల్పించారు. అదే స్ఫూర్తితో నేను కూడా హన్మకొండలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేశా. నేను ఉన్నత స్థితికి చేరడానికి నాటి గురువులు నింపిన స్ఫూర్తే కారణం. ఇంతకంటే ఇంకేం కావాలి..?! మువ్వా శ్రీనివాసరావు, క్రాంతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మా వద్ద చదువుకున్న పిల్లలు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి స్థితిలో ఉన్నారని వింటుంటే.. పట్టరానంత సంతోషంగా ఉంది. జీవితంలో ఇంతకు మించిన ఆత్మ సంతృప్తి ఇంకేముంటుంది? మాకు ఇంతకంటే ఇంకేం కావాలి?! ఖమ్మంలోనే మొట్టమొదటగా ప్రైవేట్ జూనియర్ కళాశాలను కేవలం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే నెలకొల్పాం. అది నెరవేరడం గర్వంగా ఉంది. జి.రవికుమార్, ఇంగ్లిష్ లెక్చరర్ నా వద్ద ఇంగ్లిష్ పాఠాలు చదువుకున్న విద్యార్థులు.. ఆయా రంగాల్లో ఉన్నతంగా నిలవడాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పదుల సంఖ్యలో ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు చేయడం, సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఎంతో సంతోషంగా ఉంది. స్నేహపూర్వకంగా మెలిగాం. ఇప్పుడు వారి ఉన్నతిని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నా.