డీఐజీకి అవమానంపై గవర్నర్కు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ డీఐజీ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అవమానించడం సరికాదని ఏపీ డీఐజీ జాస్తి వెంకట రాముడు అన్నారు. ఈ ఘటనపై తాము ఇప్పటికే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో ఆయన బుధవారం నాడు కుటుంబ సమేతంగా పూజలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
త్వరలో ఏడు వేల పోలీసు ఖాళీలను భర్తీ చేస్తామని జేవీ రాముడు అన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట వద్ద 3 వేల ఎకరాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. అలాగే విజయవాడలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం రూ. 77 కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు.