Appellate Authority
-
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
సంకలనాలు కలిగిన పిండి మిశ్రమాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. అవి తక్కువ పన్ను రేటు చట్టంలో పేర్కొనని ఆహార పదార్థాల తరగతి కిందకు వస్తాయని పేర్కొంది.ఇడ్లీ, ధోక్లా, దహీ వడ వంటి వంటకాలకు పిండి మిశ్రమాలను విక్రయించే గాంధీనగర్‌కు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. ఈ పిండి మిశ్రమాలను 5 శాతం పన్ను రేటు ఉన్న కేటగిరీ కింద వర్గీకరించాలని కంపెనీ వాదించింది.చట్టంలో పేర్కొనని నిష్పత్తిలో మసాలా దినుసులు, ఇతర పదార్ధాలతో పిండి మిశ్రమాలు తక్కువ పన్ను రేటును క్లెయిమ్ చేయలేవని అథారిటీ మే 29న ఒక ఉత్తర్వులో తెలిపింది. గుజరాత్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ గతంలో ఇచ్చిన ముందస్తు తీర్పును ఈ నిర్ణయం సమర్థించింది. -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే: అప్పిలేట్ అథారటీ
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని అప్పిలేట్ అథారటీ నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు విచారణ చేపట్టిన అప్పిలేట్ అథారిటీ.. పుష్ప శ్రీవాణి గిరిజనురాలేని స్పష్టం చేసింది. ఆమె ఎస్టీ కొండదొర సామాజిక వర్గంగా తెలిపింది. కాగా అప్పిలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
థర్మల్ ప్లాంటు రద్దు చేయండయ్యా...
అప్పిలేట్ అథారిటీకి మొరపెట్టుకున్న పోరాట కమిటీ నాయకులు {పమాదమని తెలిసినా... నిర్మాణం న్యాయమా?: ఓ మహిళ వేడుకోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్విరాన్మెంట్ అప్పిలేట్ సబ్ కమిటీ పాత పరిశీలనల మాదిరిగా చేయొద్దని స్థానికుల వినతి ‘థర్మల్ ప్లాంటువల్ల ప్రమాదం ఉందని తెలిసినా ఇక్కడ నిర్మాణం ఎలా చేపడుతున్నారు... మాకు జీవనోపాధి లేకుండా మా పొట్టలు కొట్టడం ఎంతవరకు సబబు’ అని కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ వేడుకోలు. ’ఈ ప్లాంటు వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఏటా మా పొలాలు ముంపుబారిన పడతాయి. కాలుష్యంతో ఈ ప్రాంతం సర్వనాశనమవుతుంది. ప్లాంటు రద్దు చేస్తే మేమంతా సంతోషంగా బతుకుతాం’ ఇది పోరాట కమిటీ నాయకుల డిమాండ్ ఇలా అడుగడుగునా ఈస్టుకోస్ట్ థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువ పరిశీలనకు వచ్చిన జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్‌కమిటీకి స్థానికులు మొరపెట్టుకున్నారు. సంతబొమ్మాళి : మండలంలోని కాకరాపల్లి పరిసర ప్రాంతాల్లో ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు యాజమాన్యం తవ్విన కాలువను జాతీయ పర్యావరణ అప్పిలేట్ అథారిటీ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సి.ఆర్.బాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం క్షేత్ర స్థాయిలో శనివారం పరిశీలించింది. తొలుత వడ్డితాండ్ర వద్ద థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కారుణ్య రమణమ్మ అనే మత్స్యకార మహిళ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ థర్మల్ ప్లాంటు వలన ప్రమాదమని తెలిసినప్పటికీ ఇక్కడ నిర్మాణం చేపట్టి జీవనోపాధి లేకుండా పొట్టలను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దశలో ప్లాంటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు థర్మల్ వద్దంటూ నినాదాలు చేశారు. దీనిపై కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ జోక్యం చేసుకుని వారించడంతో నినాదాలను విరమించారు. అక్కడినుంచి కమిటీ థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు నుంచి లోపలికి వెళ్లింది. రైతులు, పోరాట కమిటీ నాయకులను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఇది గ్రహించిన కమిటీ సభ్యులు ప్లాంటు నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి కాలువ పొడవునా మూడు గంటల పాటు కాలి నడకనే తిరిగి స్థానికులు, థర్మల్ యాజమాన్యం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. థర్మల్ యాజమాన్యం నిర్మించిన కాలువ నీరు ఎక్కడ సముద్రంలో కలపాలనుకున్నారో మ్యాప్‌లో చూపించాలని కమిటీ చైర్మన్ సి.ఆర్.బాబు ప్రశ్నించడంతో ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. అసంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ కాలువ ఎక్కడ అంతం అవుతుందో నీరు ఎలా సముద్రంలో కలుస్తుందో తాను తప్పక చూడాల్సిందేనని పట్టుపట్టారు. గత్యంతరం లేక అన్ని శాఖల అధికారులు ఆయన వెంట వెళ్లారు. కానీ కాలువ ఎక్కడా కలిపినట్లు కనిపించక పోవడం, వెడల్పు కూడా తక్కువగా ఉండడాన్ని కమిటీ గుర్తించింది. వెంటనే కాలువ వెడల్పు చేసి దేశగెడ్డకు కలపాల్సి ఉంటుందని చెర్మైన్ బాబు థర్మల్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు పోరాట కమిటీ నాయకులు అప్పిలేట్ థారిటీకి తమ వేదన తెలియజేశారు. తంపర చుట్టూ తవ్విన కాలువ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, ప్లాంటు అవసరాలకే కాలువను తవ్వుకున్నారని వివరించారు. ప్లాంటు చుట్టూ ఎత్తై గట్టు వేయడం, గోడ కట్టడం వల్ల వరదనీరు వెళ్లే దారిలేక ఏటా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. సముద్ర మట్టానికి జీరో లెవల్లో కాలువ ఉండడం వల్ల సముద్రపు నీరు కాలువలోకి వచ్చి పంట పొలాలు ఉప్పు భూములుగా మారే అవకాశముందని అన్నారు. ప్లాంటు నిర్మాణం వల్ల ఏటా సుమారు 30 వేల ఎకరాలు మునిగిపోతున్నాయని చెప్పారు. గత కమిటీల మాదిరిగా వాస్తవాలు బుట్టదాఖలు చేయకుండా న్యాయంచేయాలనికోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు డాక్టర్ పి.కె.థార్, పి.డి.స్వాయ్, డి.బి.బామన్, ఎం.రమేష్, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ డీడీ యాకూబ్‌భాషా, తహశీల్దార్ బి.రామారావు, ఇరిగేషన్ అధికారులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరితేజేశ్వరరావు, పోరాట కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేయండి
ఇరు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ కేసులకు సంబంధించిన అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు, న్యాయ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తమ కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించిన కేసుల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జారీ చేస్తున్న ఉత్తర్వులను సవాలు చేసేందుకు అప్పిలేట్ అథారిటీ లేదని, దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ పలు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఇప్పటివరకు అప్పిలేట్ అథారిటీలను ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.