Apsara Reddy
-
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
‘నవ్వుతారు ఎక్కడికైనా వెళ్లిపో అన్నారు.. కానీ ఇప్పుడు!’
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త అప్సరా రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆమె కలిశారు. ఈ నేపథ్యంలో.. ‘మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డికి స్వాగతం పలుకుతున్నాం. సామాజిక నిబంధనలను అధిగమించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు, అవి ఆమోదం పొందేందుకు సుస్మితాదేవ్(కాంగ్రెస్ ఎంపీ) దారులు పరిచారు అంటూ కాంగ్రెస్ మహిళా విభాగం ట్వీట్ చేసింది. తన నియామకం గురించి అప్సరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నీ(ట్రాన్స్‌జెండర్) జీవిత కాలంలో ఎటువంటి అద్భుతాలు జరగవనే జరగవు. నిన్ను చూసి నవ్వుతారు. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలే నేను విన్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాలాంటి వారికి వెటకారాలు, వెక్కిరింపులు కొత్తేం కాదు. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్ల తరపున నా గొంతు బలంగా వినిపిస్తాను. భారత్‌లోని అతిపెద్ద, సుదీర్ఘ చరిత్ర గల పార్టీలో నాకు ఈ పదవి దక్కడం... ఉద్వేగానికి గురిచేస్తోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కాగా 134 ఏళ్ల పార్టీ చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇటువంటి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అప్సరారెడ్డి 2016లో ఏఐఏడీఎంకే(అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత శశికళ అనుకూల వర్గానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. Apsara Reddy has been appointed the first transgender National General Secretary of @MahilaCongress by Congress President @RahulGandhi pic.twitter.com/qDTZSgaoMH — Congress (@INCIndia) January 8, 2019 Welcoming Apsara Reddy to @MahilaCongress As @sushmitadevmp puts it the path for inclusivity comes through acceptance and compassion beyond the set societal norms.#Womenpositive https://t.co/pG3AnmPc6J — All India Mahila Congress (@MahilaCongress) January 8, 2019 -
పన్నీర్ ఎన్ని ఎత్తులు వేసినా.. వృథా ప్రయాసే!
చెన్నై: సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న అన్నాడీఎంకే శాసనసభాపక్షనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ.. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించలేదని పోలీసులు తేల్చడం పన్నీర్ సెల్వం వర్గానికి కాస్త మింగుడు పడని విషయమే. తమను ఎవరూ నిర్బంధించలేదని ఎమ్మెల్యేలు చెప్పినట్లు మద్రాస్ హైకోర్టుకు పోలీసులు నివేదిక అందజేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. అమ్మ వీరవిధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం సీఎం కుర్చీ కోసం ఎన్ని జిత్తులు వేసినా, ఎలాంటి కుట్రలకు పాల్పడ్డా అవన్నీ వృథా ప్రయాసే అవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం శశికళ అవుతారని తమ పార్టీ నేతలకు నూటికి నూరుపాళ్లు నమ్మకం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసత్వాన్ని చిన్నమ్మ శశికళ అందిపుచ్చుకుంటారని ధీమా వ్యక్తంచేశారు. బలమైన నాయకురాలిగా, మంచి పాలనాదక్షురాలుగా శశికళ పేరు తెచ్చుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు శశికళకే ఉందని, ఆమెనే సీఎం పీఠాన్ని అధిష్టిస్తారని అన్నారు. జయలలితకు సన్నిహితురాలిగా ఉంటూ పరిపాలనను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక ఆమెపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మహాబలిపురం సమీపంలోని కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టులో ఉన్న 119 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. తమను ఎవరూ బంధించలేదని, స్వచ్ఛందంగా అక్కడ ఉంటున్నట్లు నేటి ఉదయం వారు పోలీసులకు వెల్లడించారు. దీంతో పన్నీర్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం శశికళ మరోసారి రిసార్టుకు వెళ్లడం.. తనకు మద్ధతివ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పన్నీర్ క్యాంపులో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడంలేదని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు కథనాలు చదవండి... తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? ఢిల్లీని ఢీ కొడతా జయలలిత చనిపోయినపుడే తెలిసింది