apuwj leaders
-
మీడియా పై దాడి సిగ్గు చేటు.. కూటమి నేతలపై జర్నలిస్టులు ఫైర్
-
జర్నలిస్టులకు వైఎస్ జగన్ హామీ
సాక్షి, సామర్లకోట/తూర్పుగోదావరి: జర్నలిస్టులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు సోమవారం పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామినిచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేత స్వాతి ప్రసాద్ ప్రత్యేక హోదా సాధన కోసం రేపు (జూలై 24న) వైఎస్సార్ సీపీ చేపట్టనున్న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు. -
ఎమ్మెల్యేను కలిసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఇంటి నివేశన స్థలాల కేటాయింపు కోసం అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆదివారం స్థానిక ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగా రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విన్నవించారు. నగరంలో అనేక మంది విలేకరులు నివేశన స్థలాలు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. వీటిలో రాజకీయాలకతీతంగా పనిచేస్తున్న ప్రతి విలేకరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విలేకరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలో ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్‌నాయుడు, మార్కండేయులు, నగర కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ ఖాన్, కార్యదర్శి మైనుద్దీన్, ట్రెజరర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.