సాక్షి, సామర్లకోట/తూర్పుగోదావరి: జర్నలిస్టులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు సోమవారం పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామినిచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేత స్వాతి ప్రసాద్ ప్రత్యేక హోదా సాధన కోసం రేపు (జూలై 24న) వైఎస్సార్ సీపీ చేపట్టనున్న రాష్ట్ర బంద్‌లో పాల్గొంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment