ఆగస్టు 20న ఆక్వాపోనిక్స్పై శిక్షణ
అత్యాధునిక రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ (ఆక్వాపోనిక్స్) పద్ధతిలో.. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో మంచినీటి చేపల అధిక దిగుబడి సాధించడంపై ఆగస్టు 20వ తేదీన యువ ఆక్వా రైతు శాస్త్రవేత్త విశ్వనాథరాజు శిక్షణ ఇవ్వనున్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం గండేడ్ గ్రామంలో గల తన ఆధునిక చేపల సాగు క్షేత్రంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ ఇస్తారు. ఆక్వాపోనిక్స్ పద్ధతిలో చేపల సాగుకు తెలంగాణ ప్రభుత్వం 50% సబ్సిడీ ఇవ్వడానికి సుముఖత తెలిపిందని విశ్వనాథరాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు ఆయనను 90302 28669 నంబరులో సంప్రదించవచ్చు.