arcitic
-
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్‌లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్‌లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు..
భూ గ్రహ సహజ కవచం ఓజోన్ పొరకు మరో పెద్ద చిల్లు పడినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూ ఉత్తరార్థ గోళంలో కనుగొన్న ఈ రంధ్రం... గ్రీన్‌ల్యాండ్ కంటే మూడు రెట్ల అధిక పరిమాణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే ప్రజలపై దుష్పభావం పడుతుందని.. అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ రంధ్రం తొందర్లోనే దానంతట అదే పూడుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తాజాగా జర్నల్ నేచర్‌తో మాట్లాడిన యూరోపియన్ అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి జర్మన్ గగనతల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న శాస్త్రవేత్త మార్టిన్ డేమ్రీస్ మాట్లాడుతూ..‘‘నా ఉద్దేశం ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొరలో అతి పెద్ద రంధ్రాన్ని గుర్తించడం ఇదే తొలిసారి’’అని పేర్కొన్నారు. కాగా కాలుష్యం వల్ల ఓజోన్ పొర రోజురోజుకీ పలుచబడుతున్న విషయం తెలిసిందే. దీంతో సాధారణంగా ప్రతీ ఏడాది అంటార్కిటికాపై కాలుష్య మేఘాలు కమ్ముకోవడం వల్ల ఓజోన్‌లో రంధ్రాలు ఏర్పడుతున్నాయి. దీంతో దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఓజోన్‌పొర తీవ్రంగా దెబ్బతింది. అయితే ఆర్కిటిక్‌లో మాత్రం ఇలాంటి పరిణామాలు అరుదు. ఈ ఏడాది బలమైన పవనాలు వీచి.. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై మేఘాలు దట్టంగా కమ్ముకున్నందు వల్ల అక్కడ ఇలాంటి అరుదైన విషయం చోటుచేసుకుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం నెమ్మదిగా సూర్య కిరణాల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ పరిస్థితిని అధిగమించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఓజోన్ పొర దెబ్బతింటే భూమ్మీద అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా మానవుల్లో చర్మ క్యాన్సర్ సహా వివిధ క్యాన్సర్లు, క్యాటరాక్ట్ వంటి కంటిజబ్బులు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. ఇక పంటలు కూడా దెబ్బతింటాయి. వృక్షజాతుల్లో కిరణజన్య సంయోగ క్రియకు విఘాతం ఏర్పడి వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఆహార లభ్యతకు విఘాతం కలుగుతుంది. అంతేగాకుండా అతి నీలలోహిత కిరణాల ప్రభావం వల్ల సముద్రాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. పెంపుడు జంతువులకు కూడా వివిధ క్యాన్సర్లు సోకుతాయి. అన్నీ వెరసి ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. అతి నీలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటే కలప, దుస్తులు, రబ్బరు వంటి పదార్థాలు కూడా త్వరగా నశిస్తాయి. ఇక ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి కరోనా ఉద్భవించి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వేళ.. ఇప్పటికైనా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని ప్రకృతి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తిమింగలంతో ఆట.. ఎంత బాగుందో!!
సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే యజమానుల మాటల్ని బుద్ధిగా వింటాయి. చెప్పిన పని చేస్తాయి. కోతి, కుక్క వంటి జంతువులే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా బెలుగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్కిటిక్ ధ్రువంలో ప్రయాణించిన కొంతమంది వ్యక్తులు.. బెలుగాతో తాము ఆడిన బంతి ఆట వీడియో షేర్ చేయడమే ఇందుకు కారణం. వివరాలు.. జెమిని క్రాఫ్ట్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆర్కిటిక్ ధ్రువానికి షికారుకు వెళ్లాడు. బోటులో ప్రయాణిస్తున్న సమయంలో బెలుగా తిమింగలంతో సరదాగా ఆటలు ఆడారు. రగ్బీ ఆట అభిమానులైన క్రాఫ్ట్ బృందం రగ్బీ బంతిని నీళ్లలోకి విసురుతూ ఉంటే బెలుగా.. తిరిగి దానిని వాళ్లకు తెచ్చి ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది. ఈ క్రమంలో... ‘తిమింగలంతో బంతి ఆట. భలే సరదాగా ఉంది. ఈరోజు చూసిన వీడియోల్లో ఇదెంతో కూల్‌గా ఉంది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ వివరాల ప్రకారం.. బెలుగా తిమింగలాలు ఇతర ప్రాణులతో స్నేహం చేయడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈలలు, చప్పట్లు తదితర శబ్దాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఇతరులు ఇచ్చే సూచనలను పాటిస్తాయి. -
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
-
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
ఏటేటా పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా భూమి ఉత్తరధ్రువంలోని ఆర్కిటిక్ మంచుకొండలు మరో 23 ఏళ్లలో, అంటే 2040 సంవత్సరం వచ్చే ఎండాకాలంలో పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతంలో అంచనావేసిన దానికన్నా 30 ఏళ్ల ముందే ఆర్కిటిక్ మంచుకొండలు కరిగిపోతాయన్నది వారి తాజా అంచనా. గత 30 ఏళ్లలో సగానికి సగం మంచుకొండలు కరగిపోయాయి. ఇప్పటికే మొత్తంగా మూడొంతుల మంచుకొండలు కరిగిపోగా, మిగిలిన నాలుగో వంతు భాగం రానున్న 23 ఏళ్లలో కరిగిపోతుంది. మంచుకొండలు కరిగిపోవడం వల్ల నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర యూరప్ నుంచి ఈశాన్య ఆసియాకు వెళ్లాలంటే సూయెజ్ కెనాల్ మీది నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆర్కిటిక్ మంచు కొండలు కరిగిపోతే ఉత్తర జలమార్గంలో దూరం ఐదింట రెండు వంతులు తగ్గుతుంది. దక్షిణ హాలండ్‌లోని ప్రధాన ఓడరేవు అయిన రోటర్‌డామ్ నుంచి జపాన్‌లోని యొకోహమా, షాంఘై నగరాలకు ఉత్తర జలమార్గం ద్వారా త్వరగా చేరుకోవచ్చు. రోటర్‌డామ్ నుంచి యొకోహమాకు మధ్య 3,840 నాటికల్ మైళ్ల దూరం ఉంది. ఈ దూరం ప్రయాణించడానికి 9 రోజులు పడుతుంది. 2,361 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న షాంఘై నగరానికి చేరుకోవాలంటే ఐదున్నర రోజులు పడుతుంది. ప్రస్తుతం సూయజ్ కాలువ మీదుగా దక్షిణ ధ్రువాన్ని చుట్టి పోవాల్సి వస్తోంది. 2040 నాటికి ఆర్కిటిక్ సముద్రంలోని మంచు కొండలు కరిగిపోయినా ఆ మార్గం గుండా నౌకాయానం చేసే అవకాశం ఉంటుందో, లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని కారణంగా దక్షిణ ధ్రువ ప్రాంతాలకన్నా సముద్ర జలాలు వేగంగా వేడెక్కడం, తుఫానులు సంభవించడం, సముద్రం అల్లకల్లోలంగా తయారవడమే అందుకు కారణమని వారంటున్నారు. ఉత్తర జలమార్గం కోసం ఉత్తరధ్రువ ప్రాంతాల్లోని దేశాలన్నీ పరస్పర రవాణా ఒప్పందాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాయి.